ప్రేమ పిచ్చి
ప్రేమ పిచ్చి (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.వి.రాజేంద్ర |
---|---|
తారాగణం | |
సంగీతం | ఇళయరాజా |
విడుదల తేదీ | ఫిబ్రవరి 21, 1981[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమ పిచ్చి తమిళ భాష నుండి డబ్బింగ్ చేయబడిన సినిమా. తమిళంలో "ఉల్లాస పరవైగళ్" దీనికి మాతృక. ఇదే సినిమాను హిందీలో "దో దిల్ దివానే" పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రాన్ని విదేశాలలో షూట్ చేశారు. ముఖ్యంగా న్యూయార్క్, ఆమ్‌స్టర్‌డాం, డస్సెల్ డోర్ఫ్ మొదలైన ప్రదేశాలలోని ప్రకృతి దృశ్యాలు, ప్రాచీన మందిరాలు, ప్రాచీన కళాఖండాలు చిత్రీకరించారు.[2]
కథ
[మార్చు]రవి సంపన్న యువకుడు. అతడికి నిప్పుగురించి విన్నా, నిప్పును చూసినా పిచ్చెక్కి పోతుంది. విదేశాలకు పంపిస్తే గాని ఈ జబ్బు నయం కాదని డాక్టర్లు సలహాలు ఇస్తారు. "నీకు జబ్బు. అది తగ్గడానికి విదేశాలకు వెళ్లాలి" అని చెబితే తన కొడుకు వెళ్లడేమోనని భయపడి రవి తండ్రి రవి స్నేహితుడు రాజాతో కలిసి నాటకం ఆడతాడు. ఫలితంగా రాజా పిచ్చివాడుగా రవి తోడు రాగా విదేశాలకు వెడతారు. అక్కడ నిర్మల అనే యువతి వారికి సాయపడుతుంది. నిర్మల నెమ్మదిగా రవికి అసలు సంగతి చెప్పి డాక్టర్లకు సహకరించవలసిందిగా నచ్చచెబుతుంది. నిర్మల సాహచర్యం వల్ల డాక్టర్ల కృషి వల్ల రవి మామూలు మనిషి అవుతాడు. స్వదేశానికి బయలుదేరేముందు అన్ని ప్రాంతాలను చూసి రావడానికి రవి, నిర్మల బయలుదేరతారు. రవిని హతమార్చి ఆస్తిని కాజేయాలనుకున్న రవి పినతండ్రి విదేశీ రౌడీలను ఆ పనికి పురమాయిస్తాడు. ఆ రౌడీలను ఎదుర్కొని రవి ఎలా స్వదేశానికి తిరిగి వస్తాడనేది పతాక సన్నివేశం[3].
తారాగణం
[మార్చు]
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: సి.వి.రాజేంద్ర
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, ఝాన్సీ, సునంద
పాటలు
[మార్చు]1. అందమైనది ప్రతి అణువు ఉన్నది, రచన: ఆచార్య ఆత్రేయ , గానం.కె.ఎస్.చిత్ర
2.ఓ మోహనరాగం నాలోన పలికే , రచన: ఆత్రేయ, గానం.ఝాన్సీ
3.జర్మనీకే అందం నీకే సొగసరికే , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సునంద .
మూలాలు
[మార్చు]- ↑ "Prema Pichchi". ఆంధ్రపత్రిక దినపత్రిక. 21 February 1981. p. 6.[permanent dead link]
- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2019/11/1981_27.html?m=1
- ↑ వి.ఆర్. (28 February 1981). "చిత్ర సమీక్ష: ప్రేమ పిచ్చి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 324. Retrieved 6 February 2018.[permanent dead link]
. 3. ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.