మదరసా
ఇస్లాం పై వ్యాసాల పరంపర
| |
ఫిఖహ్ | |
| |
అహ్‌కామ్ | |
పండిత బిరుదులు | |
|
మదరసా (ఆంగ్లం : Madrasah) (అరబ్బీ : مدرسة, ) అరబ్బీ మూలం, అర్థం 'పాఠశాల' లేదా 'స్కూల్', సెక్యులర్ లేదా ధార్మిక పరమైన. దీనికి అనేక విధాలుగా పలుకుతారు ; మద్రసా, మద్రసాహ్, మదరసాహ్, మెద్రసా, మద్రస్సా, మద్రజా, మదారసా మొదలగు లాగున.
- మదరసా ఇస్లామియా అనగా 'ఇస్లామీయ పాఠశాల'.
- మదరసా దీనియా అనగా 'ధార్మిక పాఠశాల'.
- మదరసా ఖాసా అనగా 'ప్రైవేటు పాఠశాల'.
మూలార్థం
[మార్చు]మదరసా అనే పదానికి మూలం 'మూడు హల్లుల' శబ్దం د-ر-س (ద-ర-స), అనగా 'అభ్యసనం' లేదా 'బోధన', 'మదరసా' అనగా 'అభ్యసన జరిగే చోటు' లేదా 'బోధన జరిగే చోటు'. సాధారణంగా ఈ అర్థాన్ని ఇచ్చేది "పాఠశాల". అరబ్బీ భాషా ప్రభావం గల భాషలు పర్షియన్, ఉర్దూ, హిందీ, టర్కిష్, కుర్దిష్, ఇండోనేషియన్, మలయ్, బోస్నియన్ భాషలలో కూడా 'మదరసా' పదం సాధారణం.[1] అరబ్బీ పదజాలము : మదరసా (పాఠశాల), ముదర్రిస్ లేదా ముఅల్లిమ్ (ఉపాధ్యాయుడు), జామియా (విశ్వవిద్యాలయం), తాలిబ్-ఎ-ఇల్మ్ (విద్యార్థి/విద్యార్థిని) వగైరాలు. మదరసాలలో కోర్సులు : 1. హాఫిజ్ (ఖురాన్ ను కంఠస్తం చేయువాడు), 2. ఆలిమ్ (పండితుడు), 3. ముఫ్తీ (ఇస్లామీయ న్యాయ ధార్మిక శాస్త్రాలు అధ్యయనం చేసిన వాడు).
చరిత్ర
[మార్చు]ఇస్లాం ప్రారంభ దశలో మదరసాలు స్థాపించబడలేదు. విద్యావిషయాలు, ధార్మిక విషయాలు, మస్జిద్ (మశీదు) లోనే నడుపబడేవి. రాను రాను, ధార్మిక విషయాలను బోధించేందుకు మజ్లిస్ లు స్థాపించబడినవి. 859 లో, జామియా అల్ కరవియ్యిన్, మొరాకో (మరాకష్) లోని ఫెజ్ స్థాపింపబడింది. ఇస్లామీయ ప్రపంచంలో ఇది ప్రథమ మదరసా. దీనిని 'ఫాతిమా అల్ ఫిహ్రి' స్థాపించారు. ఈమె, ప్రఖ్యాత వర్తకుడు ముహమ్మద్ అల్ ఫిహ్రి కుమార్తె.
అబ్బాసీయ కాలంలో, సెల్జుక్ వజీరు (మంత్రి) యైన నిజామ్ అల్-ముల్క్, మదరసా నిజామియ్యను స్థాపించాడు. ఈ మదరసా విధానాన్ని నిజామియ అనే పేరు సార్థకమైంది. 11వ శతాబ్దంలో ఇలాంటి మదరసాలు అనేక అబ్బాసీయ నగరాలులో స్థాపింపబడ్డాయి.
