మస్జిదుల్ హరామ్

వికీపీడియా నుండి
(మస్జిద్-అల్-హరామ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ముస్లిం సమూహం.

అల్-మస్జిద్-అల్-హరామ్ (అరబ్బీ: المسجد الحرام "పవిత్రమైన మస్జిద్"), ప్రపంచంలోనే అతి పెద్ద మస్జిద్. మక్కా నగరంలో గలదు. ఈ మస్జిద్ కాబా గృహం చుట్టూ గలదు. ప్రపంచంలోని ముస్లింలు అందరూ కాబావైపు తిరిగి (ముఖంచేసి) ప్రార్థనలు చేస్తారు. దీనిని ఖిబ్లా అనిగూడా అంటారు. ముస్లింలు దీనిని ప్రపంచంలోనే పరమపవిత్రంగా భావిస్తారు. ఈ మస్జిద్ ను సాధారణంగా హరామ్ లేదా హరమ్ షరీఫ్ అని అంటారు.[1]

ప్రస్తుతం ఈ మస్జిద్ యొక్క వైశాల్యం 356,800 చదరపు మీటర్లు. హజ్ సమయంలో దీని లోపలి, వెలుపలి భాగంలో దాదాపు 40 లక్షలమంది నమాజ్ చేసే సౌకర్యం గలదు.

చరిత్ర[మార్చు]

ఇస్లాం సంప్రదాయాల ప్రకారం ఈ మస్జిద్ ను అల్లాహ్ ఆజ్ఞతో మానవసృష్టి అల్లాహ్ ను పూజించుటకు దేవదూతలు నిర్మించారు. ఈ మస్జిద్ కు సరాసరి పైభాగాన "అల్-బైతుల్-మామూర్" (అరబ్బీ : البيت المعمور, "దేవదూతల ప్రార్థనా స్థలం") గలదు. మొదటిసారిగా కాబాను ఆదమ్ ప్రవక్త (మానవుడు) నిర్మించాడు. కాలగర్భంలో ఎన్నో ప్రాకృతిక ఆటుపోట్లకు లోనై శిథిలావస్థకు చేరుకున్నది. దీనిని తిరిగీ ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడైన ఇస్మాయీల్ సహకారంతో పునర్నిర్మించాడు. ఇక్కడే "హజ్ర్-ఎ-అస్వద్ " (నల్లని రాయి) ఉల్కరూపంలో భూమిపై చేరింది. ఈ మస్జిద్ ప్రాంతంలోనే జమ్ జమ్ బావి కూడాయున్నది. అన్ని ఋతువులలోనూ సజలంగా వుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తూంది ఈ బావి.

మేము కాబా ప్రదేశాన్ని నిర్ణయిస్తూ ఇబ్రాహీం కు తెలియజేశాము, నన్ను ఎవరుతోనూ జోడించకండి, నాభక్తులు, నాముందు మోకరిల్లువారు, కాబాచుట్టూ ప్రదక్షిణలు చేయువారికొరకు ఈ ప్రాంతాన్ని పరిశుధ్ధంగా వుంచండి..

Qur'an, మూస:Quran-usc

ఇబ్రాహీం , ఇస్మాయీల్ కాబా గృహనిర్మాణం కొరకు పునాదులను నిర్మించారు, , అన్నారు: ఓ అల్లాహ్! మమ్మల్ని (మా పనులను) స్వీకరించు; నీవు అంతా వినేవాడివి , తెలుసుకునే వాడివి.

Qur'an, మూస:Quran-usc

హిజ్రత్ తరువాత, మహమ్మదు ప్రవక్త మక్కాపై రక్తరహిత విజయం సాధించిన తరువాత, మక్కావాసులు స్వయంగా కాబా గృహంనుండి విగ్రహాలను తొలగించారు, కాబాను పరిశుధ్ధం చేశారు. కాబా ముస్లింల (ఏకేశ్వరోపాసక) తీర్థయాత్ర అయింది. ముస్లింలు ఈ కాబా చుట్టూ ఒక మస్జిద్ ను నిర్మించారు.

692 లో మొదటిసారిగా ఈ మస్జిద్ ను విశాలీకరించారు. మూడు మీనార్లను కూడా నిర్మించారు.

