Jump to content

అహ్మద్ రజా ఖాన్

వికీపీడియా నుండి
ఇస్లామీయ పండితుడు
మధ్యయుగము
పేరు: అహ్మద్ రజా ఖాన్
జననం: 1856
మరణం: 1921
సిద్ధాంతం / సంప్రదాయం: సున్నీ ముస్లిం
ముఖ్య వ్యాపకాలు: అఖీదాహ్, ఫిఖహ్, తసవ్వుఫ్

భారతదేశంలో ఇస్లాం




చరిత్ర

నిర్మాణాలు

మొఘల్ · ఇండో-ఇస్లామిక్

ప్రఖ్యాత వ్యక్తులు

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్
 · అహ్మద్ రజా ఖాన్
 · మౌలానా అబుల్ కలాం ఆజాద్
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  · బహాదుర్ యార్ జంగ్
 · అబ్దుల్ కలాం

కమ్యూనిటీలు

ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు
కొంకణి · మరాఠీ · వోరా పటేల్
మెమన్ లు · ఈశాన్య భారత · కాశ్మీరీs
హైదరాబాదీ · దావూదీ బోహ్రా· ఖోజా
ఒరియా · నవాయత్ · బీరీ  · సెయిట్‌లు
మియో · సున్నీ బోహ్రా
కాయంఖానీ · బెంగాలీ

న్యాయ పాఠశాలలు

హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి

విశ్వాస పాఠశాలలు

బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్

భారత్‌లో మస్జిద్‌లు

భారతదేశంలో చారిత్రక మస్జిద్‌లు

సంస్కృతి

ముస్లింల ఆచారాలు

ఇతర విషయాలు

దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం
కేరళలో ఇస్లాహీ ఉద్యమం
భారత ముస్లింలలో జాతీయతా భావాలు
భారతీయ చరిత్ర కొరకు ముస్లిం క్రానికల్స్

అహ్మద్ రజా ఖాన్, Ahmad Raza Khan, ఒక సున్నీ ముస్లిం, సూఫీ, బరేల్వీ, ముస్లిం పండితుడు. బరేలీకి చెందినవాడు. ఇతను ఇస్లామీయ ధార్మిక శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అహలె సున్నత్ వల్-జమాత్ను స్థాపించాడు. ఇతను 52 శాస్త్రాలలో నిష్ణాతుడు. మహా రచయితకూడా, దాదాపు 1000 పుస్తకాలు, మోనోగ్రాఫ్ లు రచించాడు. ఇతను అరబ్బీ, పర్షియన్, ఉర్దూ భాషలలో వ్రాయగల మహాపండితుడు. ఇతను హనఫీ పాఠశాల అవలంబీకుడు. ఇతను వ్రాసిన నలభై సంపుటాలు గల గ్రంథం "ఫతావా రిజవియ్యా", ప్రాశస్తం పొందినది.

జీవిత చరిత్ర

[మార్చు]

తన కుటుంబం , బాల్యం

[మార్చు]
భారతదేశం, బరేలీలో గల అహ్మద్ రజా ఖాన్ సమాధి.

.

అహ్మద్ రజా ఖాన్ 1272 హి.శ. (1856 సా.శ.) ఉలేమాల కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి, మౌలానా నఖీ అలీ ఖాన్, సమకాలీన ఆలిమ్. ఇతని తల్లి ఇతనికి 'అమ్మన్ మియాఁ' అనే పేరు పెట్టింది. తన తండ్రిదగ్గర ఇస్లామీయ ధర్మ శాస్త్రాలు క్షుణ్ణంగా చదివాడు. తన తండ్రి ఆధ్వర్యంలో 'దర్స్-ఎ-నిజామీ' చదివాడు. తన సాధారణ విద్య కొరకు ఏ దారుల్ ఉలూమ్ లోనూ చదవలేదు.

యౌవనం , ఇతని మినిస్ట్రీ

[మార్చు]

తన 14వ యేటనే ముఫ్తీ అయ్యాడు. ఇలా తన ఇస్లామీయ ధార్మిక జీవనాన్ని ప్రారంభించి, అహలె సున్నత్ వల్-జమాత్ను స్థాపించేవరకు వెళ్ళింది. భారతదేశంలో గల ఎన్నో పీర్లు (ధార్మిక పురుషులు) ఇతనిపట్ల ముగ్దులై, తమ మార్గదర్శకునిగా చేసుకున్నారు.

