కాస్‌గంజ్
కాస్‌గంజ్
कासगंज | |
---|---|
పట్టణం | |
Nickname: కాస్‌గంజ్ | |
Coordinates: 27°48′30″N 78°38′45″E / 27.80833°N 78.64583°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
విస్తీర్ణం | |
• Total | 22.18 కి.మీ2 (8.56 చ. మై) |
Elevation | 177 మీ (581 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,01,241 |
• జనసాంద్రత | 4,600/కి.మీ2 (12,000/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 207123 |
కాస్‌గంజ్ ఉత్తర ప్రదేశ్, కాస్‌గంజ్ జిల్లా లోని పట్టణం, ఆ జిల్లాకు ముఖ్య పట్టణం. 2008 ఏప్రిల్ 17 న కాస్‌గంజ్, పాటియాలి, సహవార్ అనే మూడు తహసీళ్ళను చేర్చి ఈ జిల్లాను ఏర్పరచారు. [1]
భౌగోళికం
[మార్చు]కాస్‌గంజ్ 27°49′N 78°39′E / 27.82°N 78.65°E వద్ద. సముద్ర మట్టం నుండి 177 మీటర్ల ఎత్తున, కాశీ నది ఒడ్డున ఉంది. ఈ పట్టణం హిమాలయ పర్వత ప్రాంతానికి సమీపంలో, దోఅబ్‌లో ఉంది. పవిత్ర నదులైన గంగ, యమునల మధ్య ఉండడం చేత ఈ భూమి, అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఒకటి. చుట్టుపక్కల గ్రామాలు పెద్ద సంఖ్యలో వ్యవసాయం, సంబంధిత ఆర్థిక కార్యకలాపాలపై ఆధారపడి ఉంటాయి. కాస్‌గంజ్ బ్లాక్ 1956 జనవరి 26 లో ఏర్పాటైంది.
శీతోష్ణస్థితి
[మార్చు]కాస్‌గంజ్‌లో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంది. హిమాలయాల పర్వత పాదాలకు ఎంతో దూరంలో లేని ఈ పట్టణంలో, శీతాకాలం మితంగా ఉంటుంది, ఉష్ణోగ్రత కొన్నిసార్లు సున్నా డిగ్రీలకు చేరుకుంటుంది. వేసవికాలం వేడిగా, పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగానే ఉంటాయి. వర్షాకాలం జూన్ చివరి నుండి సెప్టెంబరు వరకు ఉంటుంది. వర్షాకాలంలో దాదాపు రోజూ జల్లులు పడడం అసాధారణమైన విషయమేమీ కాదు. అక్టోబరు నుండి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలం, డిసెంబరు నుండి ముదురుతుంది.
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, కాస్‌గంజ్ జనాభా 1,01,241, వీరిలో పురుషులు 53,507, మహిళలు 47,734. అక్షరాస్యత 77.36%. [2]
మూలాలు
[మార్చు]- ↑ "About District | Kasganj | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-03.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.