సూఫీ తత్వము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాసముల క్రమము
Allah1.png
ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు మరియు చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర మరియు ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి మరియు సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం మరియు ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం


సూఫీ తత్వము (ఆంగ్లం : Sufism ( అరబ్బీ : تصوّف - తసవ్వుఫ్, పర్షియన్ భాష :صوفی‌گری సూఫీగరి, టర్కిష్ భాష : తసవ్వుఫ్, ఉర్దూ భాష : تصوف ) : ఇస్లాం మతములో ఒక ఆధ్యాత్మిక ఆచారం ఈ సూఫీ తత్వం. ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందడం ధ్యేయం.[1] ఇస్లామీయ ధర్మశాస్త్రాల ప్రకారం షరియా మరియు ఫిఖహ్లు ఇస్లామీయ ప్రధాన మార్గాలైతే, సాధారణ ముస్లిం సమూహాల ప్రకారం సూఫీ తత్వము ఒక ఉపమార్గము. ఈ సూఫీ తత్వము, దిశ, దశ, దార్శనికత మరియు మార్గ దర్శకత్వము లేని కారణంగా 'గాలివాట మార్గం' గా ముస్లింలు అభివర్ణిస్తారు. మరియు దీనిని ఉలేమాలు, బిద్ అత్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ మార్గం, మార్గ దర్శకత్వం లేనికారణంగా, అంధమార్గంగానూ, అంధవిశ్వాసాల మయంగానూ, గమ్యంలేని, స్థిరత్వంలేని మార్గంగానూ అభివర్ణించబడుతుంది. ఇవి అక్షర సత్యాలే, కాని, ఈ తత్వంలోని విశ్వసోదర ప్రేమ మాత్రం శ్లాఘింపదగినది. ఈ సూఫీ తరీఖాలు సున్నీ ఇస్లాం గాని షియా ఇస్లాం గాని కలిగివున్నవే. భారతదేశంలోకి ఎందరో సూఫీ సన్యాసుల ప్రవేశం పదమూడో శతాబ్దం నుంచి మొదలైంది. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి సూఫీ వాదాన్ని ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఎన్నో సూఫీ శాఖలు (సిల్‌సిలాలు) భారతదేశంలో ప్రవేశించాయి. సాంస్కృతిక సమైక్యతకు సూఫీలు దోహద పడ్డారు.[2]

గంధం బసవ శంకరరావు గారు చెప్పిన మాటలు[మార్చు]

 • 'సూఫీ' అంటే 'కంబళి బట్ట' అని అర్థం.సూఫీ తత్వవేత్తలు భౌతిక సౌఖ్యాలకు లోనుకాక, నిరాడంబరమైన కంబళి బట్టలు ధరించడం వల్ల ఈ మతానికి 'సూఫీ' అని పేరొచ్చింది.'సూఫీ' అంటే- పవిత్రతకు, (భౌతికబంధాల నుంచి) స్వేచ్ఛకు సంకేతం! సూఫీ యోగి అంతర్దృష్టితో ధ్యానతత్పరుడై, సత్యాన్వేషకుడై ఉంటాడు.ధ్యాన దైవిక ప్రేమ భావనతోపరమాత్మలో లీనం కావడమే సూఫీ సిద్ధాంతం.ఆడంబరాలకూ దూరంగా పవిత్రంగా యోగులుగా, సన్యాసులుగా, స్వాములుగా జీవితాన్ని గడిపే వ్యక్తులు 'సూఫీలు.
 • పరమాత్ముడైన శ్రీకృష్ణుని పతిగా తలచి, జీవాత్మలైన గోపికలు అతడిని విడిచి మనలేక, మధురభక్తితో తమ మాన ప్రాణాలు అర్పించి కృష్ణుడి సాన్నిధ్యాన్ని పొందుతారు.భగవంతుడు పరమాత్మ కాగా, భక్తుడు (జీవి ) జీవాత్మ . ఈ రెండింటి అనుసంధానం జరిగేది భక్తితో. అదీ మధురమైన భావనతో. 'సూఫీ'లో నిగూఢమై ఉన్న సత్యమిదే! దీనిని సూఫీ యోగులు 'ఇష్క్‌ హక్కికీ' అంటారు.భారతీయ భక్తి సంప్రదాయంలో జయదేవుడు, మీరాబాయి, అన్నమాచార్య, తులసీదాసు, చైతన్య మహాప్రభు, క్షేత్రయ్య ఈ కోవకు చెందినవారే!
 • ఇస్లాం నుంచి ఆవిర్భవించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సూఫీ తత్వం కేవలం ఒక మతం కాదు. అది మత పరిధులను దాటి విశ్వచైతన్యాన్ని, భగవత్తత్వాన్ని నింపుకొన్న విశాల మధురభక్తి సిద్ధాంతం.భారతీయ సూఫీ యోగుల్లో ఖ్వాజా మొయినుద్దీన్‌ చిష్తీ, షా హుస్సేన్ ‌, సయ్యద్‌ అలీ హైదర్ ‌, ఫర్ద్‌ ఫకీర్ ‌, ఖలందర్‌ హజ్రత్‌ సాయి ఖుతబ్‌ అలీ షా, హజ్రత్‌ సాయి రోషన్‌ అలీ షా, హదీబక్ష్‌లు ప్రముఖులు.
 • సూఫీ యోగులందరూ భగవంతునిపై ఆధారపడి జీవనం సాగించారు. నవాబులు, ప్రభువులు అందించిన కానుకలను సున్నితంగా తిరస్కరించారు. ఆర్భాటాలకు తావివ్వకుండా, అహంకార రహితులై, నామసంకీర్తనం చేస్తూ భక్తులకు సందేశాలు అందిస్తూ, సత్యాన్వేషణలో ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారు. సూఫీ వేదాంత సోపానాల్లో ఈ దశను 'ఫనా-ఫి-అల్లాహ్‌' అంటారు.తురీయావస్థ, సమాధి స్థితులను అంగీకరించిన సూఫీ యోగులు నిశ్చల భక్తి భావంతో, భగవత్‌ ప్రణయ సౌందర్యంలో తన్మయీభూతులై తమ జీవాత్మలను పరమాత్ముడైన అల్లాహ్లో ఐక్యం చేసుకున్నారు.[3]

