Jump to content

వక్ఫ్

వికీపీడియా నుండి

భారతదేశంలో ఇస్లాం




చరిత్ర

నిర్మాణాలు

మొఘల్ · ఇండో-ఇస్లామిక్

ప్రఖ్యాత వ్యక్తులు

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్
 · అహ్మద్ రజా ఖాన్
 · మౌలానా అబుల్ కలాం ఆజాద్
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  · బహాదుర్ యార్ జంగ్
 · అబ్దుల్ కలాం

కమ్యూనిటీలు

ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు
కొంకణి · మరాఠీ · వోరా పటేల్
మెమన్ లు · ఈశాన్య భారత · కాశ్మీరీs
హైదరాబాదీ · దావూదీ బోహ్రా· ఖోజా
ఒరియా · నవాయత్ · బీరీ  · సెయిట్‌లు
మియో · సున్నీ బోహ్రా
కాయంఖానీ · బెంగాలీ

న్యాయ పాఠశాలలు

హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి

విశ్వాస పాఠశాలలు

బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్

భారత్‌లో మస్జిద్‌లు

భారతదేశంలో చారిత్రక మస్జిద్‌లు

సంస్కృతి

ముస్లింల ఆచారాలు

ఇతర విషయాలు

దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం
కేరళలో ఇస్లాహీ ఉద్యమం
భారత ముస్లింలలో జాతీయతా భావాలు
భారతీయ చరిత్ర కొరకు ముస్లిం క్రానికల్స్

వక్ఫ్ (ఆంగ్లం : Waqf) (అరబ్బీ : وقف ), బహువచనం ఔకాఫ్ (అరబ్బీ اوقاف ), అనగా, ఇస్లాం ప్రకారం మతపరమైన అంకితం లేదా ఎండోమెంటు. సాధారణంగా, భవనాలను, భూములను, ఆస్తులను, మతపరమైన కార్యక్రమాలకు అంకితమిచ్చుటయే వక్ఫ్ చేయడం. ఇది సాధారణ చట్టం, లేదా ట్రస్ట్ చట్టంలా వుంటుంది.

పాఠశాలలు, వైద్యశాలలకొరకు సహాయ సహకారాలు

[మార్చు]

10వ శతాబ్దంలో వక్ఫ్ చట్టం ద్వారా మదరసాలు, వైద్యశాలలు అధికంగా ఏర్పాటు చేయబడ్డాయి. 11వ శతాబ్దం నాటికి ప్రతి ఇస్లామీయ నగరం, పట్టణాలలో వైద్యశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. వైద్యశాలల ఖర్చులు, మందుల ఖర్చులు, వైద్యుల జీతభత్యాలు 'వక్ఫ్' సంస్థల ద్వారా ఇవ్వబడేవి. అంతేగాక మదరసాలయందు, మదరసా నిర్వహణ ఖర్చు, సదుపాయాలు, ఉపాధ్యాయుల జీతభత్యాలు మొదలగునవి, వక్ఫ్ సంస్థలే భరించేవి.[1]

ట్రస్ట్ చట్టంతో పోలిక

[మార్చు]

వక్ఫ్ ఇస్లామీయ చట్టం ప్రకారం, ఇస్లామీయ స్వర్ణయుగం కాలంలో, 7వ, 9వ శతాబ్దాల మధ్య, అభివృద్ధి పరచబడింది. వీటిని చూసే బ్రిటిష్ వారు 'ట్రస్ట్ చట్టా'లను అభివృద్ధి పరచారు.[2] ప్రతి 'వక్ఫ్' కు ఒక వకీఫ్ (స్థాపకుడు), ముత్తవల్లీ (ట్రస్టీ), ఖదీ (న్యాయమూర్తి, జడ్జి), లబ్ధిదారులు ఉంటారు.[3] వక్ఫ్ లేదా ట్రస్ట్ ల యందు, ఆస్తి అంకితం చేయబడివుంటుంది, ఆ ఆస్తిని, దాని ఫలాలను వినియోగించడానికి నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబడియుంటాయి.

