Jump to content

గ్రేటర్ నోయిడా

అక్షాంశ రేఖాంశాలు: 28°28′N 77°31′E / 28.47°N 77.51°E / 28.47; 77.51
వికీపీడియా నుండి
Greater Noida
City
Aerial view of Greater Noida (2011)
Aerial view of Greater Noida (2011)
Nickname(s): 
GreNo, Commercial Hub
Motto: 
Planned with an obsession
Greater Noida is located in Uttar Pradesh
Greater Noida
Greater Noida
Location in Uttar Pradesh
Greater Noida is located in India
Greater Noida
Greater Noida
Location in India
Coordinates: 28°28′N 77°31′E / 28.47°N 77.51°E / 28.47; 77.51
CountryIndia
StateUttar Pradesh
DivisionMeerut
DistrictGautam Buddha Nagar
Establishedజనవరి 28, 1991; 33 సంవత్సరాల క్రితం (1991-01-28)
Government
 • TypeGovernment of Uttar Pradesh
 • BodyGreater Noida Authority
 • Chairman, Greater Noida AuthorityAlok Tandon, IAS
 • CEO, Greater Noida AuthoritySurendra Singh, IAS[2]
 • Commissioner, Meerut DivisionAnita Meshram, IAS
 • District Magistrate and CollectorManish Kumar Verma, IAS[3]
విస్తీర్ణం
 • Total380 కి.మీ2 (150 చ. మై)
జనాభా
 (2011)
 • Total1,07,676[1]
Language
 • OfficialHindi[5]
 • Additional officialUrdu[5]
 • OtherEnglish
Time zoneUTC+5:30 (IST)
PIN
201310
Telephone code0120
Vehicle registrationUP-16, DL16
Nearest cityNoida
Literacy87%
Lok Sabha ConstituencyGautam Buddha Nagar
ExpresswaysNoida-Greater Noida Expressway, Yamuna Expressway and Eastern Peripheral Expressway
SportsBuddh International Circuit, Jaypee Sports City, Jaypee Sports Complex and Greater Noida Cricket Stadium
Golf CourseJaypee Greens Godrej Golf Links Golf Course

గ్రేటర్ నోయిడా, భారతదేశం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఉన్న ఒక ప్రణాళికాబద్ధమైన నగరం. [6] యుపి పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చట్టం 1976 ప్రకారం నోయిడా ప్రాంతానికి పొడిగింపుగా నగరం సృష్టించబడింది.[7] ఇది న్యూ ఢిల్లీ రాజధాని నగరానికి ఆగ్నేయంగా 30 కి.మీ.దూరంలో ఉంది. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి సుమారు 30 నిమిషాలు పడుతుంది. నగర పరిపాలన గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీచే సాగుతుంది. [8]

వ్యుత్పత్తి శాస్త్రం

[మార్చు]

ప్రారంభంలో డెవలపర్లు నోయిడా నుండి వేరు చేయడానికి "నోయిడా ఎక్స్‌టెన్షన్" అనే పదాన్ని ఉపయోగించారు. కానీ తరువాతి నోయిడా ప్రక్కనే ఉన్నందున, గ్రేటర్ నోయిడా అథారిటీ తర్వాత ఈ ప్రాంతాన్ని 'గ్రేటర్ నోయిడా వెస్ట్' గా సూచిస్తామని ప్రకటించింది. [9]

చరిత్ర

[మార్చు]
Ravana
ఉత్తర ప్రదేశ్ లోని బిస్రఖ్, రాక్షస రాజు రావణుడి జన్మస్థలం [10]

1980ల ప్రారంభంలో ఢిల్లీ నగరం వేగంగా విస్తరిస్తున్న సందర్బంలో ఈ పరిస్థితి గందరగోళానికి దారితీస్తుందని భారత ప్రభుత్వం గ్రహించింది. అందువల్ల, జనాభా భారాన్ని తగ్గించడానికి రాజధాని చుట్టూ నివాస, పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వారు ఒక ప్రణాళికను తయారుచేసారు.అందులో భాగంగా గ్రేటర్ నోయిడా నగరానికి ముందు హర్యానా సరిహద్దులో గుర్గావ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులో నోయిడా రెండు ప్రాంతాలు అభివృద్ధి చేసారు.