సూఫీ తరీఖా[మార్చు]

మౌలానా రూమి సమాధి, కోన్యా, టర్కీ
చైనా, కాష్గర్ లోని ఖోజా ఆఫాఖ్ సమాధి.

సూఫీ తరీఖాలు నాలుగు.

కొన్ని విశేషాలు[మార్చు]

 • డబ్బు ముట్టుకోరాదు. పేదరికమే సుగుణం.
 • బ్రహ్మచర్యం తప్పనిసరి కాదు.ఆధ్యాత్మిక పురోగతికి, కుటుంబ జీవితం ఆటంకం కాదు.ప్రపంచాన్ని త్యజించి క్రియారాహిత్యంతో జీవించవద్దు. భౌతిక శ్రమతో జీవనోపాధి కల్పించుకుంటూనే భగవంతుడిని అన్వేషించాలి. రైతులుగా, నేతపని వారుగా, కసాయి పనివారుగానైనా సరే శ్రమించాలి.
 • భగవంతుని పట్ల ప్రేమ, భక్తి ప్రపత్తులే మోక్షాన్ని ప్రసాదిస్తాయి.జీవాత్మ పరమాత్మతో సమైక్యమవ్వాలి. (వహదతుల్ వజూద్ ).
 • భగవంతునికి, మానవులకు మధ్య ప్రేమికుల సంబంధం కాకుండా యజమాని - బానిసల సంబంధం ఉండాలి. (వహదతుల్ షుద్ ) -- నక్షబందీ శాఖకు చెందిన షేక్ అహ్మద్ సర్హిందీ
 • మక్కా, గంగ మోక్షాన్ని ఇవ్వలేవు.అహాన్ని పరిత్యజించడమే మోక్ష మార్గము.-- బుల్లేషా .
 • శ్రీరాజ్ అనే హిందువును ముహమ్మద్ బిన్ తుగ్లక్ వజీరుగా నియమించాడు. మొఘలులు రాజపుత్రులను, మరాఠీలను ఉన్నత పదవుల్లో నియమించారు.
 • కాశ్మీర్‌ను పాలించిన ‘జైనులాబిదిన్ ’ హిందూ మతాన్ని ఆదరించాడు.
 • అక్బర్ అన్ని మతాలు సమానమే అన్నాడు.
 • హారతిని నిసర్ గా. దిష్టిని నజర్గా ముస్లింలు స్వీకరించారు. హిందువులను చూసి అత్యధిక ముస్లింలు బహుభార్యత్వాన్ని త్యజించి ఏకపత్నీవ్రతం అవలంబించారు.
 • జీవాత్మ, పరమాత్మ ఐక్యమవ్వాలనే అద్వైత భావనను సూఫీలు స్వీకరించారు. బెంగాల్‌లోని సూఫీ ముస్లింలు, సీతా, కాళీ వంటి హిందూ దేవతలను ఆరాధించారు.
 • సంస్కృతంలోని వైద్య రచనలను ‘తిబ్ - ఎ - సికిందరి’ పేరుతో పర్షియన్‌లోకి అనువదించారు.
 • ముస్లింల నుంచి రసాయన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ‘జిచ్’ అనే క్యాలెండర్‌కు సంబంధించిన అంశాలను, ‘తాజిక్’ అని పిలిచే జ్యోతిష్య శాస్త్ర విభాగాన్ని హిందువులు స్వీకరించారు.
 • బదౌని రామాయణాన్ని పర్షియన్‌లోకి అనువదించగా, ముస్లిం పండితులు మహాభారతాన్ని ‘రమ్జానామా’ పేరుతో పర్షియన్‌లోకి అనువదించారు.
 • అమీర్ ఖుస్రో భారతదేశాన్ని తన మాతృభూమిగా భావిస్తూ హిందీ భాషాభివృద్ధికి కృషి చేశాడు. కవిత్వంలో భారతీయ శైలి (సబక్ -ఇ - హింద్) ని ప్రోత్సహించాడు.పర్షియన్ సంగీత సంప్రదాయాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతం అభివృద్ధి చెందింది. అమీర్ ఖుస్రో, జైపూర్ పాలకుడు హుసేన్ షా షర్కీ వంటి వారు ఎన్నో కొత్త రాగాలను సృష్టించారు.
 • ముస్లింలు భారతీయ వాస్తు కళలకు కమాన్, గుమ్మటం, మీనార్ (స్తంభాలు) లను జోడించారు. రంగురాళ్లను వినియోగించారు. ఉద్యాన కళను అభివృద్ధి చేశారు. బృందావనంలోని ఆలయాల్లో మొగల్ శైలి కనిపిస్తుంది. అక్బర్ నిర్మించిన ఫతేపూర్ సిక్రీలో హిందూ-ఇస్లామిక్ శైలి కనిపిస్తుంది.
 • ని ర్గుణ వాదుల్లో రామానందుడి శిష్యుల్లో కబీర్ ప్రసిద్ధుడు. ఆయన భగవంతుడిని రామ్, రహీమ్, అల్లా అన్నాడు..
 • కాశ్మీరులోలల్లా అనే శైవయోగిని ‘ఋషి’ ఉద్యమాన్ని నడిపారు. హిందువులు సూఫీ మహనీయుల సమాధులను దర్శించి నేటికీ ఆరాధిస్తున్నారు.
 • సూఫీలు అద్వైత భావనతో యోగ సాధన చేశారు. ‘అమృతకుండ’ అనే హర్షయోగ గ్రంథాన్ని పర్షియన్‌లోకి అనువదించుకున్నారు.నిజాముద్దీన్ ఔలియా యోగ సాధన చేసి సిద్ధుడు అయ్యాడు.
మనసులో అల్లాహ్ పేరు ముద్రించి వుంటుందనే విషయాన్ని సూచించే చిత్రం. ఖాదిరి అల్-మున్‌తహీ తరీఖాకు చెందిన విశ్వాసం.