వక్ఫ్ భూముల ఆక్రమణ

[మార్చు]

రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు 4,45,511 ఎకరాలు. ఇవి చాలావరకు కబ్జాలు, ప్రభుత్వ అమ్మకాలతో వేలాది ఎకరాలు హరించుకుపోయాయి.వక్ఫ్ ఆస్తులు అల్లా పేరిట పూర్వం చక్రవర్తులు, రాజు లు, నవాబులు దానం యిచ్చిన భూములు. పేద ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కొరకు ఈ భూములపై వచ్చే ఆదాయం వాడాలి. దాతలు యిచ్చిన ఈ భూముల్ని అమ్మే అధికారం వక్ఫ్ బోర్డుకు సైతం లేదు.కానీ కొందరు ముతవల్లీలు సైతం వక్ఫ్ ఆస్తుల అక్రమ వ్యాపారానికి, కబ్జాలకు సహకరిస్తున్నారు.కోట్లాది రూపాయల వక్ఫ్‌ బోర్డు భూములు కబ్జా దారుల కోర ల్లో చిక్కి అన్యాక్రాంతమవుతున్నాయి. కంచె చేను మేసిన చందంగా సంస్థ ఆస్తులకు కాపలా ఉండాల్సిన కొం దరు మసీదుల అధ్యక్షులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, మరికొం తమంది అధికారులు కలిసి ఈ దందాను కొనసాగిస్తూ అక్రమార్కు లను ప్రోత్సహిస్తున్నారు.ప్రతి జిల్లాకు వక్ఫ్‌బోర్డులో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి ఉన్నా స్మశానాల పై సరైన పర్యవేక్షణలేక శవాన్ని ఖననం చేసేందుకు స్థలం లేక, సరైన దారిలేక, ప్రార్థన కోసం మసీదులు లేక పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న అరకొర మసీదుల్లోనే స్మశానాలు ఏర్పాటు చేయడంతో దుర్వాసన వచ్చి రోగాలబారిన పడుతున్నారు.ఈద్గా ఈనాం భూములను ఆక్రమించి పాస్‌పుస్తకాలు కూడా పొందుతున్నారు.ఈ అక్రమాలను అరికట్టి వక్ఫ్ ఆస్తులను సద్వినియోగపరిచేందుకు దేవాదాయశాఖలో మాదిరిగా వక్ఫ్ కమీషనరేట్ ఏర్పాటుచెయ్యాలి.

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు

[మార్చు]

బాధ్యతలు:

  1. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ.
  2. వక్ఫ్ చేయబడిన ఆస్తులు సరియైన విధానంతో నడుస్తున్నాయా లేదా, విధి విధానాలను అనుసరిస్తున్నాయా లేదా, అని పర్యవేక్షిస్తుంది. వక్ఫ్ ప్రతిఫలాలు వాటి హక్కుదారులకు చేరుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తుంది.
  3. తగు రికార్డులను ఉంచుతుంది. వక్ఫ్ మూలాలు, ఆదాయం, ఉద్ద్యేశాలు, హక్కుదారులు మొదలగు వాటి గూర్చి ఈ రికార్డులలో పొందుపరుస్తుంది.
  4. To settle schemes of management for a Wakf.
  5. To direct the utilization of the surplus income of the Wakf
  6. To scrutinize and approve the budgets submitted by Mutawallies and to arrange for the auditing of account of Wakfs.
  7. To appoint and remove Mutawallies in accordance with the provisions of this Act.
  8. To take measures for the recovery of lost properties of any Wakf.
  9. To institute and defend suits and proceedings relating to Wakf.
  10. To sanction any transfer of immovable property of a Wakf by way of sale, gift, mortgage, exchange or lease, in accordance with the provisions of the Act.
  11. To administer the Wakf fund.
  12. To call for such returns, statistics, accounts and other information from the Mutawallies with respect to the Wakf property as the Board may from time to time, require.
  13. To inspect, or cause; inspection of, wakf properties, accounts, records or deeds and documents relating thereto.
  14. To investigate and determine the nature and extent of Wakf and Wakf property, and to cause whenever necessary, a survey of such Wakf property
  • 1955 to 1965 ల మధ్య జరిగిన మొదటి సర్వే ప్రకారం 35,703 వక్ఫ్ సంస్థలు గుర్తించబడ్డాయి:వాటి ఆస్తుల వివరాలు:

1. తెలంగాణా 32,157 (90%) 77,538 (53.3%) 2. రాయలసీమ 1,616 (4.5%) 27,044 (18.6%) 3. ఆంధ్రా 1,930 (5.4%) 40,929 (28.1%) మొత్తం 35,703 4,45,511 [4]

ఇవీ చూడండి

[మార్చు]

పాదపీఠికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Micheau, Francoise, The Scientific Institutions in the Medieval Near East, pp. 999–1001, in (Morelon & Rashed 1996, pp. 985–1007)
  2. (Gaudiosi 1988)
  3. (Gaudiosi 1988, pp. 1237–40)
  4. (Gaudiosi 1988, p. 1246)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వక్ఫ్&oldid=4177930" నుండి వెలికితీశారు