Coordinates: 28°43′51″N 77°46′33″E / 28.730937°N 77.775736°E / 28.730937; 77.775736

హాపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హాపూర్
హరిపూర్
పట్టణం
హాపూర్ is located in Uttar Pradesh
హాపూర్
హాపూర్
ఉతర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 28°43′51″N 77°46′33″E / 28.730937°N 77.775736°E / 28.730937; 77.775736
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాహాపూర్
Elevation
216.1032 మీ (709.0000 అ.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
245101
01225731
Vehicle registrationUP-37
Websitehttp://hapur.nic.in/

హపూర్ ఉత్తర ప్రదేశ్‌ లోని పట్టణం. హాపూర్ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది ఢిల్లీకి తూర్పుగా సుమారు 60 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రాజధాని ప్రాంతంలో (NCR) భాగం . జాతీయ రహదారి 9 పట్టణం గుండా వెళ్తూ, ఢిల్లీకి కలుపుతుంది.

చరిత్ర[మార్చు]

18 వ శతాబ్దం చివరలో దౌలత్ సింధియా, హాపూర్‌ను తన ఫ్రెంచ్ జనరల్ పియరీ క్యూలియర్-పెరాన్‌కు ఇచ్చాడు. బ్రిటిషు పాలనలో హాపూర్, మీరట్ జిల్లాలో ఉండేది. పట్టణంలో అనేక చక్కటి తోటలుండేవి. చక్కెర, బెల్లం (గుర్), ధాన్యం, పత్తి, కలప, వెదురు, ఇత్తడి, ఉక్కు పాత్రల వాణిజ్యం సాగేది. ముఖ్యమైన అశ్వికదళ డిపో, బాబూగఢ్ పొలం పట్టణాన్ని ఆనుకొని ఉన్నాయి . గతంలో ఇది ఘాజియాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. 2012 లో ఇది ముఖ్యపట్టణంగా హాపూర్ జిల్లాను ఏర్పాటు చేసారు. ఇది మీరట్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది.

భౌగోళికం[మార్చు]

హాపూర్ 28°43′N 77°47′E / 28.72°N 77.78°E / 28.72; 77.78 వద్ద [1] సముద్ర మట్టం నుండి 213 మీటర్ల ఎత్తున ఉంది.

శీతోష్ణస్థితి[మార్చు]

హాపూర్‌లో ఋతుపవనాల ప్రభావవంతో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంది. వేసవిలో చాలా వేడిగాను, శీతాకాలంలో చల్లగానూ ఉంటుంది. ఏప్రిల్ మొదలు నుండి జూన్ చివరి వరకూ వేసవికాలం ఉంటుంది. ఉష్ణోగ్రతలు 43 °C (109 °F) చేరుకుంటాయి. [2] ఋతుపవనాలు జూన్ చివరలో వచ్చి, సెప్టెంబరు మధ్య వరకు కొనసాగుతాయి. ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుతాయి, మేఘాలు పుష్కలంగా ఉంటాయి. తేమ బాగా ఎక్కువగా ఉంటుంది. అక్టోబరులో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయి; అక్టోబరు చివరి నుండి మార్చి మధ్య వరకు తేలికపాటి, పొడి శీతాకాలం ఉంటుంది.

వర్షపాతం సాలుకు 90 సెం.మీ నుండి 100 సెం.మీ వరకు ఉంటుంది. ఇది పంటలకు అనుకూలంగా ఉంటుంది. వర్షపాతం ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది. తేమ 30 నుండి 100% వరకు ఉంటుంది. [2]

