నస్రుద్దీన్
ముల్లా నస్రుద్దీన్, Nasreddin (పర్షియన్ ملا نصرالدین, అరబ్బీ: جحا తర్జుమా: జొహా, نصرالدين అర్థం "విశ్వాస విజయం", టర్కిష్ నస్రెద్దీన్ హోకా, ఒక సూఫీ, హాస్యభరితమైన విద్వాంసుడు. ఇతడు మధ్య యుగంలో 13వ శతాబ్దంలో అక్సెహీర్, కోన్యా లలో సెల్జుక్ ల కాలంలో జీవించాడు.[1] కానీ దగ్గరి తూర్పు దేశాలు, మధ్యప్రాచ్యము,, మధ్య ఆసియా దేశాలు, ఉజ్బెగ్లు ముల్లా నస్రుద్దీన్ తమ వాడేనంటూ చెప్పుకొంటారు.[1][2][3][3][1][4][5][6]).
నస్రుద్దీన్ ప్రఖ్యాతి
[మార్చు]ఇతనికి అనేక బిరుదులు ఉన్నాయి - "హోద్జా", ముల్లాహ్ లేదా ఎఫెందీ వంటివి. ఇతడు ప్రసిద్ధి చెందిన విద్వాంసుడు, సూఫీ, కవి, పండితుడు. ఉయిఘుర్ టర్కీ ప్రజలలో జానపద హీరో. చైనాలో కూడా ఆఫందీ లేదా ఎఫెంటీ అనే పేరుతో ప్రసిద్ధి.[7][8][9]
నస్రుద్దీన్ పనులను చూసి ఎవరైనా ఇతనికి పిచ్చివాని క్రింద జమకట్టేవారు. కాని ఇతని చేష్టల హేతువులను చూసి పండితులు సైతం ముక్కు మీద వేలేసుకొనేవారు. ఇతను తను చేసే ప్రతి పనినీ లేదా సంభాషణనూ హేతువుతోనూ తర్కంతోనూ చేసేవాడు. సాదా సీదా జీవనం గడిపిననూ వేదాంతిగా, హాస్యరసజ్ఞుడిగా, ఛలోక్తులు విసిరేవాడిగా, విమర్శకులను సైతం మాటలుడిగేలా చేసేవాడు.
నస్రుద్దీన్ పుట్టుక , చరిత్ర
[మార్చు]ముల్లా నస్రుద్దీన్ అనటోలియాలో జీవించాడు; 13వ శతాబ్దంలో 'సివ్రీహిసార్' లోని 'హోర్తూ' గ్రామంలో జన్మించాడు. తరువాత, అక్సెహీర్ లో స్థిరనివాసమేర్పరచుకొన్నాడు, తరువాత 'కోన్యా' కు తన నివాసాన్ని మార్చి అక్కడే మరణించాడు.[4][6]
"అంతర్జాతీయ నస్రుద్దీన్ హోద్జా ఉత్సవాలు" అక్సెహీర్లో ప్రతి సంవత్సరము జూలై 5-10 వరకూ జరుగుతాయి.[10] ఆధునిక కాలంలో ఇతని గురించి అనేక కథలూ, వివిధ తరగతులలో పాఠ్యాంశాలలోనూ చూడవచ్చును.[11] తెలుగులోనూ అనేక కథలు చూడవచ్చును. ఇతని పాత్ర చిత్రణ వివిధ భాషలలో, ఉదాహరణకు, అల్బేనియన్, అరబ్బీ, అజేరీ, బెంగాలీ, బోస్నియన్, హిందీ, పష్తో, పర్షియన్, సెర్బియన్, టర్కిష్, ఉర్దూ భాషల జానపదాలలోనూ, కథలలోనూ, హాస్య సాహిత్యాలలోనూ చూడవచ్చును. గ్రీసు లోనూ బల్గేరియా లోనూ ఇతడు ప్రసిద్దే.
నస్రుద్దీన్ కథలు
[మార్చు]సూఫీ తత్వము, తరీకా |
---|
పోర్టల్ |
నస్రుద్దీన్ కథలు ప్రపంచ మంతటా ప్రసిద్ధి, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో. నస్రుద్దీన్ కథలు వ్యంగమునకు వ్యంగోక్తులకు, హాస్యమునకు, తర్కము, విజ్ఞానానికి మచ్చు తునకలు.[12] కడుపుబ్బ నవ్వించే ఇతని కథలు, ముల్లా దో పియాజా, బీర్బల్, తెనాలి రామకృష్ణ లను గుర్తుకు తెస్తాయి.
