Coordinates: 24°28′06″N 39°36′39″E / 24.46833°N 39.61083°E / 24.46833; 39.61083

మస్జిదె నబవి

వికీపీడియా నుండి
(మస్జిద్-ఎ-నబవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ప్రవక్తగారి మస్జిద్ ( అరబ్బీ: المسجد النبوی), మదీనా నగరంలో గలదు. ఈ మస్జిద్ ఇస్లాం మతము లోని రెండవ అతిప్రాధాన్యం గల మస్జిద్. మహమ్మదు ప్రవక్త గారి ఆఖరి విశ్రాంతి ప్రదేశము. మస్జిద్-అల్-హరామ్ మొదటి ప్రాధాన్యంగలదైతే, అల్-అఖ్సా మస్జిద్ మూడవ ప్రాధాన్యంగలది.

ఈ మస్జిద్ ను మహమ్మద్ ప్రవక్తగారు తమ అనుయాయులతో కలసి నిర్మించారు. తరువాతి కాలంలో ఇస్లామీయ సామ్రాజ్యపాలకులు విశాలీకరించారు. ఈమస్జిద్ యొక్క విశేషత దీని సబ్జ్ గుంబద్ పచ్చని గుంబద్. ఇది మస్జిద్ కు మధ్యలో ఉంది. దీనిని (గుంబద్ ను) 1817 లోనిర్మించారు, పచ్చనిరంగుపూత 1839లోనూ పూసారు. దీనిని 'గుంబద్-ఎ-ఖజ్రా' అని 'ప్రవక్తగారి గుంబద్' అనికూడా అంటారు.[1] ప్రారంభ ముస్లింల నాయకులైన అబూబక్ర్ ఉమర్ ల సమాధులు కూడా ఈ మస్జిద్ లోనే ఉన్నాయి.

నిజానికి ఇది మహమ్మదు ప్రవక్త గారి ఇల్లు; మక్కా నుండి మదీనా వలస (హిజ్రత్) వచ్చిన తరువాత ఇక్కడే స్థిరపడ్డారు. ఇదే ప్రదేశంలో మస్జిద్ నిర్మింపబడింది. ఈ మస్జిద్ ప్రథమంగా గాలిబయట మస్జిద్. దీని మూలనిర్మాణ నమూనానే ప్రపంచంలోని మస్జిద్ లలో ఉపయోగించబడింది.

ఈ మస్జిద్ ఒక సామాజిక కేంద్రంగా, న్యాయస్థానంగా, ధార్మిక పాఠశాలగా ఉపయోగపడేది. ఓ చిన్న ఎత్తైన ప్రదేశము ఖురాన్ ఉపదేశకులకు ఉండేది.

చరిత్ర

[మార్చు]

622 లో మక్కా నుండి మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్ళిన తరువాత తన నివాసస్థలం ప్రక్కనే, అసలు మస్జిద్ ను మహమ్మదు ప్రవక్త నిర్మించారు. మదీనా నగరంలో ఈ మస్జిద్ ప్రథమమైనది. ఈ మస్జిద్ ఓ విశాలమైన పైకప్పులేని నిర్మాణము, దీనిలో ఒక ఎత్తైన అరుగు (ప్లాట్ ఫార్మ్) వుండినది. మస్జిద్ కు వచ్చిన సమూహాలకు ఖురాన్ పఠించి వినిపించడానికి ఉపయోగించేవారు. ఈ మస్జిద్ దీర్ఘచతురస్రాకార నిర్మాణం, పొడవూ వెడల్పులు 30x35 మీటర్లు, ఖర్జూరపు చెట్ల కాండములను మట్టిని ఉపయోగించి దీని గోడలు నిర్మించారు. దీనికి 3 ద్వారాలుండేవి; దక్షిణాన "బాబ్ రహ్మా", పశ్చిమాన "బాబ్ జిబ్రయీల్", తూర్పున "బాబ్ అల్-నిసా". దీని నిర్మాణ ప్రాథమిక సూత్రాలను ప్రపంచంలో నిర్మించిన మస్జిద్ లకు ఉపయోగించారు.

లోపల దక్షిణభాగాన పైకప్పుకలిగిన ప్రదేశం "సుఫ్రాహ్"ను ప్రార్థనల కొరకు ఉపయోగించారు. ఖిబ్లాగా మదీనాకు ఉత్తరదిశన గల జెరూసలెం లోనుండు బైతుల్-ముఖద్దస్ను సూత్రీకరించారు. ఈ మస్జిద్ ను సామాజిక కేంద్రంగాను, న్యాయస్థానం గాను, ధార్మిక పాఠశాలగాను ఉపయోగించేవారు. ఏడు సంవత్సరాల తరువాత (629 సా.శ./ 7 హి.శ.), ఈ మస్జిద్ దిగ్విణీకృతమయింది, కారణం ముస్లిం సమూహం పెరగడమే.

