కాబా
Kaaba | |
---|---|
Coordinates: 21°25′21″N 39°49′34″E / 21.422495°N 39.826165°E | |
ప్రదేశం | Mecca, al-Hejaz, Saudi Arabia |
ఇస్లామిక్ శాఖ/సంప్రదాయం | Islam |
నిర్మాణ సమాచారం | |
గరిష్ట ఎత్తు | 13.1 మీ. (43 అ.) |
కాబా
సాహిత్యపరంగా కాబా అనగా ఘనాకారపు గృహం. అరబ్బీ భాషలో "కాబ్" లేదా "మకాబ్" అనగా ఘనాకారం.
కాబా ను ప్రథమంగా ఆదమ్ ప్రవక్త నిర్మించారు. తరువాత అది కాలగర్భంలో కలసిపోయింది. అల్లాహ్ ఆజ్ఞతో ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడు ఇస్మాయీల్తో కలసి దీనిని పునర్నిర్మించారు. కాని 'ఇబ్రాహీం' తొలిసారిగా 'కాబా' గృహాన్ని నిర్మించారని ప్రచారంలోవున్నది.
'కాబా' కు ఉన్న ఇతర పేర్లు :
- బైతుల్ అతీఖ్ = అత్యంత ప్రాచీన, స్వతంత్రమైనది.
- 'బైతుల్ హరామ్ = అత్యంత గౌరవప్రథమయిన గృహం.
బూడిదనీలం రంగుగల రాళ్ళతో చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే ఈ కాబా. నలువైపులా నాలుగు విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున హజ్ర్-ఎ-అస్వద్ ('హజ్ర్' అనగా రాయి, అస్వద్ అనగా నల్లని, నల్లనిరాయి) ఉత్తరం వైపున రుక్న్-అల్-ఇరాఖీ (ఇరాకీ మూల), పశ్చిమాన రుక్న్-అల్-షామి (సిరియన్ మూల),, దక్షిణాన రుక్న్-అల్-యెమని (యెమనీ మూల) గలవు. నాలుగు గోడలూ 'కిస్వాహ్ ' (తెర ) చే కప్పబడిఉన్నవి. కిస్వాహ్ సాధారణంగా నల్లని తెర, దీనిపై 'షహాద ' వ్రాయబడివుంటుంది. బంగారపు ఎంబ్రాయిడరీచే ఖురాన్ ఆయత్ లు వ్రాయబడివుంటాయి.
- హజ్ యాత్రికులు10-12 తేదీలలో కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణాలు (తవాఫ్ ) చేస్తారు.
- హతీం = ఖాళీగా వదిలిన కాబా స్థలాన్ని కాబాలో కలిపేయాలని ముహమ్మద్ ప్రవక్త అనుకున్నారు. (ముస్నద్ అహ్మద్) .అబ్దుల్లా బిన్ జుబైర్ కాలంలో ఆ ఖాళీ స్థలం కలిపి కాబాను నిర్మించారు. కానీ ఆయన చనిపోయాక మళ్ళీ ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు.ముహమ్మద్ ప్రవక్త కోరుకున్నట్లుగా ఈ స్థలాన్ని సౌదీ ప్రభుత్వం కాబాలో కలిపేయాలి.
కిబ్లా
[మార్చు]కిబ్లా లేదా ఖిబ్లా, ముస్లింలు ప్రార్థనలు చేసేటపుడు తమ ముఖాన్ని కాబా దిశవైపు ఉంచి ప్రార్థనలు చేస్తారు. దీనినే ఖిబ్లాగా వ్యవహరిస్తారు. ఖురాన్ (2:143) లో దీ గురించి దైవాజ్న కూడా ఉంది.
ఇవీ చూడండి
[మార్చు]