Jump to content

యహ్యా ప్రవక్త

వికీపీడియా నుండి
(యహ్యా నుండి దారిమార్పు చెందింది)

యహ్యా ఇబ్న్ జకరియ ( يحيى ابن زكريا) ఒక ఇస్లామీయ ప్రవక్త. బైబిల్ లో ఇతని పేరు జాన్ ద బాప్టిస్ట్. ఇస్లామీయ ధార్మికగ్రంధము ఖురాన్ ప్రకారము అల్లాహ్ యహ్యాను పరిశుద్ధమైన ప్రవక్త, ఈసా అవతరించుటకు మార్గమును సుగమంచేసిన ప్రవక్తగా వర్ణించాడు.[1]

ఖురాన్ ప్రకారము

[మార్చు]

ఖురాన్ ప్రకారం యహ్యా జక్రియా కుమారుడు. యహ్యా బాల్యమునుండే పరిశుధ్ధిడిగాను అల్లాహ్ పట్ల విధేయుడిగాను వుండేవాడు. యహ్యా సత్యసంధుడు, అమిత గౌరవంతుడు. అతడు అల్లాహ్ ఆదేశాలను ప్రజలవద్దకు చేరవేశాడు. జాఫర్ అబిసీనియాకు వలస వెళ్ళినపుడు రాజుకు యహ్యాకథను వర్ణించాడు.[2].

సమాధి

[మార్చు]
యహ్యా బిన్ జక్రియా సమాధి, ఉమయ్యద్ మస్జిద్, డెమాస్కస్.[3]

యహ్యాను ముస్లిములేగాక క్రైస్తవులుగూడా అమితంగా గౌరవిస్తారు. ఇస్లామీయ చరిత్రకారుడు అల్-బెరూని ప్రకారం యహ్యావర్థంతిరోజున పెద్దయెత్తున నివాళులర్పిస్తారు. డెమాస్కస్ లోగల యహ్యా సమాధిని నేటికినీ వేలాదిమంది దర్శిస్తారు. ఉమయ్యద్ఖలీఫా అల్-వలీద్ కాలంలో యహ్యా పుర్రె దొరికినది. దీనిని డెమాస్కస్ లోని స్తంభంలో భద్రపరిచారు. ఈ స్తంభం ఖర్జూరపుఆకుల బుట్ట ఆకారంలోయున్నది.[3]

ఇతర కథనాల ప్రకా ఇతని పుర్రె మిర్దాసిద్ సామ్రాజ్యపు 'ముఇజ్ అల్-దౌలా' చే 1043లో అలెప్పో నగరానికి తరలించబడింది. చరిత్రకారులు జైద్ బిన్ అల్-హసన్ అల్-ఖింది, ఇబ్న్ అల్-అదీమ్ లప్రకారం యహ్యా పుర్రెను అలెప్పో లోని మస్జిద్ లో పాలరాతితోతయారుచేయబడిన ఒక బేసిన్ లో భద్రపరిచారు. తరువాత మంగోలులు సిరియా పై దురాక్రమణ చేసినపుడు మంగోలులదాడులవలన ఈమస్జిద్ నేలమట్టమయినది. అపుడు ఆ పుర్రెను జామియా మస్జిద్ కు తరలించారు. ఇబ్న్ షద్దాద్ ప్రకారం ఈ పుర్రె నేటికినీ ఈమస్జిద్ మీనార్ లో భద్రంగా ఉంది. సిరియాలో ఈప్రదేశం పరమపవిత్రంగా భావింపబడుతుంది.[3]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Yahya", Encyclopedia of Islam
  2. The Sealed Nectar The Second ‘Aqabah Pledge Archived 2006-11-28 at the Wayback Machine on sunnipath.com
  3. 3.0 3.1 3.2 Meri (2002) pp. 200-01
  • Meri, J. W. (2002). The Cult of Saints Among Muslims and Jews in Medieval Syria. Oxford University Press. ISBN 0199250782.
  • Rippin, A. "Yahya b. Zakariya". In P.J. Bearman, Th. Bianquis, C.E. Bosworth, E. van Donzel, W.P. Heinrichs (ed.). Encyclopaedia of Islam Online. Brill Academic Publishers. ISSN 1573-3912.{{cite encyclopedia}}: CS1 maint: multiple names: editors list (link)

బయటి లింకులు

[మార్చు]