Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

భోగిమంటలు (సినిమా)

వికీపీడియా నుండి

'భోగి మంటలు' తెలుగు చలన చిత్రం,1981 మే 9 న విడుదల.విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, గీత, రతి, మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు సమకూర్చారు.

బోగి మంటలు
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ,
రతి,
గీత
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ రోహిణి ఆర్ట్స్
భాష తెలుగు

పట్టాభిరామయ్య, పరమేశ్వరరావు బావా బావమరదులు. డాక్టరు చదువుతున్న పట్టాభిరామయ్య కొడుకు రఘురాంకు, పరమేశ్వరరావు కూతురు శారదను ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చితార్థం జరుగుతుంది. పట్టాభిరామయ్య రెండో కొడుకు లక్ష్మణ్ ఆవేశపరుడు. వ్యవసాయదారుడు. మునసబు కూతురు రాధ, లక్ష్మణ్ ప్రేమించుకుంటారు. పరమేశ్వరరావు కొడుకు గంగాధరం, మునసబు గారి అబ్బాయి స్నేహితులు. పిచ్చయ్య అనే వ్యక్తి మునసబుకు కుడిభుజం. పట్టాభిరామయ్య, పరమేశ్వరరావు కుటుంబాలను విడదీయాలని మునసబు పిచ్చయ్య సాయంతో కుట్రపన్నుతాడు. పులివేషాల పోటీ రోజున గంగాధరం ఒక అమ్మాయిని చెరచాలని ప్రయత్నించి విఫలమవడంతో ఆమెను చంపివేస్తాడు. వూరి నుండి వస్తున్న పట్టాభిరామయ్య ఇది చూస్తాడు. మునసబు ప్రేరణతో పరమేశ్వరరావు పట్టాభిరామయ్య వద్దకు వచ్చి తన కొడుకు పేరు బయటపెట్టవద్దని ప్రాధేయపడతాడు. న్యాయం కోసం నిలబడే పట్టాభిరామయ్య తిరస్కరిస్తాడు. పట్టాభిరామయ్య దారుణంగా హత్యచేయబడతాడు. లక్ష్మణ్ ప్రత్యర్థులపై పగబడతాడు. ఈ విషయంలో అన్నతో మాటామాటా పెరిగి మునసబు ప్రేరణతో వాటాలు పంచుకుంటాడు. తన తండ్రి హత్యకు కారకులెవరో కనిపెట్టడానికి రఘురాం వేరే మార్గంలో ప్రయత్నిస్తాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: విజయనిర్మల
  • సంగీతం: రమేష్ నాయుడు
  • ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ
  • నిర్మాత: టి.కిషోర్
  • సాహిత్యం: కొడకండ్ల అప్పలాచార్య, ఆచార్య ఆత్రేయ,కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, వేటూరి సుందర రామమూర్తి
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల శైలజ, బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం
  • నిర్మాణ సంస్థ: రోహిణీ ఆర్ట్స్
  • విడుదల:09:05:1981.

పాటలు

[మార్చు]
  1. అరవైలో ఇరవై వచ్చింది మా అమ్మకు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం బృందం_రచన:ఆచార్య ఆత్రేయ
  2. అల్లీబిల్లీ అందమంతా అల్లుకుంటే సొంతమంట - ఎస్.పి.శైలజ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం _రచన: వేటూరి సుందర రామమూర్తి
  3. చిక్కు చిక్కు పుల్లా చిక్కవే పిల్లా చిక్కని చక్కని కౌగిలి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.పి. శైలజ - రచన: అప్పలాచార్య
  4. తడిబట్టల బుచ్చెమ్మ మడిగట్టుకు వచ్చావా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.పి. శైలజ - రచన: ఆత్రేయ
  5. పలుకు పలుకవే అంబా అంబా ఓ జగదంబా కళ్ళు తెరచి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు
  6. భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో బోగిమంటల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ
  7. లేతవయసు పూతకొచ్చిందోయి మరదలా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.పి. శైలజ - రచన: సినారె

మూలాలు

[మార్చు]
  1. వి.ఆర్. (14 May 1981). "చిత్రసమీక్ష: భోగిమంటలు" (PDF). ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 68, సంచిక 42. Retrieved 8 February 2018.[permanent dead link]

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటిలింకులు

[మార్చు]