మైన్‌పురి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైన్‌పురి

मैनपुरी
పట్టణం
మైన్‌పురి is located in Uttar Pradesh
మైన్‌పురి
మైన్‌పురి
నిర్దేశాంకాలు: 27°14′N 79°01′E / 27.23°N 79.02°E / 27.23; 79.02Coordinates: 27°14′N 79°01′E / 27.23°N 79.02°E / 27.23; 79.02
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లామైన్‌పురి
సముద్రమట్టం నుండి ఎత్తు
153 మీ (502 అ.)
జనాభా
(2011)
 • మొత్తం1,50,007
భాషలు
 • అధికారికహిందీ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
205001
టెలిఫోన్ కోడ్05672
వాహనాల నమోదు కోడ్UP-84
జాలస్థలిmainpuri.nic.in

మైన్‌పురి ఉత్తర ప్రదేశ్‌, మైన్‌పురి జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది న్యూ ఢిల్లీ నుండి 270 కి.మీ. దూరంలో ఉంది. [1] మైన్‌పురి, శ్రీకృష్ణుడు చరించిన పౌరాణిక ప్రాంతం బ్రజ్ లో భాగం. [2] పట్టణంలో ఇషాన్ నది ప్రవహిస్తోంది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

మైన్‌పురి రైల్వే స్టేషన్ నుండి వివిధ నగరాలకు రైళ్ళున్నాయి. సమీప విమానాశ్రయం 121 కి.మీ దూరంలో.ఆగ్రా వద్ద ఉంది.

వాతావరణం[మార్చు]

Mainpuri (1981–2010, extremes 1901–2005)-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
అత్యధిక °C (°F) 31.4 35.2 41.7 45.8 49.2 49.2 46.2 42.6 42.4 40.6 37.6 33.0 49.2
(nil)
సగటు అధిక °C (°F) 22.7 26.0 31.5 38.3 41.0 40.3 35.2 33.4 33.7 33.5 29.4 24.7 32.4
సగటు అల్ప °C (°F) 7.1 9.6 14.7 21.0 25.4 26.7 25.4 25.0 24.2 19.8 13.8 8.4 18.4
అత్యల్ప °C (°F) -1.7 -0.6 5.0 10.7 15.6 17.6 16.8 18.6 8.2 9.6 2.2 -1.1 -1.7
(nil)
వర్షపాతం mm (inches) 11.3 13.5 8.5 5.7 14.8 71.3 207.7 233.6 159.7 33.4 3.4 6.0 768.9
స. వర్షపు రోజులు 1.1 1.0 0.9 0.5 1.5 3.4 9.1 10.0 7.1 1.8 0.4 0.6 37.4
తేమ % 71 62 53 32 33 43 64 73 71 65 67 73 59
Source: India Meteorological Department[3][4]

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, మైన్‌పురి పట్టణ సముదాయం జనాభా 1,33,078. వీరిలో పురుషులు 69,788, మహిళలు 63,290. అక్షరాస్యత 85.66%. [5]

2001 జనగణన ప్రకారం [6] మైన్‌పురి జనాభా 89,535. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. పట్టణ అక్షరాస్యత 69%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 74%, స్త్రీల అక్షరాస్యత 64%. ఆరేళ్ళ లోపు పిల్లలు మైన్‌పురి జనాభాలో 15% ఉన్నారు. రోజువారీ వ్యవహారాల్‌లో ప్రజలు కన్నౌజీ, బ్రజ్ భాషలను మాట్లాడతారు.

పరిశ్రమ[మార్చు]

పట్టణ జనాభాలో అధిక భాగం వ్యవసాయంపై ఆధారపడి ఉంది. కాటన్ జిన్నింగ్, ఆయిల్‌సీడ్ మిల్లింగ్, దీపం, గాజు తయారీ ఇక్కడి ప్రముఖమైన పరిశ్రమలు. ఈ పట్టణం పొగాకుకు, చెక్క శిల్పాలకూ ప్రసిద్ధి చెందింది. వ్యవసాయ పరికరాల వ్యాపారం ఇక్కడి మరో ప్రధానమైన వ్యాపారం. జిల్లాలోని వ్యవసాయ పరికరాల తయారీదారులలో సియారామ్ ఏజెన్సీ ఒకటి.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-16. Retrieved 2020-11-29.
  2. Subodh Kapoor (2002). The Indian Encyclopaedia: India (Central Provinces)-Indology. Genesis Publishing Pvt Ltd. p. 3432. ISBN 9788177552683.
  3. "Station: Mainpuri Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 461–462. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 22 September 2020. CS1 maint: discouraged parameter (link)
  4. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M219. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 22 September 2020. CS1 maint: discouraged parameter (link)
  5. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.
  6. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.