కలియుగ రాముడు
కలియుగ రాముడు (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బాపయ్య |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, రతి అగ్నిహోత్రి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | తిరుపతి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కలియుగ రాముడు 1982లో విడుదలైన తెలుగు సినిమా. తిరుపతి ప్రొడక్షన్స్ పతాకంపై డి.శ్రీరంగరాజు నిర్మించిన ఈ సినిమాకు కె.బాపయ్య దర్శకత్వం వహించాడు. నందమూరి తారక రామారావు, రతి అగ్నిహోత్రి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
కథ
[మార్చు]ఒక జమీందారుకు లేక లేక మగబిడ్డ పుడతాడు. అతని ఎడమ అరచేతిలో అద్భుతమైన శక్తులు కలిగిన రేఖ ఉంటుంది. అతను మహరాజు కావడమో, గజదొంగ కావడమో జరుగుతుందని జ్యోతిష్యుడు చెయుతాడు. చినబాబు రాం పేరుతో పెరిగి పెద్దవాడవుతాడు. ఒక నాడు రైలు లో రాం కట్టెదుటే కొందరు దుండగులు పీటర్ అనే వృద్ధుడుని హత్య చేస్తారు. పీటర్ కళ్ళు మూస్తూ " ట్రంపెట్ నోట్స్" వినిపించే సిగార్ లైటర్ ను రామ్ కు ఇస్తాడు. రాం నిజానికి ప్రభుత్వ గూఢచారి. పెట్రోలుకు ప్రత్యామ్నాయ ఇంథనాన్ని కనుగొన్న శాస్త్రీజీ అనే ప్రముఖ శాస్త్రవేత్తను దుండగులు అపహరిస్తారు. ఆ శాస్త్రవేత్త ఆచూకీ తెలియాలంటే సిగార్ లైటర్ సంగీతాన్ని అర్థం చేసుకోవాలి. దుండగులు రాం ను వెంటాడుతారు. రైలులో కలిసి ప్రయాణం చేస్తున్న రామ్‌ను సంథ్య అనే అందమైన యువతి ని దుండగులు పట్టుకొని తీసుకుపోతుండగా రామ్ సంథ్యతో సహా తప్పించుకుంటాడు. రామ్ దుండగులను ఎలా పట్టుకున్నాడనేది మిగిలిన కథ.[2]
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు
- రతి అగ్నిహోత్రి
- ఎం. ప్రభాకర్ రెడ్డి
- అల్లు రామలింగయ్య
- కైకాల సత్యనారాయణ
- ముక్కామల
- ఆనంద్ మోహన్
- భీమరాజు
- జగ్గారావు
- అర్జా జనార్థన రావు
- పిజె శర్మ
- చలపతి రావు
- శ్రీరాజ్
- మదన్ మోహన్
- మాస్టర్ కుమార్
- కవిత
- ఎస్. వరలక్ష్మి
- మల్లిక
- జయమాలిని
- సుధాకర్
- కొంగర జగ్గయ్య
- కాంతారావు
- కెజె శారధి
- మిక్కిలినేని
- నిర్మల
- జయ విజయ
పాటల జాబితా
[మార్చు]- ఆనందో బ్రహ్మ , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- నీ బుగ్గమీద రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- సీటికి మాటికి , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- డియ్యోరో డియ్యోరో , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- హల్లా గుల్లా , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఓరి నాయనో , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.సుశీల
సాంకేతిక వర్గం
[మార్చు]- ఆర్ట్: భాస్కర్ రాజు
- నృత్యాలు: శ్రీను
- స్టిల్స్: విజయ్
- పోరాటాలు: సంబశివరావు
- డైలాగులు - సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి.సుశీల
- సంగీతం: కె. వి. మహదేవన్
- స్టోరీ: చారందాస్ షోఖ్
- కూర్పు: కోటగిరి గోపాల రావు
- ఛాయాగ్రహణం: నందమూరి మోహనా కృష్ణ
- నిర్మాత: డి.శ్రీరంగ రాజు
- చిత్రానువాదం - దర్శకుడు: కె. బాపయ్య
- నిర్మాణ సంస్థ: తిరుపతి ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 13 మార్చి 1982
మూలాలు
[మార్చు]- ↑ "Kaliyuga Ramudu (1982)". Indiancine.ma. Retrieved 2020-08-23.
- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-23.