మోమిన్
స్వరూపం
మూమిన్ (అరబ్బీ: مؤمن ) లేదా మోమిన్ ఒక అరబ్బీ పదం. దీనికి మూలం ఈమాన్. ఇస్లామీయ ధార్మికగ్రంథం ఖురాన్లో పలుమార్లు ఉపయోగించబడింది. దీనర్థం ఆస్తికుడు, విశ్వాసి, ముస్లింలను దృష్టిలో వుంచుకొని ప్రయోగించబడింది. విశ్వాసి అనగా తనను సంపూర్ణంగా అల్లాహ్ను అప్పగించువాడు. అల్లాహ్ యందు హృదయాంతరాళాలనుండి విశ్వాసభావనలు గల్గి అల్లాహ్ ఆజ్ఞలను పాటిస్తూ జీవించేవాడు.
ఖురాన్లో ఈవిధంగా వర్ణింపబడింది.
- (ఖురాన్ 49:14) ఎడారిప్రాంతానికిచెందిన అరబ్బులారా ప్రకటించండి, "మేము విశ్వసిస్తున్నాము అనిగాదు మేము ఇస్లాంనుస్వీకరించామని: "మీహృదయాలలో విశ్వాసము ఇంకా ప్రవేశించలేదు. మీరు గనక అల్లాహ్ , అతని ప్రవక్తను గౌరవించి (విశ్వాసముతో అనుసరిస్తారో) అల్లాహ్ వారి (సత్)కార్యఫలాలలో లేమిగల్గించడు, నిశ్చయంగా అల్లాహ్ అమితదయాళువు , కరుణాశీలుడూను.