హిజ్రత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్ మహమ్మదు ప్రవక్త, అతని అనుయాయులు మక్కా నుండి మదీనాకు సా.శ. 622లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.

మక్కా నగరంలో మహమ్మదు ప్రవక్తకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఏకేశ్వరవాదన వినడానికి మక్కావాసులు తయారులేరు. మహమ్మదు ప్రవక్త ఏకేశ్వరవాదాన్ని విగ్రహారాధనను ఖండించడాన్ని మక్కావాసులు జీర్ణించుకోలేకపోయారు. మహమ్మదు ప్రవక్తపై అతని అనుయాయులపై కత్తిగట్టారు. సా.శ. 615 లో మహమ్మదు ప్రవక్త అనుయాయులు ఇథియోపియా లోని అక్సూమ్ సామ్రాజ్యంలో తలదాచుకొన్నారు. ఈ రాజ్యానికిరాజు క్రైస్తవుడు. ఏకేశ్వరవాదకులైన మహమ్మదుప్రవక్త అనుయాయులకు శరణమిచ్చాడు. "యస్రిబ్" (ప్రస్తుతం దీని పేరు మదీనా) నగరవాసులు మహమ్మదు ప్రవక్తకు ఆహ్వానించారు. మహమ్మదు ప్రవక్త మక్కా నగరాన్ని వదలడానికి నిశ్చయించుకొన్నారు.

సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. మహమ్మదు ప్రవక్త గారి వలస క్రింది విధంగా జరిగింది.

వలస జరిగిన క్రమం[మార్చు]

  • దినము 1: గురువారం 26 సఫర్ నెల, హి.శ. 1, సెప్టెంబరు 9, 622
    • మక్కానగరం లోని తన ఇంటిని వదిలారు. మక్కాకు దగ్గరలోని తూర్ గుహలో మూడు రోజులు గడిపారు.
  • దినము 5: సోమవారము 1 రబీఉల్ అవ్వల్ నెల, హి.శ. 1, సెప్టెంబరు 13, 622
    • మక్కా పొలిమేరలు దాటి యస్రిబ్ ప్రాంతానికి పయనం.
  • దినము 12: సోమవారం 8 రబీఉల్ అవ్వల్ నెల, హి.శ. 1, సెప్టెంబరు 20, 622
    • మదీనా దగ్గరలోని "ఖుబా" ప్రాంతానికి చేరుక.
  • దినము 16: శుక్రవారం 12 రబీఉల్ అవ్వల్, హి.శ. 1, సెప్టెంబరు 24, 622
    • ఖుబా నుండి మదీనా ప్రయాణం, శుక్రవారపు ప్రార్థనలు.
  • దినము 26: సోమవారం 22 రబీఉల్ అవ్వల్, హి.శ. 1, అక్టోబరు 4, 622
    • మదీనా మొదటి దర్శనం

హిజ్రీ మొహర్రం నెలలో ప్రారంభం కాలేదు. హిజ్రీ ప్రారంభం మొహర్రం నెలలో కాదు. ఇస్లామీయ కేలండరు లోని మూడవనెల అయిన రబీఉల్ అవ్వల్ నెలలో హిజ్రత్ జరిగింది కావున, హిజ్రీ శకం, హి.శ. 1 లోని మూడవ నెల అయిన రబీఉల్ అవ్వల్ 22 వ తేదీన ప్రారంభం అవుతుంది.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  • F. A. Shamsi, "The Date of Hijrah", Islamic Studies 23 (1984) : 189-224, 289-323.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హిజ్రత్&oldid=4069183" నుండి వెలికితీశారు