విశ్వవిద్యాలయాలు, కాలేజీలు
[మార్చు]ప్రథమ విశ్వవిద్యాలయం లో, అనగా ఉన్నత చదువులకు గాను విద్యాకేంద్రాలుగా ఉన్నత విద్య, పరిశోధన, అకాడమిక్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డాక్టరేట్ పట్టా మున్నగు విషయాలు గలిగిన విద్యాకేంద్రాలను జామియా అని సంబోధిస్తూ 9వ శతాబ్దంలో స్థాపించబడినవి.[2][3] మొరాకో లోని ఫెజ్ నగరంలో గల జామియా అల్ కరౌయిన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా అతిప్రాచీన విశ్వవిద్యాలయంగా గుర్తింపబడింది. దీనిని 859 లో ఫాతిమా అల్-ఫిహ్రి స్థాపించారు.[4] అల్ అజహర్ యూనివర్శిటీ, ఈజిప్టు లోని కైరో నగరంలో 975 లో స్థాపించారు. దీనిలో అరబ్బీ భాషలో విద్యనందింపబడేది, ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు యుండేవి, వీటిని ఇజాజాహ్ (ijazah) అనేవారు.[3], ప్రతి విషయానికి వ్యక్తిగత అధ్యాపక బృందం ఉండేది.[5] ధార్మిక విషయాలకు, షరియా, ఫిఖహ్, అరబ్బీ వ్యాకరణం, ఇస్లామీయ ఖగోళశాస్త్రము, ఇస్లామీయ తత్వ శాస్త్రము, ఇస్లామీయ తత్వంలో తర్కము మున్నగు విషయాలు యుండేవి.[3] ఐరోపాలో మొదటి మదరసా స్పెయిన్, ఎమిరేట్ ఆఫ్ సిసిలీ మున్నగు ప్రదేశాలలో స్థాపింపబడినవి.[2]
న్యాయ పాఠశాలలు
[మార్చు]మదరసాలు, ప్రాథమికంగా న్యాయ పాఠశాలలు, ఈ మదరసాలలో షరియా, ఫిఖహ్లు నేర్పబడేవి.[2]
వైద్య పాఠశాలలు
[మార్చు]సాధారణంగా అన్ని మదరసాలు ఇస్లామీయ న్యాయ పాఠశాలలు, కొన్ని విశ్వవిద్యాలయాలు (జామియాలు), కొన్ని మదరసాలు వైద్య పాఠశాలలుగానూ వర్థిల్లాయి. వీటిలో ఇస్లామీయ వైద్య విధానం నేర్పబడేది. ఉదాహరణకు 15వ శతాబ్దంలో డెమాస్కస్ (అరబ్బీ పేరు 'దమిష్క్') లో 155 పాఠశాలలలో ఇలాంటి వైద్య పాఠశాలలు మూడు ఉన్నాయి.[6]
ధనసహాయాలు
[మార్చు]ఈ మదరసాలకు ధనసహాయాలు, వక్ఫ్ సంస్థలనుండి లభించేవి, ఇవి చారిటబుల్ ట్రస్ట్ ల మాదిరిగా వుండేవి. సయ్యద్ ఫరీద్ అట్లస్ వ్రాస్తాడు.[3]
భారతదేశంలో మదరసాలు
[మార్చు]భారతదేశంలో దాదాపు 30,000 మదరసాలున్నాయి.[7] మెజారిటీ మదరసాలు హనఫీ పాఠశాలకు చెందినవి. భారత్ లో ప్రధానంగా రెండు మదరసా కేంద్రాలు ప్రఖ్యాతమైనవి అవి ;
- దారుల్ ఉలూమ్ దేవ్ బంద్, ఈ మదరసా 'అహ్లుస్-సున్నహ్ వల్-జమాహ్' (దేవ్ బందీ) తో ప్రసిద్ధి. ఈ మదరసా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. జమాఅత్ ఎ ఉలమాయె హింద్‌కు కేంద్రం. వీరు దేశ ముస్లిం రాజకీయాలపై ప్రభావం చూపగల సత్తా ఉన్నవారు.
