సున్నీ ఇస్లాం
సున్నీ ముస్లింలు ఇస్లాం మతమును అవలంబించు ఒక పెద్ద వర్గం. ప్రపంచపు ముస్లిం జనాభాలో దాదాపు 90% సున్నీముస్లిములే. వీరు అవలంబించు ధర్మాన్ని సున్నీ ఇస్లాం అని, లేదా అహలే సున్నత్ వల్-జమాఅత్ (అరబ్బీ : أهل السنة والجماعة) (మహమ్మదు ప్రవక్త సున్నహ్ను అవలంబించు ముస్లింల సమూహము). వీరు అధికసంఖ్యలో ఉన్నారు. క్లుప్తంగా అహలె సున్నత్ (అరబ్బీ: أهل السنة ) అని కూడా అంటారు. 'సున్నీ' అనే పదం సున్నహ్ (అరబ్బీ : سنة ), నుండి ఉధ్బవించింది, అర్థం 'పదాలు, క్రియలు'[1] లేదా మహమ్మదు ప్రవక్త ఉదాహరణలు. ఈ వర్గం ఖలీఫాలను అబూబక్ర్, వారి వారసులను ఆమోదిస్తుంది, వీరు షూరా అనగా ప్రజామోదంచే ఎన్నుకోబడ్డారు.
జనగణన
[మార్చు]ప్రపంచంలోని ముస్లింల జనగణనావిషయంలో తలో అభిప్రాయంవున్నది. ముస్లింల జనాభా ఎంత? అందులో సున్నీలు షియాల గణన ఎంత? ఈవిషయంపై సరైన అవగాహనే కలగదు. ఒకవిషయంమాత్రం విదితం, అదేమనగా దాదాపు 60ముస్లిం దేశాలున్నాయి అందులో మెజారిటీ షియాలున్న దేశం ఒక్క ఇరాన్ మాత్రమే. ఇరాక్, ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో చెప్పుకోదగ్గ షియా సముదాయమున్నది. భారతదేశంలోనూ షియాలు నివసిస్తున్నారు. అదే సున్నీల విషయానికి వస్తే అన్ని ఇస్లామీయ దేశాలలో సున్నీలు మెజారిటీగా కనిపిస్తారు. క్లుప్తంగా ప్రపంచ ముస్లిం జనాభాలో 90% నుండి 92.5% సున్నీ ముస్లింలుంటే, 7.5% నుండి 10% వరకు షియాలున్నారు.[2]
సున్నీ న్యాయపాఠశాల (మజ హబ్)
[మార్చు]ఇస్లామీయ న్యాయశాస్త్రాన్ని షరియా అంటారు. షరియా యొక్క మూలాధారం ఖురాన్, సున్నహ్ లు. "వివిధ న్యాయశాస్త్రాల అవలంబీకులైననూ, పరస్పరవైరుధ్యంలేకుండా ఒకే మస్జిద్ లో ప్రార్థనలు చేసెదరు. సున్నీ ముస్లింల న్యాయపాఠశాలలు నాలుగు, వారి స్థాపకులు:
ఈ పాఠశాల అవలంబీకులకు "హనఫీ"లు అంటారు. ఈ పాఠశాలను స్థాపించినవారు "అబూ హనీఫా" (తారీఖు. 767). ఇతను ఇరాక్లో జన్మించాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, మధ్యాసియా ఇరాక్, టర్కీ, జోర్డాన్, లెబనాన్, సిరియా, పాలస్తీనా లోని ముస్లింలు ఈ పాఠశాలను అవలంబిస్తారు.
- మాలికి పాఠశాల (స్థాపకులు: మాలిక్ ఇబ్న్ అనస్ మరణం 795) మహమ్మదు ప్రవక్త ఆఖరు సహాబాలను చూసిన ఇతను తన ఆలోచనలను మదీనాలో ప్రవేశపెట్టాడు. ఈ పాఠశాల సున్నీ ముస్లింలలో అధికారికమైన పాఠశాల. ఇతని నిర్వచనాన్ని 'మువత్తా' లో గ్రంథస్తమయింది. ఈ పాఠశాల అవలంబీకులు ఆఫ్రికా ఖండం అంతటా దాదాపు వ్యాపించియున్నారు.