యౌవనం

[మార్చు]

తన 21 యేట సూఫీ మార్గాలను అనుసరించి, పటుత్వం పొంది, ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. 22వ యేట తన తండ్రితో కలసి హజ్ యాత్రను పూర్తిచేశాడు. ఎందరో శిష్యగణాన్ని పొందాడు.

అహ్మద్ రజా ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేశాడు, ఫిఖహ్లో అందెవేసిన చేయి. హనఫీ పాఠశాల అవలంబీకుడు. మక్కా నగర ముఫ్తీ యైన షేక్ అబ్దుర్ రహిమాన్ అస్-సిరాజ్ ఇబ్న్ అబ్దుల్లా అస్-సిరాజ్ కూడా ఇతనిని ముఫ్తీగా గుర్తింపునిచ్చాడు. ఇతను ఖాదరియా సిల్ సిలాకు చెందిన సూఫీ. 1904 లో 'మన్జర్ అల్-ఇస్లాం' అనునొక మదరసాను స్థాపించాడు. రజా హి.శ. 1340 (1921) లో తన 65వ యేట మరణించాడు.

తన కార్యక్రమాలు

[మార్చు]

మదరసా స్థాపన

[మార్చు]

దారుల్ ఉలూమ్ మన్‌జర్ ఎ ఇస్లాం అనే పేరుతో ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో ఓ మదరసా స్థాపించాడు.

రచనలు

[మార్చు]

అహ్మద్ రజా ఖాన్ దాదాపు 1000 వరకు పుస్తకాలు, మోనోగ్రాఫ్ లు వ్రాశాడు. అరబ్బీ, పర్షియన్, ఉర్దూలో కవితలు గూడా వ్రాశాడు. ఇందులో ప్రముఖమైనవి కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  1. 'కన్జలుల్ ఈమాన్, ఫీ తర్జుమాతుల్ ఖురాన్', ఇది ఇతని "ఖురాన్ యొక్క ఉర్దూ తర్జుమా".
  2. 'Ĥadāyiq e Bakh’shish (Gardens of Salvation) - ఇవి కవితల సంగ్రహం, ఇవి ఉర్దూ, పర్షియన్ లో గలవు, ఈ కవితలన్నీ నాత్-ఎ-షరీఫ్ లు.
  3. అల్ అతాయా అన్-నబవియ్య అర్-రిజవియ్య (దీనిని ఫతవా అర్-రిజవియ్య), ప్రాశస్తం పొందినది.
  4. అల్ దావతుల్ మక్కియ్యా (మక్కా ఖజానా).
  5. హుసాముల్ హరమైన్[1]

కొన్ని ముఖ్యమైన రచనలు : 1. ఫతావా రజ్వియా (12 సంపుటాలు) 2. హుసాముల్ హరమైన 3. ఫతావా హరమైన్ 4. అద్-దౌలతుల్ మక్కియా 5. ఫతావా ఆఫ్రికా 6. అహ్ కామె షరీయత్ 7. సుభానుస్ సుబూహ్ 8. అల్-అమన్ ఒ-వల్-ఔలా 9. దవాముల్ ఐష్ 10. సల్తనత్ ఎ ముస్త్తఫా 11. కిల్ ఫుల్ ఫకీహిల్ ఫహీమ్ 12. అల్ సమ్ సామ్

దస్త్రం:Alahazratstamp.jpg
భారత ప్రభుత్వంచే, ఆలా హజ్రత్ అహ్మద్ రజా ఖాన్ గౌరవసూచకంగా విడుదల చేసిన తపాలా బిళ్ళ.

.

గులాం అహ్మద్ కు వ్యతిరేకంగా ఉద్యమం

[మార్చు]

ఆ కాలంలో మిర్జా గులాం అహ్మద్ అనే ఒక ఖాదియాన్ తనకు తాను ఒక ప్రవక్తగా ప్రకటించుకొన్న కాలం. ఇస్లామీయ ప్రపంచంలో ఇదో సంచలనాత్మక ఘటన. మిర్జా గులాం అహ్మద్, ఓ ఫిత్నా, ఈతను ముస్లింలలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించినపుడు, అతనికి, అతని అసంబద్ధ సిద్ధాంతానికి వ్యతిరేకంగా గళం విప్పిన ధీరుడు. ఈ ఫిత్నాను అణచివేయడంలో తన పాత్రను అమోఘంగా పోషించాడు.[2].

మూలాలు

[మార్చు]
  • Baraka, A - A Saviour in a Dark World (Article) The Islamic Times, March 2003 Stockport, UK

Haroon, M The World of Importance of Imam Ahmad Raza Kazi Publications, Lahore 1974

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]