రతి అగ్నిహోత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రతి అగ్నిహోత్రి

రతి అగ్నిహోత్రి
జననం (1960-12-10) 1960 డిసెంబరు 10 (వయసు 63)
ముంబై  భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు 1979–1990

2001–2016

భార్య/భర్త అనిల్ విర్వాణి (m. 1985; div. 2015)
పిల్లలు తనూజ్ విర్వాణి

రతి అగ్నిహోత్రి (హిందీ: रति अग्निहोत्रि, ఉర్దూ: رتِ اَگنِہوترِ) భారతీయ సినిమా నటి. ఈమె 1960, డిసెంబర్ 16న బొంబాయిలో ఒక పంజాబీ కుటుంబములో జన్మించింది. ఈమె హిందీ, ఉర్దూతో పాటు తమిళ, తెలుగు, కన్నడ భాషా చిత్రాలలో కూడా నటించింది.

సినీ జీవితం

[మార్చు]

రతి సాంప్రదాయ కుటుంబము నుండి వచ్చినా, 10వ యేటనే మోడలింగ్ చేయటానికి కుటుంబము అనుమతి లభించింది.[1] యుక్తవయసులో ఉండగా తండ్రి ఉద్యోగరీత్యా కుటుంబము మొత్తం మద్రాసుకు బదిలీ అయ్యింది. మద్రాసులో గుడ్ షెప్పర్డ్ కాన్వెంట్ పాఠశాలలో చదువుతుండగా రతి పాఠశాల నాటక ప్రదర్శనలో పాలుపంచుకున్నది. తమిళ సినిమా రంగములో ప్రముఖ దర్శకుడు, తన కొత్త సినిమాకు హీరోయిన్ కోసం వెతుకుతున్న భారతీరాజా ఆ నాటక ప్రదర్శన ప్రేక్షకులలో ఉన్నాయి. ఈయన రతి యొక్క తండ్రిని కలిసి సినిమా షూటింగు ఒక నెలలో ముగుస్తుందని హామీ ఇచ్చి, తను ప్రారంభించబోయే సినిమాలో రతిని హీరోయిన్గా తీసుకున్నాడు. తండ్రి, తన కూతురు యొక్క సినీరంగ ప్రవేశానికి సంకోచిస్తూనే ఒప్పుకున్నా, పదహారేళ్ళ వయసులో తన మొదటి సినిమా పుదియ వర్పుకళ్లో నటించడానికి ఎంతో ఉత్సాహంగా అంగీకరించింది. ఈ సినిమా 1979లో విడుదలైంది.

ఆ సినిమాలో రతి సరసన కథానాయకునిగా నటించిన భాగ్యరాజాకు కూడా అదే మొదటి చిత్రం. భాగ్యరాజా ఈమెకు తమిళము నేర్పించి డైలాగులు చెప్పటంలో శిక్షణ ఇచ్చాడు. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించడముతో రతి రాత్రికిరాత్రే తమిళ సినిమాలో సంచలనం సృష్టించింది. ఆ వెనువెంటనే భారతీరాజా ఈమెతో రెండవ చిత్రము నీరమ్ మారద పూక్కళ్ (1979) తీశాడు.[2] ఈమె జన్మతః పంజాబీ అయినప్పటికీ దక్షిణాది ప్రేక్షకులు ఈమెను తమలో ఒకర్తెగానే ఆదరించారు. ఈ అభిమానానికి స్పందిస్తూ రతి హృదయాంతరాల్లో తాను తమిళ వనితనని మద్రాసును తన సొంతవూరుగా చెప్పుకున్నది.[3] దక్షిణాదిన ఈమె తెలుగు, కన్నడ భాషా చిత్రాలలో కూడా నటించింది. సినీరంగప్రవేశము చేసిన మూడేళ్ళలోనే 32 సినిమాలలో నటించి రికార్డు సృష్టించింది.

రతి అగ్నిహోత్రి నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]

ఇవి కూడ చూడండి

[మార్చు]

ఫిర్ కభీ

మూలాలు

[మార్చు]