Coordinates: 27°34′30″N 81°35′38″E / 27.575°N 81.594°E / 27.575; 81.594

బహ్‌రైచ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బహ్‌రైచ్
పట్టణం
బహ్‌రైచ్ గడియార స్థంభం
బహ్‌రైచ్ గడియార స్థంభం
బహ్‌రైచ్ is located in Uttar Pradesh
బహ్‌రైచ్
బహ్‌రైచ్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 27°34′30″N 81°35′38″E / 27.575°N 81.594°E / 27.575; 81.594
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబహ్‌రైచ్
Area
 • Total34 km2 (13 sq mi)
Elevation
126 మీ (413 అ.)
Population
 (2011)[1]
 • Total1,86,223
 • Density5,500/km2 (14,000/sq mi)
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
271801
టెలిఫోన్ కోడ్+91 05252
Vehicle registrationUP-40
లింగ నిష్పత్తి892 /

బహ్‌రైచ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం, బహ్‌రైచ్ జిల్లా ముఖ్య పట్టణం. ఘఘారా నదికి ఉపనది అయిన సరయూ నది ఒడ్డున ఈ పట్టణం ఉంది. ఉన్న ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు ఈశాన్యంగా 125 కి.మీ. దూరంలో ఉంది. బారాబంకి, గోండా, బల్రాంపూర్, లఖింపూర్ ఖేరి, శ్రావస్తి, సీతాపూర్ జిల్లాలు బహ్‌రైచ్‌ జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది .

భౌగోళికం, శీతోష్ణస్థితి[మార్చు]

బహ్‌రైచ్ సముద్ర మట్టం నుండి 126 కి.మీ. ఎత్తున ఉంది. బహ్‌రైచ్‌లో వేడి, తేమలతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. ఏప్రిల్ నుండి జూలై వరకు వేసవి కాలం ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు మధ్య వరకు ఉండే వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల వలన వర్షం కురుస్తుంది. అప్పుడప్పుడు జనవరిలో కూడా వర్షం పడుతుంది. శీతాకాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 25 °C, కనిష్ఠం -1 నుండి 7 °C వరకు ఉంటుంది. పొగమంచు డిసెంబరు చివరి నుండి జనవరి చివరి వరకు ఉంటుంది.. వేసవిలో ఉష్ణోగ్రతలు 40 నుండి 47 °C వరకు వెళ్తాయి. సగటు వార్షిక వర్షపాతం 1900 మి.మీ. ఉంటుంది [3]

శీతోష్ణస్థితి డేటా - Bahraich (1981–2010, extremes 1901–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 29.1
(84.4)
35.2
(95.4)
41.0
(105.8)
44.6
(112.3)
45.8
(114.4)
47.6
(117.7)
44.4
(111.9)
39.2
(102.6)
39.4
(102.9)
38.6
(101.5)
35.2
(95.4)
31.7
(89.1)
47.6
(117.7)
సగటు అధిక °C (°F) 21.6
(70.9)
26.1
(79.0)
32.1
(89.8)
37.3
(99.1)
37.9
(100.2)
36.8
(98.2)
33.2
(91.8)
32.9
(91.2)
32.8
(91.0)
32.3
(90.1)
29.0
(84.2)
24.3
(75.7)
31.4
(88.4)
సగటు అల్ప °C (°F) 9.1
(48.4)
11.8
(53.2)
16.3
(61.3)
21.6
(70.9)
25.2
(77.4)
26.9
(80.4)
26.6
(79.9)
26.5
(79.7)
25.3
(77.5)
21.1
(70.0)
15.1
(59.2)
10.6
(51.1)
19.7
(67.4)
అత్యల్ప రికార్డు °C (°F) 0.6
(33.1)
0.6
(33.1)
5.6
(42.1)
11.1
(52.0)
13.5
(56.3)
18.3
(64.9)
18.7
(65.7)
21.1
(70.0)
18.3
(64.9)
12.2
(54.0)
5.0
(41.0)
1.7
(35.1)
0.6
(33.1)
సగటు వర్షపాతం mm (inches) 20.9
(0.82)
18.6
(0.73)
12.0
(0.47)
11.9
(0.47)
51.4
(2.02)
189.6
(7.46)
332.6
(13.09)
284.9
(11.22)
245.3
(9.66)
57.3
(2.26)
4.5
(0.18)
11.7
(0.46)
1,240.7
(48.84)
సగటు వర్షపాతపు రోజులు 1.4 1.5 1.2 1.3 3.2 7.3 12.3 12.0 8.4 2.1 0.3 0.8 51.8
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 69 56 40 29 38 53 73 76 75 66 65 70 59
Source: India Meteorological Department[4][5]

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బహ్‌రైచ్ మొత్తం జనాభా 1,86,223, వీరిలో 97,653 మంది పురుషులు, 88,570 మంది మహిళలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల జనాభా 24,097. బహ్‌రైచ్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 119,564, ఇది జనాభాలో 64.2%, పురుషులలో అక్షరాస్యత 66.5%, స్త్రీలలో అక్షరాస్యత 61.7%. బహ్‌రైచ్ జనాభాలో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 73.7%, ఇందులో పురుషుల అక్షరాస్యత 76.4%, స్త్రీ అక్షరాస్యత 70.8%. షెడ్యూల్డ్ కులాల జనాభా 9,584 కాగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 170. 2011 లో బహ్‌రైచ్‌లో 30,460 గృహాలు ఉన్నాయి.[1]

రవాణా[మార్చు]

రోడ్లు[మార్చు]

బహ్‌రైచ్ నుండి ఇతర ప్రాంతాలకు రోడ్డు సౌకర్యాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సంస్థలు పట్టణం నుండి లక్నో, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, బరేలీ, హరిద్వార్, ఢిల్లీ, జైపూర్ బలరామ్పూర్, గోండా, బారాబంకి, ప్రతాప్గఢ్, సిమ్లా, మథుర, ఝాన్సీ, జౌన్పూర్, గోరఖ్పూర్, వారణాసి, శ్రావస్తి, ఆగ్రా వంటి పలు ప్రదేశాలకు బస్సులు నడుపుతున్నాయి. లక్నోకు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుంది. జాతీయ రహదారి 927 పట్టణం నుండి బారాబంకీకి, రాష్ట్ర రాజధాని లక్నోకు వెళ్తుంది .

రైల్వేలు[మార్చు]

బహ్‌రైచ్ రైల్వే స్టేషన్ ఉత్తర ప్రదేశ్ లోని బహ్‌రైచ్ జిల్లాలో ఒక ప్రధాన రైల్వే స్టేషన్. దీని కోడ్ BRK . ఈ స్టేషన్‌లో రెండు బ్రాడ్ గేజ్ ప్లాట్‌ఫారాలు, ఒక మీటర్ గేజ్ ప్లాట్‌ఫారము ఉన్నాయి.[6]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Census of India: Bahraich". www.censusindia.gov.in. Retrieved 9 October 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 23 నవంబరు 2020.
  3. "District Industrial Profile of Bahraich district" (PDF). MSME-Development Institute -Allahabad, Government of India Ministry of MSME. Archived from the original (PDF) on 12 ఏప్రిల్ 2015. Retrieved 20 November 2019.
  4. "Station: Bahraich Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 65–66. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 May 2020.
  5. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M212. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 May 2020.
  6. "327 करोड़ से बहराइच व गोरखपुर रेल लाइन का होगा विद्युतीकरण". Amar Ujala (in హిందీ). 24 July 2020. Retrieved 26 August 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=బహ్‌రైచ్&oldid=3798681" నుండి వెలికితీశారు