ఆజంగఢ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆజంగఢ్
పట్టణం
ఆజంగఢ్ రైల్వే స్టేషను
ఆజంగఢ్ రైల్వే స్టేషను
ఆజంగఢ్ is located in Uttar Pradesh
ఆజంగఢ్
ఆజంగఢ్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
నిర్దేశాంకాలు: 26°04′05″N 83°11′02″E / 26.068°N 83.184°E / 26.068; 83.184Coordinates: 26°04′05″N 83°11′02″E / 26.068°N 83.184°E / 26.068; 83.184
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఆజంగఢ్
సముద్రమట్టం నుండి ఎత్తు
64 మీ (210 అ.)
జనాభా
(2011)
 • మొత్తం116,165
భాషలు
 • అధికారికహిందీ[1]
కాలమానంUTC+05:30 (IST)
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్05462
జాలస్థలిazamgarh.nic.in

ఆజమ్‌గఢ్ ఉత్తర ప్రదేశ్‌లోని పట్టణం, ఆజమ్‌గఢ్ జిల్లా ముఖ్యపట్టణం, ఆజమ్‌గఢ్ డివిజన్ ప్రధాన కార్యాలయంకూడా పట్టణం లోనే ఉంది. ఆజమ్‌గఢ్ పట్టణం, తమసా నది (టోన్స్ నది) ఒడ్డున ఉంది. ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు తూర్పున 268 కి.మీ. దూరంలో ఉంది..

చరిత్ర[మార్చు]

ఉత్తర ప్రదేశ్‌లోని తూర్పున ఉన్న జిల్లాల్లో ఒకటైన ( పూర్వంచల్ ఉప ప్రాంతంలోని ఒక జిల్లా) ఆజమ్‌గఢ్, దాని ఈశాన్య భాగాన్ని మినహాయించి మిగతా జిల్లా అంతా ఒకప్పుడు పురాతన కోసల రాజ్యంలో భాగంగా ఉండేది. ఆజమ్‌గఢ్ దుర్వాస మహర్షి భూమి అని కూడా పిలుస్తారు. మహర్షి ఆశ్రమం ఫూల్పూర్ తహసీల్లో ఫూల్పూర్ కు ఉత్తరాన 6 కి.మీ. దూరంలో ఉంది.

పట్టణాన్ని 1665 లో విక్రమజిత్ కుమారుడు ఆజమ్ స్థాపించాడు. విక్రమజిత్, నిజామాబాద్‌ పరగణా లోని మేహనగర్‌కు చెందిన గౌతమ రాజపుత్రు‌ల వారసుడు. అతడి పూర్వీకులలో కొంతమంది లాగానే ఇతడు కూడా ఇస్లాం మతానికి మారిపోయాడు. అతడి భార్య ముస్లిం. అతనికి ఆజమ్, అజ్మత్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆజమ్ పేరునే ఆజమ్‌గఢ్ పట్టణానికి పెట్టగా, అజ్మత్ అక్కడి కోటను నిర్మించాడు. [2] చబైల్ రామ్ దాడి చేసినపుడు అజ్మత్ ఖాన్, ఉత్తరం వైపు పారిపోయాడు.. అతను ఘఘ్రా నదిని దాటి, గోరఖ్‌పూర్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నించాడు. కాని గోరఖ్‌పూర్ ప్రజలు అతని రాకను అడ్డుకున్నారు. అతన్ని నది మధ్యలో ఉండగానే కాల్చి చంపడం వలన గానీ, లేదా ఈదుతూ తప్పించుకునే ప్రయత్నంలో మునిగిపోవడం వలన గానీ అతడు మరణించాడు.

సముద్రమట్టం నుండి ఆజమ్‌గఢ్, 64 మీటర్ల ఎత్తున ఉంటుంది. [3] ఆజంగఢ్ జిల్లాలో నేల సారవంతమైనది. వరి, చెరకు, గోధుమలు, మామిడి, జామ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, ఆవాలు పండుతాయి.

రవాణా[మార్చు]

రోడ్డు[మార్చు]

ఆజమ్‌గఢ్ నుండి రోడ్డు మార్గంలో లక్నో 268 కి.మీ., ఢిల్లీ 761 కి.మీ. దూరంలో ఉంటాయి. ఇది తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని అతిపెద్ద బస్సు డిపోలలో ఒకటి ఉత్తర ప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలకు, ఢిల్లీకీ ఇక్కడి నుండి బస్సులు నడుస్తాయి.