ఇతడి కథలలో సూఫీతత్వము, వేదాంతము కానవస్తుంది. ఈ కథలకు చెందిన అతిప్రాచీన వ్రాత ప్రతి 1571లో కనుగొనబడింది.
ఇతని హాస్యోక్తులకు ఉదాహరణలు
[మార్చు]ఖుత్బా ప్రసంగము
[మార్చు]- ఓసారి నస్రుద్దీన్ ఖుత్బా ప్రసంగానికి ఆహ్వానింప బడ్డాడు. ఖుత్బా ఇవ్వడానికి మింబర్ పై నిల్చుని ఇలా అడిగాడు "నేనేమి చెప్ప దలచుకొన్నానో మీకు తెలుసా?", ప్రేక్షకులు జవాబిచ్చారు "లేదు" అని, అతనన్నాడు "కనీసం నేను ఏమి చెప్పదలచుకొన్నానో తెలియనివారికి నేనేమీ చెప్పదలచుకోలేదు" అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
- ప్రజలు అయోమయంలో పడ్డారు, ఇంకోసారి ఇతడిని ఆహ్వానించారు. ఈసారీ ఇతను అదే ప్రశ్న వేశాడు, ప్రేక్షకులు "అవును" అని జవాబిచ్చారు. నస్రుద్దీన్ ఈ విధంగా అన్నాడు, "మంచిది, నేనేమి చెప్పదలచుకొన్నానో మీకు తెలుసు కాబట్టి, మరలా ప్రసంగించి, నా సమయాన్ని వృధా చేయదలచుకోలేదు" అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
- ప్రజలకు చికాకు వచ్చింది, వీరొకటి నిర్ణయించి, మరలా నస్రుద్దీన్ కు ఆహ్వానించారు. ఈసారీ నస్రుద్దీన్ అదే ప్రశ్న సంధించాడు - "నేనేమి చెప్ప దలచుకొన్నానో మీకు తెలుసా?", ప్రేక్షకులు తమ నిర్ణయానుసారం, సగం మంది "అవును" అని, మిగతా సగం మంది "లేదు" అని జవాబిచ్చారు. నస్రుద్దీన్ ఇలా అన్నాడు "తెలిసిన వారు సగం మంది, తెలియని సగం మందికి చెప్పివెయ్యండి" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు!
నదికి ఇరువైపులు
[మార్చు]- ముల్లా నస్రుద్దీన్ ఓ సారి, ఓ నది ఒడ్డున కూర్చొని వున్నాడు, అవతలి ఒడ్డుపై నిలుచున్న ఓ వ్యక్తి కేకపెట్టాడు;
- - "ఏమండీ! నేను అవతలి ఒడ్డుకు ఎలా రావాలి?"
- - "నీవు ఇవతలి ఒడ్డుకు రావాలంటే, అవతలి ఒడ్డున ఉండాలి!" ముల్లా బిగ్గరగా జవాబిచ్చాడు.
నీవెవరిని నమ్ముతావు
[మార్చు]- ఒక పొరుగువాడు ముల్లా నస్రుద్దీన్ ను కలవడానికొచ్చాడు, ముల్లా బయటికొచ్చి అతడితో మాట్లాడాడు.
- పొరుగు వాడు ముల్లాతో "అన్యధా భావింపక" "ఈరోజు ప్రక్క వూరికి సరుకులు తీసుకెళ్ళాలి, మీ గాడిదను ఇస్తారా?"
- పొరుగువానికి తన గాడిదను ఇవ్వడం ఇష్టంలేక, సౌమ్యంగా:
- "క్షమించండి, ఇప్పటికే నా గాడిదను ఇతరులకిచ్చాను" అన్నాడు.
- ఇంతలోనే గాడిద గోడ ఆవలి నుండి గట్టిగా ఓండ్రపెట్టింది.
- "మీరు నాతో అబద్ధాలాడారు ముల్లా" "గాడిద గోడకు ఆవలే వుంది!" పొరుగువాడు అన్నాడు.
- "మీ ఉద్దేశ్యం ఏమిటి?" ముల్లా అసహనంగా జవాబిచ్చాడు. "మీరు ఎవరిని నమ్ముతారు, గాడిదనా లేదా ముల్లానా?"
