బ్రహ్మర్షి హుస్సేన్ షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రహ్మర్షి హుస్సేస్ షా
జననం(1905-09-09) 1905 సెప్టెంబరు 9
రాజమండ్రి
మరణం1981 సెప్టెంబరు 24
పిఠాపురం
సమాధిశ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క పూర్వ ఆశ్రమం
17°6′25″N 82°15′16″E / 17.10694°N 82.25444°E / 17.10694; 82.25444
నివాసంఉమర్ ఆలీషా నియలం
జాతీయతభారతీయుడు
చదువుప్రాథమిక విద్య, పిఠాపురం, ఎఫ్.ఎ
ప్రసిద్ధులుతెలుగు కవిత్వం
శీర్షికబ్రహ్మర్షి
ముందువారుకవిశేఖర డా. ఉమర్ అలీషా
తరువాతి వారుమొహిద్దీన్ బాద్‌షా II
జీవిత భాగస్వామిఅజీమునిసా బేగం
తల్లిదండ్రులుకవిశేఖర డా. ఉమర్ అలీషా, అక్బర్ బీబీ
వెబ్ సైటుwww.sriviswaviznanspiritual.org

హుస్సేన్ షా (సెప్టెంబరు 9, 1905 – సెప్టెబరు 24, 1981) పిఠాపురం లోని శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠానికి ఏడవ పీఠాధిపతి. ఆయన తూర్పు గోదావరి జిల్లా లోని పిఠాపురం లో జన్మించాడు. ఆయన తండ్రి కవిశేఖర డా. ఉమర్ అలీషా సద్గురు తరువాత పీఠాధిపతి. ఆయన పిఠాపురంలో ప్రాథమిక విద్యను అభ్యసించి మచిలీపట్నం లోని నేషనల్ కాలేజీలో ఫైనల్ ఆర్ట్స్ పూర్తిచేసాడు. ఆయన తెలుగు, అరబిక్, ఉర్ధూ, పర్షియన్ మరియు సంస్కృత భాషలలో పండితుడు.[1]

షా మరియు ఆయన భార్య అజీమున్నీసా బేగం లకు నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు. ఆయన పీఠాధిపతి కావడానికి పూర్వం వ్యవసాయం చేసేవాడు. జ్ఞానాన్ని సముపార్జించిన తరువాత ఆయన మూలికా ఔషథం "దేవదారు" ను కనుగొన్నాడు.

హుస్సేన్ షా ఫిబ్రవరి 10, 1945 నుండి పీఠం యొక్క తత్వాన్ని ప్రచారం ప్రారంభించాడు. ఆయన అనేక ఆధ్యాత్మిక సందేశాలను అనేక గ్రామలలోనూ మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని పట్టణాలలోనూ ప్రచారంచేసి భక్తి యోగాన్ని మరియు జ్ఞానయోగాన్ని అందించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో మరణించాడు.

ఆయన ప్రముఖ తాత్వికుడు. ఆయన తత్వాన్ని "షా తత్వం" గా అభివర్ణిస్తారు.

గ్రంథములు[మార్చు]

  • షా తత్వం [2]
  • షా తత్వం మొదటి భాగం (షా తత్వానికి ఆంగ్ల అనువాదం)

మూలాలు[మార్చు]