- షాఫయీ పాఠశాల (స్థాపకులు : ముహమ్మద్ ఇబ్న్ ఇద్రీస్ అష్-షాఫయీ మరణం 820). ఇతను ఇరాక్, ఈజిప్టులలో బోధించాడు. ప్రస్తుతం ఇండోనేషియా, దక్షిణ ఈజిప్టు, మలేషియా, యెమన్ ముస్లింలు ఈ పాఠశాలను అవలంబిస్తారు. ఇతను మహమ్మదు ప్రవక్త యొక్క సున్నహ్ ను అమితంగా ప్రాధాన్యతనిచ్చాడు, ఇవన్నియూ హదీసులనుండి గ్రహింపబడినవి. ఈ హదీసులే షరియాకు మూలం.
- హంబలి పాఠశాల (స్థాపకులు: అహ్మద్ బిన్ హంబల్)
అహ్మద్ ఇబ్న్ హంబల్ (మరణం : 855) బాగ్దాదులో జన్మించాడు. ఇతను షాఫయీ నుండి ఎన్నో విషయాలను అభ్యసించాడు. ఈ పాఠశాలావంబీకులు అరేబియన్ ద్వీపకల్పంలో మెండు.
పై నాలుగు పాఠశాలలన్నియూ వైవిధ్యంగలవి, గాని సున్నీముస్లింలు వీటిన సాధారణంగా సమాన దృష్టితో చూస్తారు.
మజ్ హబ్ విషయంలో సందేహం తలెత్తుతుంది. మజ్ హబ్ అనగా పాఠశాల, మతము గాదు. ముస్లిం సముదాయాలలో ఈ నాలుగు పాఠశాలలు సాధారణంగా కానవస్తాయి. సున్నీ ముస్లింలు ఈ మజ్ హబ్ లను సమాన దృష్టితో చూసిననూ, ఏదో ఒక మజ్ హబ్ ను నిర్దిష్టంగా నిష్ఠగా పాటించవలెనని బోధిస్తారు. వీటన్నిటికీ మూలం ఖురాన్, హదీసులు మాత్రమేనని మరువగూడదు.
సున్నీ దృష్టికోణంలో హదీసులు
[మార్చు]ఖురాన్ను సహాబాలు సా.శ. 650 లో క్రోడీకరించారు. మహమ్మదు ప్రవక్త గారి జీవితంలో ఆయన అనుసరించినవిధానాలు, ఆచరించిన సంప్రదాయాలను హదీసులుగా స్థిరీకరించారు. ఈ స్థిరీకరించిన సంప్రదాయాలను హదీసుల క్రోడీకరణలు గావించారు. ఈ హదీసులు ముఖ్యంగా ఆరు గలవు. సున్నీ ముస్లింల ప్రకారం అవి క్రింది విధంగా యున్నవి.
- సహీ అల్-బుఖారి : (ముహమ్మద్ అల్-బుఖారి)
- సహీ ముస్లిం
- సునన్ అన్-నసాయి
- సునన్ అబూ దావూద్
- సునన్ అల్-తిర్మజి
- సునన్ ఇబ్న్ మాజా : (ఇబ్న్ మాజా)
హదీసు క్రోడీకరణలు ఇంకనూ వున్నవి, వీరికి పేరు ప్రఖ్యాతులు లేనప్పటికీ ఇవి అధికారికమైన హదీసులుగా పరిగణిస్తారు. వీటిని ఈరంగంలో పరిణతి చెందినవారు ఉల్లేఖిస్తూవుంటారు. ఇవి:
- మువత్తా, ఇమామ్ మాలిక్కు చెందిన.
- మస్ నద్, అహ్మద్ ఇబ్న్ హన్ బల్కు చెందిన.
- సహీహ్ ఇబ్న్ ఖుజైమా
- సహీహ్ ఇబ్న్ హిబ్బాన్
- ముస్తద్ రక్, అల్ హాకిమ్
- ముసన్నఫ్ అబ్దుల్ రజాఖ్
మూలాలు
[మార్చు]- ↑ http://dictionary.reference.com/search?q=Sunna
- ↑ ""How Many Shia Are in the World?"". IslamicWeb.com. Retrieved 2006-10-18.
ఇవీ చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- Islamic Law Infobase
- University of Southern California, Compendium of Muslim Texts
- Fiqh al-Akbar by Imam Abu Hanifah
- Muwatta by Imam Malik
- Searchable Ar-Risala by Imam Shafi'i
- Foundations of the Sunnah, by Imam Ahmad ibn Hanbal
- Source Methodology in Islamic Jurisprudence (Usul al-Fiqh), by Taha Jabir Al 'Alwani