షరియా
స్వరూపం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
వ్యాసాల క్రమం |
ఇస్లామీయ చట్టం (ఫిఖహ్) |
---|
ఇస్లామీయ విద్య |
షరియా (అరబ్బీ పదం) : షరీయత్, షరీఅత్, షరా, షరాహ్ అని కూడా పలుకుతారు. దీనినే షరియయే ముహమ్మదీ అనీ అంటుంటారు.
షరియా అనునది ఇస్లామీయ ధార్మిక న్యాయశాస్త్రం. షరియా అంటే మార్గము, నీటి ప్రవాహ మార్గమని కూడా అర్థాలు ఉన్నాయి. 'షరియా' న్యాయపరమైన హద్దులుగల మార్గం, సామాజిక, వ్యక్తిగత జీవితాలకు దిశానిర్దేశాలను చూపేది.
షరియా, ముస్లిముల దైనందిన జీవితంతో ముడిపడి ఉండే రాజకీయ, ఆర్థిక, బ్యాంకింగ్, వ్యాపార, కాంట్రాక్ట్, కుటుంబ, స్త్రీ పురుష, పరిశుద్ధతా, సామాజిక రంగాలను నిర్దేశిస్తుంది. ముస్లింలకు షరియా జీవనమార్గము. ముస్లింలలోని అన్ని పాఠశాలలూ, తెగలూ వీటిని పాటిస్తాయి. షరీయత్ మార్గంలో నడచుకోవడమంటే, ఇస్లాం మార్గంలో లేదా అల్లాహ్ మార్గంలో నడుచుకోవడమని భావింపబడుతుంది.
షరియా న్యాయశాస్త్రాల ప్రాథమిక వనరులు:
- ఖురాన్ (ఇస్లామీయ ధార్మిక గ్రంథం)
- సున్నహ్ లేదా సున్నత్ (హదీసులు, (మహమ్మదు ప్రవక్త ప్రవచనాలు, కార్యాచరణాలు) )
- ఇజ్మా (ఇస్లామీయ ధార్మిక పండిత సమూహ నిర్ణయాలు),
- ఖియాస్ (ధార్మిక సూత్రీకరణ) ల ఆధారంగా నిర్మింపబడ్డ న్యాయశాస్త్రం.
ఇవీ చూడండి
[మార్చు]