- దారుల్ ఉలూమ్ మన్జర్ ఎ ఇస్లాం, ఈ మదరసా 'అహ్లె సున్నత్ వల్-జమాత్' (బరేల్వీ) తో ప్రసిద్ధి. ఈ మదరసా కూడా ప్రపంచంలో ప్రసిద్ధి గాంచింది. దీనిని స్థాపించిన వారు ఆలా హజ్రత్ అహ్మద్ రజా ఖాన్.
ఇవీ చూడండి
[మార్చు]- ప్రపంచ ప్రసిద్ధ మదరసాల జాబితా
- భారతదేశంలో ప్రసిద్ధ మదరసాల జాబితా
- ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ మదరసాల జాబితా
- దారుల్ ఉలూమ్ - ఇంకోరకం ఇస్లామీయ పాఠశాల
- మక్తబ్ - ఇస్లామీయ ప్రాథమిక పాఠశాల
- దర్సె నిజామియ - సాధారణ మదరసా కరికులమ్
- ఫిఖహ్ - మదరసా పాఠ్యాంశములో ప్రధానమైనది.
- షరియా - మదరసా పాఠ్యాంశములో ప్రధానమైనది.
- ఇస్లామీయ నిర్మాణశైలి
- ఆలిమ్ - ఇస్లామీయ పండితుడు మదరసాలో పట్టా పొందినవాడు
మూలాలు
[మార్చు]- ↑ "Madarasaa". WordAnywhere. Archived from the original on 2007-09-27. Retrieved 2007-06-23.
- ↑ 2.0 2.1 2.2 Makdisi, George (April–June 1989), "Scholasticism and Humanism in Classical Islam and the Christian West", Journal of the American Oriental Society, 109 (2): 175-182 [175-77]
{{citation}}
: CS1 maint: date format (link) - ↑ 3.0 3.1 3.2 3.3 Alatas, Syed Farid, "From Jami`ah to University: Multiculturalism and Christian–Muslim Dialogue", Current Sociology, 54 (1): 112–32
- ↑ The Guinness Book Of Records, 1998, p. 242, ISBN 0-553-57895-2
- ↑ Goddard, Hugh (2000), A History of Christian-Muslim Relations, Edinburgh University Press, p. 99, ISBN 074861009X
- ↑ Gibb, H. A. R. (1970), "The University in the Arab-Moslem World", in Bradby, Edward (ed.), The University Outside Europe: Essays on the Development of University, Ayer Publishing, pp. 281-298 [281], ISBN 0836915488
- ↑ The Boston Globe: Indian madrasahs
బయటి లింకులు
[మార్చు]- Meaning of the word madrassah
- My time in a madrassa[permanent dead link]
- Madrassahs in Pakistan (A project of the United States Institute of Peace)
- A traditional Afghan madrassa: Islam Way Online - Your Religion and Spirituality Portal
- About Islamic Religious Schools: Madrasas.info
- A discussion on the Mamluk-era madrasa of Khawand Baraka, from The Women Writers Archive[permanent dead link]
- Alexander Evans, Understanding Madrasahs, Foreign Affairs, Jan/Feb 2006.
- Holy War 101 Archived 2008-07-06 at the Wayback Machine (Newsweek)
- Tariq Rahman, Denizens of Alien Worlds (Karachi: Oxford University Press, 2004. Reprinted 2006), Chapter on 'Madrassas'.
- Islamic Seminaries (Madrassas) in Pakistan, Wikipedia entry,
- Lessons from God The Common Language Project
- "Madaris in Perspective", Waleed Ziad, The News, Pakistan
- "Revisiting the Madrasa Question Archived 2020-02-15 at the Wayback Machine" - A talk given by Dr. Nomanul Haq (University of Pennsylvania) at LUMS, Bilal Tanweer, The News, Pakistan