ఇస్లామీయ ప్రవక్తలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రవక్తలు : ప్రవక్తలు అనగానే అనాది కాలపు మనుషులు వారిని సంస్కరించడానికి పూనుకొన్న మహనీయులు జ్ఞాపకం వస్తారు. ఖురాన్ బైబిల్, హదీసుల ప్రకారం సరిగ్గా ఇలాంటి వారే ప్రవక్తలు. (అల్లాహ్) తాను సృష్టించిన మానవాళిని సన్మార్గము విడువకుండా చక్కటి ప్రాకృతిక జీవనం, అందులో ఆధ్యాత్మికత, దైవికత, సత్సీలత గల్గిన జీవనాన్ని సాగించుటకై, సదరు జీవనానికి కావలసిన సిద్ధాంతాలనూ మార్గదర్శకాలనూ చేరవేయడానికి తన వార్తాహరులను (పైగంబరులను) భూమిపై అవతరింపజేశాడు, వారే ప్రవక్తలు.

అల్లాహ్ వాక్కు ఖురాను, బైబిల్ ప్రకారం ఆదమ్ ఆది పురుషుడు, ప్రథమ ప్రవక్త. మహమ్మద్ చివరి ప్రవక్త.

హదీసుల ప్రకారం 1,24,000 (లక్షా ఇరవై నాలుగు వేల) ప్రవక్తలు అవతరించారు. ఖురానులో 25 ప్రవక్తల ప్రస్తావన ఉంది. అనగా ఖురానులో ప్రస్తావనకు రాని ప్రవక్తలు 1,23,975. మానవజాతి పుట్టుక ఆదమ్ ప్రవక్త నుండి మహమ్మద్ ప్రవక్త పుట్టుక మధ్యకాలంలో 1,23,998 ప్రవక్తలు అవతరించారు. ప్రతి యుగంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతిలోనూ ఈశ్వరుడు (అల్లాహ్) ప్రవక్తలను అవతరింపజేశాడు.

ప్రతి ప్రవక్త ఈశ్వరుడి (అల్లాహ్) హెచ్చరికలను ప్రజానీకానికి చేరవేస్తాడు. ప్రతి ప్రవక్తకాలంలోని ప్రవక్తల అనుయాయులందరూ ముస్లిములే, కాని క్రొత్త ప్రవక్త అవతరించినచో అతడిని అవలంబించవలసి యుంటుంది. ఉదాహరణకు ఇబ్రాహీం ప్రవక్త (అబ్రహాము) అనుయాయులు ఇస్మాయీల్, ఇస్ హాఖ్ లను అవలంబించారు. వీరి అనుయాయులు మూసా (మోషే) ను అవలంబించారు. వీరి అనుయాయులు ఈసా (యేసు) ను అవలంబించారు. ఇది ప్రవక్తల గొలుసుక్రమం. వీరందరూ ఈ క్రమంలోని అంతిమ ప్రవక్త అయిన మహమ్మదును అవలంబించవలెను. ఇదే ముస్లింల విశ్వాసం.

ఖురానులో , బైబిల్ వర్ణింపబడ్డ ప్రవక్తలు

[మార్చు]
మైఖేల్ ఏంజిలో ప్రసిద్ధ చిత్రం - ఆదాము సృష్టి - సిస్టైన్ చాపెల్ కప్పుపైని చిత్రం. ఈ బొమ్మలో ఎడమ ప్రక్కనున్న వ్యక్తి ఆదాము.

బ్రాకెట్ లో తెలుగు బైబిల్ లో వారికున్న పేరు.

 1. ఆదమ్ ప్రవక్త (ఆదాము ) (ప్రథమ ప్రవక్త)
 2. షీత్ (షేతు )ఆదమ్ మూడవ కుమారుడు .
 3. ఇద్రీస్ ( హనోకు )
 4. నూహ్ (నోవహు )
 5. హూద్
 6. సాలెహా
 7. ఇబ్రాహీం (అబ్రాహాము )
 8. లూత్ (లోతు )
 9. ఇస్మాయీల్ (ఇష్మాయేలు )
 10. ఇస్ హాఖ్ (ఇస్సాకు )
 11. యాఖూబ్ (యాకోబు )
 12. యూసుఫ్ (యోసేపు )
 13. అయ్యూబ్ (యోబు )
 14. షోయెబ్
 15. మూసా (మోషే )
 16. హారూన్ (అహరోను )
 17. యోషే బిన్ నూన్
 18. సమూయీల్ (సమూయేలు )
 19. ఉజైర్ (ఎజ్రా )
 20. జుల్ కిఫ్ ల్ (యెహెజ్కేలు )
 21. దావూద్ (దావీదు )
 22. సులేమాన్ (సొలోమోను )
 23. ఇలియాస్ (ఏలియా )
 24. అల్ యసా (ఎలీషా )
 25. యూనుస్ (యోనా )
 26. జక్రియా (జకర్యా )
 27. యహ్యా (యోహాను )
 28. మరియమ్ (మరియ )
 29. ఈసా (యేసు )
 30. ముహమ్మద్ (అంతిమ ప్రవక్త)

