Jump to content

బులంద్‌షహర్

వికీపీడియా నుండి
బులంద్‌షహర్
పట్టణం
బులంద్‌షహర్
బులంద్‌షహర్ దృశ్యం
బులంద్‌షహర్ దృశ్యం
బులంద్‌షహర్ is located in Uttar Pradesh
బులంద్‌షహర్
బులంద్‌షహర్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 28°24′N 77°51′E / 28.4°N 77.85°E / 28.4; 77.85
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబులంద్‌షహర్
Founded byరాజా అహిబరన్
Area
  Total
64 కి.మీ2 (25 చ. మై)
Elevation
195 మీ (640 అ.)
Population
 (2011)
  Total
2,35,310[1]
  Density788/కి.మీ2 (2,040/చ. మై.)
భాషలు
  అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
203001
టెలిఫోన్ కోడ్91 (5732)
Vehicle registrationUP-13
లింగ నిష్పత్తి892 /

బులంద్‌షహర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం, బులంద్‌షహర్ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. ఈ నగరం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) లో భాగం. 2011 జనగణన నాటి సామాజిక-ఆర్థిక సూచికలు, ప్రాథమిక సౌకర్యాల సూచికల ఆధారంగా, బులంద్‌షహర్ మైనారిటీ మతస్థులు ఎక్కువగా ఉన్న జిల్లా అని భారత ప్రభుత్వం ప్రకటించింది.[3] బులంద్‌షహర్ ఢిల్లీ నుండి 68 కి.మీ.దూరంలో ఉంది.[4]

చరిత్ర

[మార్చు]

అహిబరన్ అనే రాజు ఇక్కడ బరన్ అనే కోటకు పునాది వేసి తన రాజధాని బరన్‌షహర్ స్థాపించాడని చెబుతారు. దీనిని బరన్ షహర్ అనేవారు. అధికారిక ఉపయోగాలలో ఈ పేరు బులంద్‌షహర్ గా మారింది. అది ఒక మెరక ప్రదేశంపై ఉండేది.అంచేత దీన్ని "ఉన్నత నగరం" అనేవారు. పెర్షియన్ భాషలో దీని అర్థం బులంద్‌షహర్. ప్రస్తుతం అప్పర్ కోర్ట్ అనే స్థలం ఉంది. ఇది రాజా అహిబరన్ కోట అని నమ్ముతారు. పాత బరన్ ఈ ప్రాంతానికి పరిమితం చేయబడింది. బహుశా 12 వ శతాబ్దంలో బరన్ రాజ్యం ముగిసింది. సా.శ. 1192 లో, ముహమ్మద్ గౌరీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను జయించినప్పుడు, అతని జనరల్ కుతుబుద్దీన్ ఐబాక్ బరన్‌ కోటను చుట్టుముట్టి దానిని జయించాడు. రాజా చంద్రసేన్ దోడియాను చంపేసి ఐబాక్, బరన్ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. 

భటోరా వీర్‌పూర్, గాలిబ్‌పూర్ మొదలైన ప్రదేశాలలో లభించిన పురాతన శిథిలాలు బులంద్‌షహర్ ప్రాచీనతను సూచిస్తున్నాయి. జిల్లాలో అనేక ఇతర ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడ మధ్యయుగానికి చెందిన విగ్రహాలు, పురాతన దేవాలయాల వస్తువులను కనుగొన్నారు. ఈ పురాతన నాణేలు, శాసనాలు మొదలైన వాటిని లక్నో లోని స్టేట్ మ్యూజియంలో భద్రపరచారు.

జనాభా

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, బులంద్‌షహర్ పట్టణ సముదాయం జనాభా 2,35,310. ఇందులో పురుషులు 1,25,549, మహిళలు 1,11,761. ఆరేళ్ళ లోపు పిల్లలు 30,886. మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1,60,203, వీరిలో 90,761 మంది పురుషులు, 69,442 మంది మహిళలు. ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 78.37%.[1]

Religions in Bulandshahr
Religion Percent
Hindus
 
63.63%
Muslims
 
35.53%
Jains
 
0.13%
Others†
 
0.72%
Distribution of religions
Includes Sikhs (0.35%), Buddhists (<0.04%).

వ్యక్తులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 July 2012.
  2. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. the original (PDF) నుండి 25 మే 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 నవంబరు 2020.
  3. "List of Minority Concentration Districts (Category 'A' & 'B')" (PDF). minorityaffairs.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 February 2019.
  4. "New Delhi, Delhi to Bulandshahr, Uttar Pradesh directions, best route map, conditions and traffic info". www.distancebetweencities.co.in. the original నుండి 23 సెప్టెంబరు 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 August 2015.
  5. "सतीश यादव के पदक जीतने पर सिकंदराबाद में जश्न". www.jagran.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 August 2015.