శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
నిర్మాణం నందమూరి హరికృష్ణ
కథ నందమూరి తారక రామారావు
చిత్రానువాదం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కాంచన,
నందమూరి బాలకృష్ణ,
రతి అగ్నిహోత్రి,
దేవిక,
ప్రభ,
ముక్కామల,
మిక్కిలినేని
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన కొసరాజు,
సి. నారాయణరెడ్డి
ఛాయాగ్రహణం నందమూరి మోహనకృష్ణ
నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టుడియోస్
విడుదల తేదీ నవంబర్ 29, 1984
భాష తెలుగు

ఆంధ్ర దేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. కాలజ్ఞానిగా ప్రసిద్ధుడైన ఈ యోగిపురుషుని జీవి కథను నందమూరి తారకరామారావు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాడు. తానే స్వయంగా నటించాడు, దర్శకత్వం వహించాడు. ఎన్టీయార్ రాజకీయాలలోకి వచ్చిన కొద్దికాలానికే ఈ సినిమా భారీ అంచనాలతోను, కొన్ని వివాదాలతోను, రాజకీయ దుమారంతోను విడుదలైంది. 1980లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమై, 1981లో పూర్తయింది. అయితే విడుదల అంత సులభం కాలేదు. సినిమాలోని కొన్ని అంశాలపై సెన్సార్‌ అభ్యంతరం చెప్పడంతో మూడేళ్లు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు ఎన్టీఆర్‌. ఈ చిత్రం 1984 నవంబరు 29న విడుదలై ఘనవిజయం సాధించింది.

నేపథ్యం

[మార్చు]

ఎన్టీఆర్‌ కడపజిల్లా సిద్ధవటం లోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమానికి వెళ్లినప్పుడు... తెరమీది బొమ్మలు... ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తాయి అని వీరబ్రహ్మం తన కాలజ్ఞానంలో చెప్పిన విషయం ఆయనను ఆకర్షించింది. భగవంతుడు బహుశ ఇలాగే ఉండునేమో అన్నట్టు ఎన్టీ.ఆర్ గారు బ్రహ్మము గారి పాత్రలో అలా జీవించారు. వీరబ్రహ్మం జీవించివుండగా ధరించిన చెక్క చెప్పులు తనకు అతికినట్లు సరిపోవడం ఎన్టీఆర్‌ను ఆశ్చర్యపరిచింది. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి సినిమాలో తెరమీద బొమ్మలు... రాష్ట్రాలేలతాయి అన్న దానికి ఉదాహరణగా తాను గౌరవించే ఎం.జి.రామచంద్రన్‌ను చూపించారు. అందులో ఎన్టీఆర్‌ కూడా సీఎం అవుతారన్న అర్థం ఉందన్న వాదనను కొందరు నాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ చెవినవేశారు. దీంతో ఆ సినిమాకు ఏడాదిపాటు మద్రాసులో ఉన్న సెన్సార్‌ బోర్డువారు క్లియరెన్స్‌ ఇవ్వలేదు. చివరికి ఆ సినిమా విడుదలయ్యేనాటికి... ఎన్టీఆర్‌ నిజంగానే సీఎంగా ఉన్నారు.

పాటలు, తత్వాలు

[మార్చు]
  • కుల భేద, మత భేదములు,(పద్యం) రచన: కొండవీటి వెంకటకవి, గానం.వి.రామకృష్ణ
  • యోగానందకరీ,(స్తుతి) గానం. వి రామకృష్ణ
  • అసతోమా
  • కాదు కాదు గురులు,(వేమన పద్యాలు) గానం. వి. రామకృష్ణ
  • భూలోక కల్పతరువు,(పద్యం) రచన: కొండవీటి వెంకటకవి, గానం. వి. రామకృష్ణ
  • పవిత్రం చరిత్రం,(పద్యం) గానం. వి. రామకృష్ణ
  • మాయదారి మారాల బండిరా, రచన:కొసరాజు, గానం. వి. రామకృష్ణ
  • అన్నమయ్యా
  • చెప్పలేదని, రచన: కొసరాజు, గానం. వి.రామకృష్ణ
  • మతం నీతీరా, రచన:కొసరాజు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, బృందం
  • పంచముడని నిన్ను, రచన:కొసరాజు, గానం. వి. రామకృష్ణ
  • సహనాభవతు,(శాంతి మంత్రం) రచన:ఆదిశంకరాచార్య కృతం, గానం. వి. రామకృష్ణ
  • శివగోవింద గోవింద , రచన: కొసరాజు, గానం. వి రామకృష్ణ
  • నీవు ఎవరో, రచన:కొసరాజు , గానం. పి. లీల
  • నందామయా గురుడ నందామయా, రచన: కొసరాజు గానం. వి. రామకృష్ణ
  • వినరా వినరా ఓ నరుడా, రచన: కొసరాజు, గానం. వి రామకృష్ణ
  • ఏమండీ పండితులారా, రచన: కొసరాజు, గానం. వి రామకృష్ణ
  • నరుడా నా మాట నమ్మరా, రచన: కొసరాజు గానం. వి. రామకృష్ణ బృందం
  • చిలకమ్మ పలుకవే పలుకు, రచన: కొసరాజు, గానం. వి రామకృష్ణ

*మామ కూతురా మరదలు పిల్ల, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం

*శృంగార రసరాజ, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల.

*చెంగున దూకాలి , రచన: కొసరాజు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల.

మూలాలు

[మార్చు]

1. ఘంటసాల గళామృతమ్ నుండి పాటలు , కొల్లూరి భాస్కరరావు సంకలనం.

ఇతర లింకులు

[మార్చు]