1399 లో ఈ మస్జిద్ కొంతభాగం అగ్ని బారిన పడింది. ఇంకోసారి భారీవర్షాలమూలంగా కొద్దిగా దెబ్బతింది. తిరిగీ ఈ మస్జిద్ ను పునర్నిర్మించారు. ఈసారి పాలరాయినీ కలపనీ ఉపయోగించారు. 1570 లో ఇంకోసారి దీనినిర్మాణం చేపట్టారు. 1629 లోనూ విశాలీకరిస్తూ పునర్నిర్మించారు.

సౌదీ అభివృధ్ధి[మార్చు]

1620 లో భారీవర్షాల మూలంగా దెబ్బతింది. సౌదీయులు దీనిని తిరిగి పునర్నిర్మించారు. ఈ సారి, ఈ కట్టడం దాదాపు 3శతాబ్దాల పాటు వుండినది. ఈసారి దీనికి నాలుగు మీనార్లు నిర్మించారు. రెండవ నిర్మాణలో "ఫహద్ రాజు" బాహ్య ప్రార్థనా హాలును, ఫహద్ ద్వారాన్ని నిర్మించాడు. ఈ నిర్మాణం 1982-1988 లో జరిగింది.

సౌదీయుల మూడవ విశాలీకరణ (1988-2005) లో మరికొన్ని మీనార్లు నిర్మించారు. అరఫాత్, మినా, ముజ్ దలిఫా లను అభివృధ్ధిపరచారు. ఈ సారి మస్జిద్ కు 18 ద్వారాలతోనూ 500 పాలరాతి స్తంభాలతోనూ నిర్మించారు. నవీనపద్ధతులతో విశాలమైన హాలులతో అధునాతనరూపంలో దీనిని నిర్మించారు.

నాలుగవ విశాలీకరణ 2007 నుండి 2020 వరకూ జరుగునట్లు ప్రణాళికలు రూపొందించారు. ఈ సారి మస్జిద్ ను 35% విశాలీకరణ్ జరుగునట్లు 11,20,000 మంది సామూహిక ప్రార్థనలు జరుపుకొనునట్లు ప్రణాళికలను సిధ్ధపరిచారు.

మతపరమయిన ప్రాముఖ్యత[మార్చు]

దీని ప్రాముఖ్యం ద్విముఖం. ఇది ఖిబ్లా కేంద్రము, హజ్ కేంద్రము.

ఖిబ్లా[మార్చు]

ఖిబ్లా ముస్లింలు ప్రార్థనలకు నిలుచునపుడు ఈ (కాబా) దిక్కువైపునే తిరిగి ప్రార్థనలు చేస్తారు. కాబాను ఖిబ్లాగా చేయకమునుపు ముస్లింలకు బైతుల్-ముఖద్దస్ ఖిబ్లాగా వుండేది. కాని ఈ ఖిబ్లా కేవలం 17 నెలలు మాత్రమే వుండినది. మహమ్మదు ప్రవక్త సహాబా ల ప్రకారం ఓసారి మదీనాలో మధ్యాహ్నపు ప్రార్థనల నిమిత్తం మస్జిద్ అల్-ఖిబ్లతైన్లో (బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి) ప్రార్థిస్తూ వుండగా యకాయకిన అల్లాహ్ నుండి ఆదేశం వెలువడింది మీ ఖిబ్లాను కాబా దిశ వైపు మార్చు కోండి అని. ఒకేప్రార్థన (నమాజ్) లో రెండు ఖిబ్లాలు గల నమాజును చేశారు గనుక ఈ మస్జిద్ను 'మస్జిద్ అల్-ఖిబ్లతైన్' అనే పేరొచ్చింది.

పుణ్యక్షేత్రం[మార్చు]

దస్త్రం:Kaaba Mirror.JPG
Pilgrims circumambulating the Kaaba during the Hajj

"హరమ్" హజ్, ఉమ్రా తీర్థయాత్రికులకు కేంద్రబిందువు.[2] హజ్ ఇస్లామీయ కేలండర్ లోని పన్నెండవ నెలయైన జుల్-హజ్జాలో సంభవిస్తుంది. ఉమ్రా సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చును. హజ్ యాత్ర ఇస్లాం ఐదు మూలస్థంభాలులో ఐదవది. స్తోమతవున్న ప్రతి ముస్లిం జీవితంలో కనీసం ఒక్కసారైనా దీనిని పూర్తి చేయవలెను. ప్రతియేటా 30లక్షలమంది తీర్థయాత్రికులు ఈ హజ్ తీర్థయాత్రను పూర్తిచేస్తారు.