గ్రేటర్ నోయిడా 38,000 హెక్టార్లు (380 చ.కి.మీ.) ప్రకటిత విస్తీర్ణంతో 124 గ్రామాలను కలిగి ఉంది.నోయిడా అవస్థాపన జాగ్రత్తగా రూపొందించారు. అయితే 1990లలోభారత ఆర్థిక వ్యవస్థలో భారీ వృద్ధి కనిపించింది.ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాలకు వలసలు, ప్రణాళిక అంచనాలను మించిపోయాయి. నోయిడా 20-25 సంవత్సరాలు జనాభా పెరుగుదలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడింది. అయితే, ఢిల్లీ నుండి భారీ జనాభా వలసల ప్రవాహం కేవలం 15 సంవత్సరాలలో అధిక జనసాంధ్రతకు దారితీసింది. అయినప్పటికీ చర్యలుతీసుకోవడం పూర్తి కాలేదు. ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ ఒక సమస్యగా మిగిలింది. [11]

షాహీద్ బిస్మిల్ పార్క్, గ్రేటర్ నోయిడా సిటీలోని సెక్టార్-బీటా 1

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మెరుగైన ప్రణాళికతో నోయిడాకు పొడిగింపుగా మరో నగరాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.నోయిడా నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ప్రపంచ స్థాయి పట్టణాన్ని రూపొందించాలనే ఆలోచన వచ్చింది.గ్రేటర్ నోయిడాను స్వతంత్ర నగరంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో బోరాకి సమీపంలో ఒక రైల్వే స్టేషన్, అంతర్జాతీయ విమానాశ్రయం తరువాత ఏర్పడ్డాయి.

1990లలో నోయిడా పొడిగింపు (ప్రస్తుతం గౌతమ్ బుద్ధ నగర్‌లో ఒకభాగం) నేడు దానిని గ్రేటర్ నోయిడాగా పిలువబడుతుంది.గ్రేటర్ నోయిడా అథారిటీ నగర అభివృద్ధిని నిర్వహిస్తుంది. గ్రేటర్ నోయిడా ఆరు వరసల యమునా ఎక్స్‌ప్రెస్ రహదారి ద్వారా ఆగ్రాకు అనుసంధానించబడింది. వార్షిక ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో, ప్రతి ప్రధాన రహదారికి సర్వీస్ లేన్లతో రోడ్లు విశాలంగా ఉండేట్లు పనులు జరిగాయి. సెక్టార్‌లకు గ్రీకు వర్ణమాల అక్షరాలతో పేరు పెట్టారు. అన్నియుటిలిటీస్ కేబులింగ్స్ భూగర్భంలో నిర్మించబడ్డాయి.ఆల్ఫా, బీటా, గామా పురాతన రంగాలు. ప్రస్తుత గ్రేటర్ నోయిడా ప్రధాన కార్యాలయం గామాలో ఉంది.1919లో విప్లవకారుడు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ నివసించిన చారిత్రక గ్రామం రాంపూర్ జాగీర్, జహంగీర్‌కి ఎదురుగా II సెక్టారులో ఉంది. మెయిన్‌పురి కుట్ర తర్వాత అతను భూగర్భంలో దాగి ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉద్యానవనానికి "అమర్ షహీద్ పండిట్. రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉద్యాన్" అని పేరు పెట్టింది. [12]

భౌగోళికం

[మార్చు]

గ్రేటర్ నోయిడా వెస్ట్ లేదా నోయిడా ఎక్స్‌టెన్షన్ (గ్రెనో వెస్ట్)

[మార్చు]

గ్రేటర్ నోయిడా వెస్ట్, గతంలో నోయిడా ఎక్స్‌టెన్షన్‌గా పిలువబడేది. ఇది గ్రేటర్ నోయిడాలో ఒక భాగం. ఇది ఉత్రప్రదేశ్ లోని నగర్ జిల్లాలో జాతీయ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉప నగరం, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సి.ఆర్) మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగం. గ్రేటర్ నోయిడా పశ్చిమ దాదాపు 3,635 హెక్టార్లలో విస్తరించి ఉంది.ఇది సెక్టారు 121 నోయిడా నుండి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది గ్రేటర్ నోయిడా అథారిటీలో భాగం.