రైలు[మార్చు]

తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో ఆజమ్‌గఢ్ స్టేషన్ చాలా ముఖ్యమైనది. ఆజమ్‌గఢ్‌ నుండి కైఫియత్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి, ముంబై ఎల్‌టిటి - ఆజమ్‌గఢ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ముంబైకి, గోదాన్ ఎక్స్‌ప్రెస్, అహ్మదాబాదుకు, కోవా ఎఎంహెచ్ ఎక్స్‌ప్రెస్ రాష్ట్ర రాజధాని లక్నో, జైపూర్, అజ్మీర్, అమృత్‌సర్‌, కోల్‌కతాలకూ కలుపుతుంది

వైమానిక[మార్చు]

ఆజమ్‌గఢ్‌లో కొత్తగా నిర్మించిన మండూరి విమానాశ్రయం, 9 కి.మీ. దూరంలో ఉంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం, 100 కి.మీ. దూరంలో ఉన్న వారణాసిలో (లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం) ఉంది.

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆజమ్‌గఢ్ పట్టణ సముదాయంలో 1,16,165 జనాభా ఉంది, అందులో పురుషులు 60,678, ఆడవారు 55,487. అక్షరాస్యత రేటు 86 శాతం. [4] 18 వ శతాబ్దం ప్రారంభంలో హిందూ కుష్ పర్వత ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వలస వచ్చిన పఠాన్ల సంఖ్య ఆజమ్‌గఢ్‌లో ఉంది.

వాతావరణం[మార్చు]

వేసవి, శీతాకాలాల ఉష్ణోగ్రతల మధ్య పెద్ద వ్యత్యాసాలతో ఆజమ్‌గఢ్‌లో,తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ( కొప్పెన్ క్లైమేట్ వర్గీకరణ Cwa) ఉంటుంది. [5] [6] వేసవికాలం సుదీర్ఘంగా, ఏప్రిల్ నుండి అక్టోబరు వరకు ఉంటుంది. మధ్యలో వచ్చే వర్షాకాలంలో కూడా చాలా వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రత 22 - 46 oC మధ్య ఉంటుంది. శీతాకాలంలో పగటి రాత్రి ఉష్ణోగ్రతల్లో చాలా తేడా ఉంటుంది. హిమాలయ ప్రాంతం నుండి వచ్చే చల్లని గాలుల వల్ల డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలంలో నగరమంతా ఉష్ణోగ్రతలు 5 oC కంటే దిగువకు పడిపోతాయి. సగటు వార్షిక వర్షపాతం 1100 మి.మీ. శీతాకాలంలో పొగమంచు సాధారణం, లూ అని పిలువబడే వేడి పొడి గాలులు వేసవికాలంలో వీస్తాయి. [7] 

Azamgarh-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
అవక్షేపం mm (inches) 19.3 13.5 10.4 5.4 9.0 100.0 320.6 260.4 231.6 38.3 12.9 4.0 1025.4
Source: [8][9]

అక్షరాస్యత[మార్చు]

2011 లో ఆజమ్‌గఢ్ పట్టణ అక్షరాస్యత 70.93% కాగా, 2001 లో ఇది 56.95%గా ఉండేది. 2011 లో పురుష, స్త్రీ అక్షరాస్యతలు 81.34%, 60.91%. 2001 లో ఇవి 71.04%, 43.40%. [10]

మూలాలు[మార్చు]

  1. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 23 February 2019.
  2. "Origin of Name of Azamgarh :". Archived from the original on 27 June 2014. Retrieved 28 August 2014.
  3. "Falling Rain Genomics, Inc – Azamgarh". Fallingrain.com. Retrieved 30 May 2012.
  4. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.
  5. Singh 1975, p. 4.
  6. Pandey 1989, p. 13.
  7. Singh & Rana 2002, p. 27.
  8. "Seasonal Weather Averages". Weather Underground. December 2010. Archived from the original on 10 ఆగస్టు 2011. Retrieved 22 December 2010., temperature data from Weather Underground
  9. "Varanasi". Indian Meteorology Department. Archived from the original on 9 July 2012. Retrieved 22 December 2010., precipitation data from Indian Meteorology Department
  10. "Azamgarh District : Census 2011 data". Census 2011.co.in. Retrieved 22 May 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆజంగఢ్&oldid=3437519" నుండి వెలికితీశారు