కాబా[మార్చు]

సాహిత్యపరంగా కాబా అనగా చతురస్రాకారపు గృహం.

'కాబా' కు కొన్ని ఇతర నామాలు :

  • అల్-బైత్ ఉల్-అతీఖ్ అనగా అత్యంత ప్రాచీన, స్వతంత్రమైన.
  • అల్-బైత్ ఉల్-హరామ్ అనగా అత్యంత గౌరవప్రధమయిన గృహం.

బూడిదనీలం రంగుగల రాళ్ళతో చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే ఈ కాబా. నలువైపులా నాలుగు విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున హజ్ర్-ఎ-అస్వద్ ('హజ్ర్' అనగా రాయి, అస్వద్ అనగా నల్లని, నల్లనిరాయి) ఉత్తరం వైపున రుక్న్-అల్-ఇరాఖీ (ఇరాకీ మూల), పశ్చిమాన రుక్న్-అల్-షామి (సిరియన్ మూల),, దక్షిణాన రుక్న్-అల్-యెమని (యెమనీ మూల) గలవు. నాలుగు గోడలూ 'కిస్వాహ్' (తెర) చే కప్పబడిఉన్నవి. కిస్వాహ్ సాధారణంగఅ నల్లని తెర, దీనిపై 'షహాద' వ్రాయబడివుంటుంది. బంగారపు ఎంబ్రాయిడరీచే ఖురాన్ ఆయత్ లు వ్రాయబడివుంటాయి. హతీం :కాబా గర్భగుడికి ఒకవైపు 9 అడుగుల అర్ధచంద్రాకార ఖాళీ స్థలం.ఖాళీగా వదిలిన కాబా స్థలాన్ని కాబాలో కలిపేయాలని ముహమ్మద్ ప్రవక్త అనుకున్నారు. (ముస్నద్ అహ్మద్).అబ్దుల్లా బిన్ జుబైర్ కాలంలో ఆ ఖాళీ స్థలం కలిపి కాబాను నిర్మించారు.కానీ ఆయన చనిపోయాక మళ్ళీ ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు.ఎందుకనో ముహమ్మద్ ప్రవక్త కోరుకున్నట్లుగా ఈ స్థలాన్ని సౌదీ ప్రభుత్వం ఈనాటికీ కాబాలో కలపలేదు.

ఇమామ్ లు[మార్చు]

హరమ్ షరీఫ్ లో గల ఇమామ్లు సామూహిక నమాజ్ ఆచరించుటకు నియుక్తులవుతారు.

ముఅజ్జిన్ లు[మార్చు]

హరమ్ షరీఫ్ లో ముఅజ్జిన్లు 16 మంది తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రంజాన్ నెలలో మరి ఆరు మంది నియుక్తులవుతారు. ముఅజ్జిన్ లు ధార్మికంగాను, సత్యసంధులుగాను, మధురమైన 'గొంతు'ను (అజాన్ పలుకుటకు) కలిగివుండవలెనని నిబంధన.

ఘటనలు[మార్చు]

1979 లో మస్జిద్ ఆక్రమణ[మార్చు]

1979 నవంబరు 20 న కొంతమంది తీవ్రవాదులు మస్జిద్ పై ఆక్రమణ చేశారు. ఈ సంఘటన యావత్ ముస్లిం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సౌదీబలగాలు తీవ్రవాదులను వధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

1987 ఘటనలు[మార్చు]

1987 జూలై 31 ఇరానీ యాత్రికులు సామూహికంగా ప్రదర్శన జరిపి మస్జిద్-అల్-హరామ్ ను తమ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నంచేశారు. సౌదీ సెక్యూరిటీగార్డుల కాల్పులలో 402 మంది యాత్రికులు మరణించారు (ఇందులో 275 ఇరానీయులు, 85 మంది సౌదీయులు (పోలీసులతోసహా), 45 మంది ఇతర దేశస్థులు). 649 మంది గాయపడ్డారు.[ఆధారం చూపాలి]

వీటినీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Orientation". Archived from the original on 2007-04-09. Retrieved 2008-02-20.
  2. Mohamed, Mamdouh N. (1996). Hajj to Umrah: From A to Z. Mamdouh Mohamed. ISBN 0-915957-54-X.

బయటి లింకులు[మార్చు]

మూస:Geolinks-buildingscale