ముల్లా నస్రుద్దీన్ కు చెందిన అనేక కథలు అనేక భాషలలో ఉన్నాయి. ఇవి ప్రపంచ మంతయూ ప్రసిద్ధి చెందినవి. ఇతని గౌరవార్థం, యునెస్కో వారు 1996-1997 వ సంవత్సరాన్ని, "అంతర్జాతీయ నస్రుద్దీన్ సంవత్సరం"గా ప్రకటించారు. యునెస్కో వారి అధికారిక సైట్
సంగ్రహాలు
[మార్చు]- పర్షియాకు చెందిన మహమ్మద్ రమజాని, ముల్లా నస్రుద్దీన్ కు చెందిన 600 కథలను, కథానికలను సంగ్రహించాడు.
- ఇద్రీస్ షా, ముల్లా నస్రుద్దీన్ కథలను ప్రచురించాడు.
- షాహ్ రుఖ్ హుసేన్, 'నస్రుద్దీన్ తెలివి' అనే పుస్తకాన్ని ప్రచురించాడు.
ఇతర పేర్లు
[మార్చు]నస్రుద్దీన్ కు ఇతర అనేక నామాలతోనూ గుర్తిస్తారు. ఉదాహరణకు : 'నస్రుదీన్', 'నస్ర్ ఉద్దీన్', 'నస్రెద్దీన్', 'నసీరుద్దీన్', 'నస్త్రదీన్', 'నస్త్రదిన్', 'నస్రతీన్', 'నుస్రతీన్', , 'నస్తెదిన్'. భారతదేశం లోని సాహిత్యాలలో ఇతనికి ముల్లా నస్రుద్దీన్ లేదా ముల్లా నసీరుద్దీన్ పేరుతో పరిచయం గలదు.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 The outrageous Wisdom of Nasruddin, Mullah Nasruddin, (LINK Archived 2007-05-29 at the Wayback Machine); accessed February 19, 2007.
- ↑ NASRUDDIN MULLA: THE SUFI JESTER, (LINK Archived 2008-02-14 at the Wayback Machine); accessed February 20, 2007.
- ↑ 3.0 3.1 Mulla Nasruddin, (LINK Archived 2007-02-18 at the Wayback Machine); accessed February 20, 2007.
- ↑ 4.0 4.1 "NASRETTİN HOCA". Republic of Turkey Ministry of Culture and Tourism. Archived from the original on 2007-09-29. Retrieved 2006-12-28.
- ↑ "TURKIC HERO - NASREDDIN HOJA". Archived from the original on 2008-05-12. Retrieved 2008-04-16.
- ↑ 6.0 6.1 Fiorentini, Gianpaolo (2004). "Nasreddin, una biografia possibile". Storie di Nasreddin. Torino: Libreria Editrice Psiche. ISBN 88-85142-71-0. Archived from the original on 2004-04-07. Retrieved 2006-12-28.
- ↑ Afanti de gu shi (A collection of the Uighur people's folktales as well as information about their customs and life styles) ISBN 957-691-004-8
- ↑ J.C. Yang, Xenophobes Guide to the Chinese, Oval Books, ISBN 1-902825-22-5
- ↑ "The Effendi And The Pregnant Pot - Uygur Tales from China"; New World Press; Beijing, China
- ↑ "Akşehir's International Nasreddin Hoca Festival and Aviation Festival - Turkish Daily News Jun 27, 2005". Archived from the original on 2007-09-30. Retrieved 2008-04-16.
- ↑ Rodney Ohebsion, A Collection of Wisdom, Immediex Publishing (2004), ISBN 1-932968-19-9.
- ↑ Idris Shah, The Sufis, W.H. Allen (1964) ISBN 0-385-07966-4
బయటి లింకులు
[మార్చు]- Booklist comprising larger collections of Nasreddin stories in various languages
- Nasruddin.org "Nasruddin is an ancient Persian folk character, telling stories in the Sufi tradition of Rumi and Hafiz, as well as wisdom tales from many faiths, ..."
- Afghanistan Online: Mullah Nasruddin Jokes "Funny Works.. A few of the thousands of humurous and thoughtful stories about Mullah Nasruddin" afghan-network.net
- Mullah Nasruddin and his Spiritual Stories "This page contains numerous Mullah Nasruddin Jokes!" afghan-web.com