ఇస్లాం , క్రైస్తవం ప్రవక్తలు , వార్తాహరులు

[మార్చు]
ఖురాన్ లో ప్రవక్తలు, వార్తాహరులు
పేరు ప్రవక్త వార్తాహరుడు ఇమామ్ గ్రంథం పంపబడిన ప్రాంతం చట్టం (షరియా)
ఆదమ్ ప్రవక్త
ఇద్రీస్ ప్రవక్త [1]
నూహ్ ప్రవక్త [2] వార్తాహరుడు [3] నూహ్ ప్రజలు [4] [5]
హూద్ వార్తాహరుడు [6] ఆద్ [7]
Saleh Messenger [8] Thamud [9]
Abraham (Ibrahim) Prophet [10] Messenger [11] Imam [12] Scrolls of Ibrahim [13] The people of Ibrahim [14] [15]
Lot Prophet [16] Messenger [17] The people of Lot [18]
Ismail Prophet [19] Messenger [19]
Isaac Prophet [20] Imam [21]
Jacob Prophet [20] Imam [21]
Al-Asbat Prophet [20] Imam [21]
Joseph Prophet [16]
Ayoub Prophet [16]
Shuaib Messenger [22] Midian [23]
Moses Prophet [24] Messenger [24] తోరాహ్ [25] Pharaoh and his establishment [26] [15]
Aaron Prophet [27]
Dhul-Kifl Prophet
David Prophet [2] Psalms [28]
Solomon (Suleiman) Prophet [2]
Elias Prophet [2] Messenger [29] The people of Elias [30]
Elisha Prophet [2]
Jonah (Younis) Prophet [2] Messenger [31] The people of Younis [32]
Zechariah Prophet [2]
యహ్యా (జాన్ ద బాప్టిస్ట్ Prophet [33]
ఈసా Prophet [34] Messenger [35] Gospel [36] The people of Israel [37] [15]
ముహమ్మద్ Prophet [38] Messenger [38] Quran [39] Whole Mankind [40] [15]

క్రైస్తవంలో ప్రవక్తిలు

[మార్చు]

పాత నిబంధన కాలంలో మిరియమ్ (నిర్గమ 15:20), దెబోరా (న్యాయా4"4), హల్దా (2రాజు 22:14), హన్నా (1సమూ 2:1) లాంటి స్త్రీలు ప్రవక్త లుగా ఉన్నారు.కొత్తనిబంధన కాలంలో అన్నా (లూకా 2:36), ఫిలిప్పు నలుగురు కుమార్తెలు (అపో 21:8) ప్రవక్తలుగా ఎంచబడ్డారు. ఇస్లాంలో మరియం తప్ప ఇంకెవరూ ప్రవక్త స్థాయికి ఎదిగినట్లు లేదు.

ప్రవక్తలపై శాంతి వచనాలు

[మార్చు]

అలైహిస్ సలాం : అలైహిస్ సలాం (peace be upon him) అను వాక్యాన్ని ముహమ్మద్ కాకుండా ఇతర ప్రవక్తలు, జిబ్రీల్, మికాయిల్ లాంటి దేవదూతల పేర్లకి suffix గా వాడుతారు.

ఇదీ చూడండి

[మార్చు]

భగవంతుడు (అల్లాహ్) 124000 మంది ప్రవక్తలను అవతరింపజేశాడు గదా! ఖురాన్లో కేవలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే ప్రస్తావింపబడ్డాయే? మిగతావారి పేర్లు ఎందుకు ప్రస్తావింపబడలేదు? వారెవరై ఉండవచ్చు? శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, జరాత్రుష్టుడు (ఇరాన్ లోని జొరాస్ట్రియన్ మత స్థాపకుడు), గౌతమ బుద్ధుడు లాంటి యుగపురుషులు, పుణ్యపురుషులూ ప్రవక్తలే అని, ఆదమ్, ఒకరేనని గాఢంగా నమ్మే వారు ఎందరో ఉన్నారు. ఎవరెవరు ప్రవక్తలో అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్కు తెలుసు, అతడు సర్వజ్ఞాని...అంతే కాదు అల్లాహ్ కూడా పరమేశ్వరుడు

సంశయాలు - విశ్వాసాలు

[మార్చు]

సృష్టికర్తకూ - సృష్టికి, పరమేశ్వరుడికీ - ప్రవక్తకీ నడుమ తేడాలను స్పష్టంగా ప్రకటింపబడినప్పటికీ, కొన్ని జాతులూ, సమూహాలు, ఈ ప్రవక్తలకే పరమేశ్వరునిగా భావించారు. ఉదాహరణకు యేసు-యెహోవా ఒక్కడే యని క్రైస్తవుల విశ్వాసం.


మూలాలు

[మార్చు]
 1. ఖురాన్ 19:56
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 ఖురాన్ 6:89 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "6:89" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 3. ఖురాన్ 26:107
 4. ఖురాన్ 26:105
 5. ఖురాన్ 13:42
 6. ఖురాన్ 26:125
 7. ఖురాన్ 7:65
 8. Quran 26:143
 9. Quran 7:73
 10. Quran 19:41
 11. Quran 9:70
 12. Quran 2:124
 13. Quran 87:19
 14. Quran 22:43
 15. 15.0 15.1 15.2 15.3 Quran 42:13
 16. 16.0 16.1 16.2 Quran 4:89
 17. Quran 24:142
 18. Quran 24:140
 19. 19.0 19.1 Quran 19:54
 20. 20.0 20.1 20.2 Quran 19:49
 21. 21.0 21.1 21.2 Quran 21:73
 22. Quran 26:178
 23. Quran 7:85
 24. 24.0 24.1 Quran 19:51
 25. Quran 53:36
 26. Quran 43:46
 27. Quran 19:53
 28. Quran 17:55
 29. Quran 37:123
 30. Quran 37:124
 31. Quran 37:139
 32. Quran 10:98
 33. Quran 3:39
 34. Quran 19:30
 35. Quran 4:171
 36. Quran 57:27
 37. Quran 61:6
 38. 38.0 38.1 Quran 33:40
 39. Quran 42:7
 40. Quran 7:158