శీతోష్ణస్థితి డేటా - Hapur(1971–2000)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 29.3
(84.7)
32.2
(90.0)
39.5
(103.1)
43.5
(110.3)
45.8
(114.4)
46.1
(115.0)
46.0
(114.8)
40.0
(104.0)
39.0
(102.2)
38.0
(100.4)
34.5
(94.1)
30.0
(86.0)
46.1
(115.0)
సగటు అధిక °C (°F) 21.9
(71.4)
23.1
(73.6)
28.7
(83.7)
36.3
(97.3)
39.1
(102.4)
37.6
(99.7)
33.6
(92.5)
32.6
(90.7)
33.7
(92.7)
32.8
(91.0)
28.6
(83.5)
23.5
(74.3)
31.1
(88.0)
సగటు అల్ప °C (°F) 7.2
(45.0)
9.1
(48.4)
13.8
(56.8)
19.9
(67.8)
24.3
(75.7)
26.0
(78.8)
25.9
(78.6)
25.5
(77.9)
23.6
(74.5)
18.2
(64.8)
12.4
(54.3)
8.0
(46.4)
17.7
(63.9)
అత్యల్ప రికార్డు °C (°F) 0.2
(32.4)
0.1
(32.2)
5.4
(41.7)
8.3
(46.9)
15.4
(59.7)
17.7
(63.9)
16.5
(61.7)
19.0
(66.2)
15.7
(60.3)
7.2
(45.0)
1.8
(35.2)
0.2
(32.4)
0.1
(32.2)
సగటు అవపాతం mm (inches) 19.7
(0.78)
24.9
(0.98)
24.4
(0.96)
12.8
(0.50)
19.1
(0.75)
71.2
(2.80)
269.0
(10.59)
264.7
(10.42)
95.4
(3.76)
25.9
(1.02)
4.3
(0.17)
13.4
(0.53)
845.0
(33.27)
సగటు వర్షపాతపు రోజులు 1.5 1.7 1.7 0.9 1.6 3.9 10.2 9.4 4.2 1.6 0.4 0.9 38.0
Source: India Meteorological Department (record high and low up to 2010)[3][4]

జనాభా[మార్చు]

హాపూర్‌లో మతం
మతం శాతం
హిందూ మతం
  
66.27%
ఇస్లామ్
  
32.12%
ఇతరాలు†
  
1.6%
ఇతరాల్లో
సిక్కుమతం (0.82%), జైనమతం (0.37%), క్రైస్తవం (0.29%), బౌద్ధం (<0.06%) ఉన్నాయి.

2011 జనగణన ప్రకారం, హాపూర్ జనాభా 2,62,801. ఇందులో 1,39,694 మంది పురుషులు, 1,23,107 మంది మహిళలు. పట్టణ అక్షరాస్యత 75.34%. [5]

1,74,278 (66.27%) మందితో హిందూ మతం మెజారిటీ మతం. 84,477 (32.12%) తో ఇస్లాం రెండవ అత్యంత ప్రాచుర్యం పొందిన మతం. సిక్కు మతం 2,163 (0.82%), జైన మతం 981 (0.37%), క్రైస్తవ మతం 765 (0.29%), బౌద్ధమతం 162 (0.06%) లను పాటించేవారు కూడా పట్టణంలో ఉన్నారు.

లోకసభకు ఎన్నికైన సభ్యులు[మార్చు]

1962లో 3 వ లోకసభకు జరిగిన భారతదేశ సాధారణ ఎన్నికల్లో కమలా చౌదరి భారత జాతీయ కాంగ్రెసు అధికారిక అభ్యర్థిగా హపూర్ నుండి ఆమె తన సమీప ప్రత్యర్థి నసీమ్ ను 28,633 ఓట్ల తేడాతో ఓడించింది.[6]

మూలాలు[మార్చు]

  1. Falling Rain Genomics, Inc – Hapur
  2. 2.0 2.1 "Chapter 3 – Findings: Metro Cities of India" (PDF). Central Pollution Control Board. p. 63. Archived from the original (pdf) on 23 September 2015. Retrieved 1 April 2011.
  3. "Meerut Climatological Table Period: 1971–2000". India Meteorological Department. Archived from the original on 14 February 2014. Retrieved April 15, 2015.
  4. "Ever recorded Maximum and minimum temperatures up to 2010" (PDF). India Meteorological Department. Archived from the original (PDF) on 21 మే 2013. Retrieved 25 నవంబరు 2020.
  5. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.
  6. "Members Bioprofile". 164.100.47.194. Retrieved 2021-09-09.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హాపూర్&oldid=3892978" నుండి వెలికితీశారు