1839 సం.లో ఈ మస్జిద్ యొక్క గుంబద్ లేక గుంబజ్ ను పచ్చని రంగుతో పూతపూశారు. ఈ గుంబద్ నే ప్రేమాభక్తితో సబ్జ్ గుంబద్ అని గుంబద్-ఎ-ఖజ్రా అని వ్యవహరిస్తారు. ఈ మస్జిద్ లోనే మహమ్మద్ ప్రవక్త ఖననమై యున్నారు. వీరి సమాధి ప్రక్కనే మొదటి, రెండవ ఖలీఫాలైన అబూబక్ర్, ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ ల సమాధులూ యున్నవి.

తరువాత వివిధ ఖలీఫాల కాలాలలో దీనిని విస్తరించారు. 707 లో ఉమయ్యద్ ఖలీఫా యైన అల్-వలీద్ ఇబ్న్ అబ్దుల్ మాలిక్ (705-715) పాత నిర్మాణాన్ని తొలగించి విశాలీకరించి క్రొత్త నిర్మాణాన్ని నిర్మించాడు. ఈ నిర్మాణంలో మహమ్మదు ప్రవక్త ఇంటినీ, సమాధినీ కలిపివేశారు. క్రొత్త మస్జిద్ 84 x 100 మీటర్లు అయినది. పునాదులను రాళ్ళతోను, పైకప్పును కలపతోను, రాతి స్తంభాలతోనూ నిర్మించారు. మస్జిద్ గోడలు 'మొజాయిక్' తో నిర్మించారు. పనివారిని గ్రీకు నుండి రప్పించారు. ఈ నిర్మాణం చేపట్టిన ఖలీఫాయే డమాస్కస్ లోని ఉమయ్యద్ మస్జిద్ ను, బైతుల్-ముఖద్దస్ లోని డూమ్ ను కూడా నిర్మించాడు. ప్రాంగణం నలువైపులా గ్యాలరీ నిర్మాణమ్, నాలుగు మూలల్లో నాలుగు మీనార్లు, ఖిబ్లా దిక్కుగల గోడ యందు పైకప్పులో చిన్న డూమ్ గల ఒక మిహ్రాబ్ దీని ప్రత్యేకతలు.

అబ్బాసీ ఖలీఫా అయిన అల్-మహది (775-785) 778 నుండి 781 వరకు ఈ మస్జిద్ పాత నిర్మాణాన్ని తొలగించి క్రొత్తది నిర్మించాడు. తూర్పు, పశ్చిమ గోడలకు 8 చొప్పున, ఉత్తరదిక్కు గోడకు 4 ద్వారాలు మొత్తం 20 ద్వారాలు నిర్మించాడు. (దక్షిణ దిక్కున గల గోడవైపు ఖిబ్లా గలదు)

మమ్లూక్ సుల్తాన్ ఖలావూన్ కాలంలో ప్రవక్తగారి ఇంటి, సమాధి పైభాగాన ఒక డూమ్ ను నిర్మించాడు, బాబ్ అల్-సలామ్ బయట వజూ కొరకు ఒక నీటి కొలను నిర్మించాడు. సుల్తాన్ అల్-నాసిర్ ముహమ్మద్ మీనార్లను పునరుద్దీకరణ్ చేశాడు. 1481 లో పిడుగుపాటుకు గురై దెబ్బతిన్న మస్జిద్ భాగాన్ని సుల్తాన్ ఖైత్ బే, తూర్పు, పశ్చిమ, ఖిబ్లా గోడలను పునర్నిర్మించాడు.

ఉస్మానియా సామ్రాజ్యపు సుల్తానులు 1517 నుండి రెండవ ప్రపంచ యుద్ధం వరకూ మదీనాను తమ ఆధీనంలో ఉంచారు. సులేమాన్ చక్రవర్తి (1520-1566) పశ్చిమ, తూర్పు దిశల గోడలను ఈశాన్య దిశలో గల మీనార్ ను (ఈ మీనార్ ని "సులేమానియా" అని అంటారు) పునర్నిర్మించాడు. మహమ్మద్ మిహ్రాబ్ (అల్-షాఫియ్య) కు ప్రక్కనే ఇంకో మిహ్రాబ్ (అల్-హనఫ్) ను నిర్మించాడు. ప్రవక్తగారి ఇల్లు, సమాధి పై కొత్త డూమ్ ను నిర్మించి దానిపై సీసపు రేకులను బిగించి దానిపై పచ్చని రంగును పూయించాడు.

ఉస్మానియా సుల్తాన్ "అబ్దుల్ మజీద్" (1839-1861) కాలంలో, పునర్నిర్మించారు. మహమ్మదు ప్రవక్త గారి 'గుంబద్' (డూమ్) పై ఖసీదా అల్-బుర్దా రచించారు. ఈ ఖసీదాను 13వ శతాబ్దానికి చెందిన అరబ్బీ కవి "బుసిరి" రచించాడు. ఖిబ్లా గోడ పై ఇస్లామీయ లిపీ కళాకృతులు అందంగా నగిషీలతో అలంకరించారు. 1932లో సౌదీ అరేబియా ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఈ మస్జిద్ ను భారీగా పునరుద్దరణ చేశారు. 1951లో 'ఇబ్న్ సాద్ రాజు' మస్జిద్ చుట్టుప్రక్కల వుండే కట్టడాలను తొలగించి మస్జిద్ ను విస్తరించాడు.