సూఫీ కవిత్వం[మార్చు]

 • తనకటుగాని, ఇటుగాని సైతానుకి ఎవరన్నా పరిశుద్ధంగా కనిపిస్తే ఓర్వలేక జ్వరంతో మంచమెక్కుతాడు దుష్టుడైనా సరే తనగడ్డి వామి తగలబడితే, ఇంకవాడు ఎవడింట్లోనూ దీపం వెలిగేటందుకిష్టపడడు -- దీవి సుబ్బారావు
 • నీలో ఉన్న ప్రతి భాగానికి ఒక రహస్య భాష వుంది. నీ చేతులు, కాళ్లు నువ్వేం చేశావో చెబుతాయి.-- మౌలానా రూమీ
 • దిగుడుబావి నుండి ఏతంతో నీళ్లను పైకి తోడినట్లు పరుపుతో నీ కళ్లను నీటితో ఉబికిపోనీ నీ హృదయపు మాగాణి పొలంలో పచ్చటి చివురులు మొలకెత్తనీ కన్నీరు కావలిస్తే కన్నీరు కార్చేవాళ్లతో దయగా వుండు దయ కావాలిస్తే నిస్సహాయుల పట్ల దయ చూపు -- మౌలానా రూమీ
 • అల్లాను ప్రేమిస్తున్నావా?' అంటే ఔను అహర్నిశలూ మరి సైతాన్ని ద్వేషిస్తున్నావా? లేదు, అందుకు సమయం ఎక్కడిది?-- రబియా
 • పంచవన్నెల పింఛమే నెమలికి శత్రువు/ చాలా మంది రాజులు తలలు పోగోట్టుకోటానికి కారణం/ వారు తాల్చిన రత్నఖచిత కిరీటాలు -- హాఫిజ్ షీరాజీ.
 • సూఫీయోగి ఈ క్షణానికి చెందిన వారు. 'రేపు' అనటం సుతరామూ గిట్టదు.... ఫరీదుద్దీన్ అత్తార్.

సూఫీ తత్వ ఆచరణా విధానాలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

సూఫీల జాబితా[మార్చు]

హజ్రత్ షంస్ తబ్రేజ్

మూలాలు[మార్చు]

 1. Trimingham (1998), p.1
 2. See:
  • Esposito (2003), p.302
  • Malik (2006), p.3
  • B. S. Turner (1998), p.145
  • "Afghanistan: A Country Study". Country Studies. U. S. Library of Congress (Federal Research Division). p. 150. Retrieved 2007-04-18. 
 3. http://www.eenadu.net/antaryami/antarmain.asp?qry=310508anta

బయటి లింకులు[మార్చు]