జనాభా శాస్త్రం

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, గ్రేటర్ నోయిడాలో 107,676 మంది జనాభా ఉన్నారు.వారిలో 58,662 మంది పురుషులు కాగా, 49,014 మంది స్త్రీలు ఉన్నారు. అక్షరాస్యత రేటు 86.54%, పురుషులు అక్షరాస్యత రేటు 91.48%. స్త్రీల అక్షరాస్యత రేటు 80.65%.[13]

ప్రభుత్వం, రాజకీయాలు

[మార్చు]

అధికారం

[మార్చు]

నగర మౌలిక సదుపాయాలను గ్రేటర్ నోయిడా పారిశ్రామిక అభవృద్ధి సంఘం చూసుకుంటుంది.ఇది ఉత్తర ప్రదేశ్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి చట్టం1976 ప్రకారం ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన అధికారక సంస్థ. [7] అథారిటీ అధిపతిగా ఐఎఎస్ కేడర్ అధికారి దానికి ఛైర్మన్ హోదాలో ఉంటాడు.అయితే దాని అధికారక రోజువారీ విషయాలు సిఇఒ హోదాలో ఉన్న ఐఎఎస్ అధికారి చూసుకుంటాడు. గ్రేటర్ నోయిడా అథారిటీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి శాఖ క్రిందకు వస్తుంది. 2019 సెప్టెంబరు నాటికి, చైర్మనుగా అలోక్ టాండన్, సిఇఒగా నరేంద్ర భూషన్ కొనసాగుచున్నారు. [14]

రవాణా

[మార్చు]

మెట్రో అను సంధానం

[మార్చు]

నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ 2019 జనవరి 25 న గ్రేటర్ నోయిడాలో మెట్రో అనుసంధాన కార్యక్రమం ప్రారంభించింది [15] [16] మెట్రో ప్రధానంగా నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే మీదుగా నడుస్తుంది.2022 నవంబరులో, గ్రెనో వెస్ట్‌లో నోయిడా మెట్రో నిర్మాణం ప్రారంభమైంది. [17]

చదువు

[మార్చు]

పాఠశాలలు

[మార్చు]
  • ఎఫ్.ఆర్. అగ్నెల్ పాఠశాల
  • ఢిల్లీ పబ్లిక్ పాఠశాల, గ్రేటర్ నోయిడా
  • గ్రేటర్ వ్యాలీ పాఠశాల, గ్రేటర్ నోయిడా
  • ర్యాన్ అంతర్జాతీయ పాఠశాల

విశ్వవిద్యాలయాలు

[మార్చు]
  • అమిటీ విశ్వవిద్యాలయ క్యాంపస్ గ్రేటర్ నోయిడా
  • బెన్నెట్ విశ్వవిద్యాలయం
  • గల్గోటియాస్ విశ్వవిద్యాలయం
  • గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయం
  • శారదా విశ్వవిద్యాలయం
  • శివ్ నాడార్ విశ్వవిద్యాలయం

కళాశాలలు, సంస్థలు

[మార్చు]
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ
  • ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ, గ్రేటర్ నోయిడా
  • గల్గోటియాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  • గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయం
  • ఐటిఎస్ డెంటల్ కళాశాల
  • లాయిడ్ లా కళాశాల
  • పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ

క్రీడలు

[మార్చు]

ఈ నగరం యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఉన్న జేపీ స్పోర్ట్స్ నగరం, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మైదానం, హాకీ మైదానం, అంతర్జాతీయ ఫార్ములా 1 రేసింగ్ సర్క్యూట్ వంటి వివిధ క్రీడావేదికలతో పూర్తి క్రీడలకోసం ఉద్దేశించిన ప్రణాళికాబద్ధమైన నగరం. [18]


గ్రేటర్ నోయిడా క్రికెట్ స్టేడియం, దీనిని "షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్టేడియం" అని కూడా పిలుస్తారు.ఇది జేపీ గ్రీన్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో ఉంది. ఈ స్టేడియం 2015 డిసెంబరు 1 నుండి 4 వరకు ఉత్తర ప్రదేశ్, బరోడా మధ్య జరిగిన మొదటి రంజీ ట్రోఫీ ఆటకు ఆతిథ్యం ఇచ్చింది [19] ఈ మైదానాన్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు తన హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగిస్తిుంది. [20]

జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గ్రేటర్ నోయిడా మైదానంలో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించాడు.[21] జేపీ గ్రీన్స్ గోల్ఫ్ కోర్స్, గ్రెగ్ నార్మన్ రూపొందించిన 18 రంధ్రాల, పార్-72 కోర్సు గ్రేటర్ నోయిడాలో ఉంది. [22] ఈ కోర్సు 2000 జూన్ లో ప్రారంభించారు.ఇది 2011లో భారతదేశ పర్యాటక మంత్రిత్వ శాఖ నుండి "టూరిజం ఫ్రెండ్లీ గోల్ఫ్ కోర్స్" అవార్డును అందుకుంది [23] [24] ఇది భారతదేశంలోనే అతి పొడవైన కోర్సుగా ప్రసిద్ధి చెందింది.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  • అర్జున్ భాటి, భారతీయ టీనేజ్ గోల్ఫ్ క్రీడాకారుడు
  • వరుణ్ సింగ్ భాటి, పారా హైజంపర్

మూలాలు

[మార్చు]
  1. "Provisional Population Totals, Census of India 2011, Urban Agglomeration/Cities having population 1 lakh and above". Government of India. Retrieved 19 October 2012.
  2. "Gr Noida Authority Launches 2 More Online Services". The Times of India (in ఇంగ్లీష్). 15 June 2022. Retrieved 16 June 2022.
  3. "DM Contact | GautamBuddha Nagar | India". gbnagar.nic.in. Retrieved 8 September 2023.
  4. "About Us | Greater Noida". www.greaternoidaauthority.in. Retrieved 22 November 2020.
  5. 5.0 5.1 "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 4 January 2019.
  6. "City Population Census 2011 -". census2011.co.in. Retrieved 26 August 2015.
  7. 7.0 7.1 "U.P. INDUSTRIAL AREA DEVELOPMENT ACT – 1976 (U.P. Act Number 6, of 1976)" (PDF). Greater Noida Authority. 1976. Archived from the original (PDF) on 11 May 2015. Retrieved 13 August 2017.
  8. "Welcome to Greater Noida | Greater Noida". www.greaternoidaauthority.in. Retrieved 21 November 2020.
  9. Keelor, Vandana (15 September 2012). "Noida Extension to now be called Greater Noida (West)". The Times of India, Noida News. Retrieved 26 May 2023.
  10. Sarah Hafeez (4 October 2014). "Only the elderly come to mourn Ravana in 'birthplace' Bisrakh". Indian Express.
  11. "Police, mining mafia exchange fire in Noida". the Times of India. 1 May 2014. Archived from the original on 2 May 2014.
  12. "वतन की ख्वाहिशों पे जिंदगानी कुर्बान(en:Sacrifice of life for homeland)". Dainik Jagran (Hindi Jagran City-Greater Noida) New Delhi. 12 August 2012. p. 24.
  13. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.
  14. "Key Management". Greater Noida Authority. Archived from the original on 30 October 2018. Retrieved 25 October 2019.
  15. "Yogi Adityanath Inaugurates 29.7 kilometre Noida-Greater Noida Metro Line". NDTV.com. Retrieved 21 February 2019.
  16. "Metro rail between Noida, Greater Noida by 2017". NDTV. NDTV. 3 October 2013. Retrieved 1 February 2017.
  17. "New Metro Line: Centre's nod Expected in a Week". The Times of India, Noida News. 6 August 2022. Retrieved 17 November 2022.
  18. "Jaypee Greens, Sports City promises destination of the future". The Economic Times. 14 January 2011. Retrieved 26 August 2015.
  19. PTI (4 December 2015). "Ranji Trophy: UP, Baroda end campaign with a draw". The Times of India. Retrieved 4 December 2015.
  20. Lokapally, Vijay (2 December 2015). "Soon a Noida home for Afghan cricketers". The Hindu. Retrieved 28 February 2021.
  21. "Residents waiting eagerly for Pullela Gopichand Academy in Greater Noida". HT Media Ltd. Hindustan Times. 24 August 2016. Retrieved 1 February 2017.
  22. "Avantha Masters shifted from Gurgaon to Jaypee Greens". NDTV. 30 January 2013. Retrieved 23 June 2015.
  23. "Jaypee Greens Golf Course, Greater Noida Awarded as "Best Tourism Friendly Golf Course"". India Infoline Ltd. 30 March 2011. Retrieved 23 June 2015.
  24. "National Tourism Awards 2009–10" (PDF). Ministry of Tourism (India). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 23 June 2015.

వెలుపలి లంకెలు

[మార్చు]