హజ్ కోసం ఈ పవిత్ర స్థలాలను సందర్శించే యాత్రికుల కోసం మసీదు అల్-హరామ్, మసీదు అన్-నబావి చుట్టూ ముప్పైకి పైగా భవనాలను హైదరాబాద్ నిజాం ఐదవఅఫ్జల్ ఉద్దౌలా నిర్మించారు.[2][3]

1973 లో సౌదీరాజు "ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్" ఈ మస్జిద్ ను ఐదురెట్లు విస్తరణ చేపట్టారు. ఫహద్ రాజు కాలంలో కూడా విస్తరింపజేసి, ఏర్ కండీషన్డ్ చేయించాడు.[4]

విశదీకరణ

[మార్చు]
ఉమర్ సమాధి.

ఈ దినం కానవచ్చు మస్జిద్, ప్రవక్తకాలంలో ఉన్న మస్జిద్ కంటే వైశాల్యంలో 100రెట్లు పెద్దది,, 5లక్షల భక్తులకు నమాజ్ చదివే సౌకర్యం గలదు.

ఈ మస్జిద్ ప్రాంగణంలో గొడుగులు అమర్చబడివున్నాయి. ఎండలోనూ, వర్షంలోనూ వీటిని విచ్చుకొనేలా అమర్చారు.[1][5]

ఈ మస్జిద్ యొక్క ప్రముఖమైన విశేషము దీని గుంబద్ (డూమ్). ఆకుపచ్చ రంగు గలది. దీనినే గుంబద్-ఎ-ఖజ్రా లేదా సబ్జ్ గుంబద్ అని అంటారు. an adjacent area as well.

అర్-రౌజా అన్-నబవియ

[మార్చు]

మస్జిద్ హృదయభాగంలో ఒక చిన్న ప్రదేశం పేరు "అల్-రౌజా అన్-నబవియ" (అరబ్బీ : الروضة النبوية), ఈ రౌజా మహమ్మదు ప్రవక్త నివాసం నుండి సమాధి వరకు గలదు. తీర్థయాత్రికులందరూ దీనిని సందర్శిస్తారు. ఈ ప్రదేశంలో నిలబడి అల్లాహ్ ను మహమ్మదు ప్రవక్త ద్వారా ప్రార్థిస్తే, ఏ ప్రార్థనా అసంపూర్ణం గాదని నమ్మకం.

సౌదీ చే మస్జిద్ విశాలం చేయుట

[మార్చు]
సూర్యాస్తమంలో మస్జిద్-ఎ-నబవి

ప్రథమంగా ఈ మస్జిద్ అంత పెద్దది గాదు. రాను రాను దీని వైశాల్యాన్ని పెంచుతూ పునర్నిర్మిస్తూ వచ్చారు. 1925 లో ఇబ్న్ సాద్ మదీనాను కైవసం చేసుకొన్న తరువాత, దీనిని అంచెలంచెలుగా విశాలం చేస్తూ పోయారు. 1955లో భారీ రూపంలో విశాలంచేశారు.[1] కొంగ్రొత్త పునర్నిర్మాణాలు 'ఫహద్ రాజు' కాలంలో జరిగాయి. ఎక్కువమంది నమాజు చేయుటకు అవకాశం కల్పించే ఉద్దేశంతో సువిశాలంజేశారు. ఏర్ కండీషన్ జేయించి, పాలరాతితో అలంకారాలూ చేశారు.

ఇమామ్ లు

[మార్చు]

మస్జిద్-ఎ-నబవి యొక్క ప్రస్తుత ఇమామ్ లు సామూహిక ప్రార్థనలు నిర్వహించుటకు నియమింపబడుతారు.

ముఅజ్జిన్ లు

[మార్చు]

ముఅజ్జిన్లు ప్రార్థనల కొరకు అజాన్ ఇవ్వడానికి నియుక్తులయినవారు.

ఇవీ చూడండి

[మార్చు]

నోట్స్

[మార్చు]
  1. 1.0 1.1 "Encyclopedia of the orient". Archived from the original on 2008-02-24. Retrieved 2008-02-22.
  2. Najeeb Shahzore, Mohammed (7 January 2021). "Nizam's legacy of Rubaaths still thrives in Makkah". The Siasat Daily.
  3. "Home-RNH". Rubath Nizam Hyderabad Deccan (in బ్రిటిష్ ఇంగ్లీష్).
  4. The Prophet's Mosque (Masjid al-Nabawi) - Medina, Saudi Arabia
  5. Walker, Derek (1998). The Confidence to Build. p 69: Taylor & Francis. p. 176. ISBN 0419240608.{{cite book}}: CS1 maint: location (link)

బయటి లింకులు

[మార్చు]

24°28′06″N 39°36′39″E / 24.46833°N 39.61083°E / 24.46833; 39.61083