Jump to content

స్థానం

వికీపీడియా నుండి
(స్థలం నుండి దారిమార్పు చెందింది)

స్థానం లేదా స్థలం (Place) మొదలైనవి ఒక నిర్ధిష్టమైన గుర్తించదగినది. వీని ఆధారంగా చాలా విషయాలు తెలుస్తాయి. స్థానికులు అనగా ఒక ప్రాంతానికి చెందినవారు. ఒక ఊరిలో చాలాకాలంగా నివసించేవారు ఆ ఊరికి స్థానికులుగా భావిస్తారు. వారు నివసించే ప్రాంతానికి చెందిన సంస్థలను స్థానిక సంస్థలుగా పరిగణిస్తారు.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో స్థానమునకు వివిధ ప్రయోగాలున్నాయి. స్థానముపని నామవాచకంగా. A place, situation, spot, site, ground, space, a home, abode, position, post, dignity, స్థలము, ప్రదేశము, పదము, ఉనికిపట్టు అని అర్ధాలున్నాయి. త్రిస్థానములు three shrines; these are ద్రాక్షారామము, భీమేశ్వరము, శ్రీశైలము. "ధరణీశ యెల్ల తీర్థంబులు చూచుచు వెలసిన త్రిస్థానములకు నేగి." ఆయన నాకు పితృస్థానమున నున్నాడు he is in the place of my father. ఏకస్థానము the unit's place, any number under ten. దశస్థానము the ten's place. శతస్థానము the hundred's place. స్థానికము adj. Local, belonging to a place. స్థల సంబంధమైన. స్థానికుడు n. A warden, a beadle. గుడిమణియగాడు, గుడిపారు పత్తెకాడు. స్థానికులు the servants in a temple. గుడి పరిజనము. "స్థానిక వ్యూహంబు వెంటరా నవ్వైకుంఠు సేవించి.", "తనదు ప్రాతందలమున్ స్థానికుడొసంగి పనుప." స్థానీయము n. అనగా A city, a town, పట్టణం.

స్థలము, స్థళము లేదా స్థలి n. అనగా A place, spot, locality, region, district, స్థానము, ప్రదేశము, పట్టు. Room, space. ఉదా: పరస్థలము a foreign or strange place. పరస్థలపువాడు a person from another place. స్థల పురాణము n. A legend associated with a particular place, పుణ్యక్షేత్ర మాహాత్మ్యము. స్థల మాహాత్మ్యము n. The influence of a place. క్షేత్రప్రభావము.

శాస్త్ర విశేషాలు

[మార్చు]
  • స్థానభ్రంశం (Displacement) శుద్ధ గతిక శాస్త్రం ఒక స్పష్టమైన విషయం.
  • ప్రస్థానం అంటే చలనం, గమనం లేదా ప్రయాణం.
  • క్రీడారంగంలో, పోటీ పరీక్షలలో వ్యక్తులు గెలిచిన ఆటలు, పొందిన మార్కులు ఆధారంగా వారి స్థానాన్ని (Position or Rank) నిర్ధారిస్తారు.
  • భౌతిక శాస్త్రంలో ఒక ఉష్ణోగ్రత వద్ద పదార్ధాల స్థితిలో మార్పువచ్చిన నిర్ధిష్ట స్థానాన్ని ఆ పదార్థం యొక్క ముఖ్యమైన లక్షణంగా గుర్తిస్తారు. ద్రవ, ఘన పదార్ధాల మాధ్యమాన్ని ద్రవీభవన స్థానం లేదా ఘనీభవన స్థానం సూచిస్తే, ద్రవ, వాయు పదార్ధాల మాధ్యమాన్ని బాష్పీభవన స్థానం తెలియజేస్తుంది.
  • జీవ శాస్త్రంలో ఒకే ప్రదేశానికి అతుక్కొని జీవించే జీవులను స్థానబద్ధ జీవులు అంటారు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=స్థానం&oldid=4376168" నుండి వెలికితీశారు