Jump to content

సోనాల్ చౌహాన్

వికీపీడియా నుండి
సొనాల్ చౌహాన్
ఫిలిం ఫేర్ స్టైల్ & గ్లామర్ అవార్డ్స్ 2016 లో సొనాల్ చౌహాన్
జననం (1989-05-16) 1989 మే 16 (వయసు 35)[1]
బులంద్షహర్ , భారత దేశం
వృత్తిమోడల్, నటి, గాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు2005 – నేటి వరకు
బిరుదుఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం 2005
మిస్ వరల్డ్ టూరిజం 2005

సోనాల్ చౌహాన్ (మే 16, 1989 న జన్మించారు) ఒక భారతీయ ఫ్యాషన్ మోడల్, గాయకురాలు, నటి, ప్రధానంగా తెలుగు సినిమా, హిందీ సినిమాల్లో పనిచేస్తున్నారు.[2] ఆమె అనేక అందాల పోటీలను గెలుచుకుంది, ఆమె "జన్నత్" అనే హింది చిత్రంలో తొలిసారిగా నటించింది.

జీవితం తొలి దశలో

[మార్చు]

సోనాల్ బులంద్షహర్ లో జన్మించింది.ఆమె నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది[3] తరువాత న్యూ ఢిల్లీలోని గార్గి కాలేజీలో ఫిలొసఫి చదివింది.

కెరీర్

[మార్చు]

మోడల్గా

[మార్చు]
2011లో సోనాల్ చౌహాన్

మలేషియాలోని సరావాక్ రాష్ట్రంలో మిరిలో మిస్ వరల్డ్ టూరిజం 2005 గా ఆమె గుర్తించబడింది .[4] ఆమె మిస్ వరల్డ్ టూరిజం గా ఎన్నుకొనబడ్ద మొట్టమొదటి భారతీయురాలు.[5]ఆమె డిష్ టి.వి., పాండ్స్, నోకియా వంటి బ్రాండ్ల ప్రకటనలలో కూడా కనిపించింది.[6] ఇండియా ఇంటర్నేషనల్ ఆభరణాల వీక్ 2011 లో నగలు బ్రాండ్ YS18 కోసం షో స్టాపర్గా ఆమె రాంప్లో నడిచింది.[7][8]

నటిగా

[మార్చు]

ఆమె మొట్టమొదటిసారి హిమేష్ రేషమ్మియా యొక్క ఆల్బమ్ ఆప్ కా సురోర్లో తెరపై కనిపించింది.[9] .అమె మొదటి చిత్రం జన్నత్. ఈ చిత్రంలో ఆమె ఇమ్రాన్ హష్మి సరసన నటించారు.[10] 2008 లో అమె రేయింబో అనే చిత్రమ్లో నటించారు. తరువాత ఒక కన్నడ, మూడు హింది చిత్రాల్లో నటించారు.

ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి తెలుగు సినిమా లెజెండ్ చిత్రం లో నటించారు. ఆమె తదుపరి చిత్రం పండగా చెస్కో.2015 ప్రారంభంలో, ఆమె రెండు తెలుగు సినిమాల సైజు జీరోతో ఆర్య, షేర్ సరసన నందమూరి కళ్యాణ్ రామ్తో నటించతానికి ఒప్పుకున్నారు.[11]

2016 లో అమె డిక్టేటర్ అనె తెలుగు చిత్రమ్లో నతించారు.[12][13]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర విషయాలు
2008 జన్నత్ జొయా మాతుర్ హిందీ ఫిలిం ఫరె ఉత్తమ తొలి నటికి ఎంపికైనది
2008 రెయిన్‌బో స్వప్న తెలుగు
2010 చెలువయే నిన్ను నోడలు ప్రాకృతి కన్నడ
2011 భుడ్డా..హోగా తెరా బాప్ తాన్య హిందీ
2012 పెహ్లా సితారా హిందీ
2013 3జీ(హిందీ) షీనా హిందీ "కైసే బతేన్" పాటకు నేపథ్య గాయకురాలు కూడా
2014 లెజెండ్ స్నేహ తెలుగు
2015 పండగ చేస్కో అనుష్కా (స్వీటి) తెలుగు
షేర్ నందిని తెలుగు
సైజ్ జీరొ(సినిమా) సిమ్రన్ తెలుగు
ఇంజి ఇడుపళగి తమిళం
2016 డిక్టేటర్ ఇందు తెలుగు
2019 రూలర్[14] తెలుగు
2022 ది ఘోస్ట్ తెలుగు [15]
ఎఫ్ 3 తెలుగు [16]

మూలాలు

[మార్చు]
  1. Sonal Chauhan – Sonal Chauhan Biography. Koimoi.com (16 May 1985). Retrieved on 2015-09-29.
  2. "Sonal Chauhan to do an Urmila in Balayya's next".
  3. "Sonal Chauhan interview". Telugu Cinema. 3 June 2008. Retrieved 14 May 2011.[permanent dead link]
  4. Raul Dias (26 July 2005). "She's all that!". The Times of India. Archived from the original on 31 మే 2008. Retrieved 23 May 2008.
  5. Raul Dias (27 July 2005). "Indian girl is Miss World Tourism". The Times of India. Archived from the original on 27 సెప్టెంబరు 2012. Retrieved 16 September 2011.
  6. "Sonal Chauhan video interview". Retrieved 24 May 2011.
  7. "Iijw 2011: Ys 18". The Times of India.
  8. Loading Archived 2016-04-16 at the Wayback Machine. Bollywoodaajtak.com. Retrieved on 3 July 2012.
  9. "Sonal Chauhan comes to town". www.oneindia.in. 8 December 2008. Archived from the original on 18 ఫిబ్రవరి 2013. Retrieved 8 December 2010.
  10. "Jannat- Sonal Chauhan's ticket to Bollywood". www.indiaprwire.com. 30 April 2008. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 8 December 2010.
  11. "Sonal Chauhan to replace Vanya Mishra in Kalyanram's Sher". Timesofindia.indiatimes.com (21 April 2015). Retrieved on 9 September 2015.
  12. "Sonal Chauhan roped in for a crazy project". 123telugu.com. Retrieved on 9 September 2015.
  13. "Balakrishna to romance Legend actress once again". Indiaglitz.com (2 July 2015). Retrieved on 9 September 2015.
  14. "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Archived from the original on 26 అక్టోబరు 2019. Retrieved 7 November 2019.
  15. Eenadu (1 January 2022). "ఘోస్ట్‌ కోసం సోనాల్‌". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  16. NTV (21 October 2021). "'ఎఫ్ 3' షూటింగ్ లో సోనాల్ చౌహాన్". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.

బాహ్య లింకులు

[మార్చు]