ఆదాము

వికీపీడియా నుండి
(ఆదమ్ ప్రవక్త నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బైబిల్ ప్రకారం ఆదాము సృష్టిలోని మొదటి మానవుడు. ఆదాము అనే మాటకు “ఎరుపు”, “మనిషి” అని అర్థం. హిందూ మతం ప్రకారం మనువు మొదటి మానవుడు. యూదా, ఇస్లాం మతం కూడా ఆదామును సృస్టిలోని తొలి మానవుడిగా పేర్కొంటాయి.

మైఖేల్ ఏంజిలో ప్రసిద్ధ చిత్రం - ఆదాము సృష్టి - సిస్టైన్ చాపెల్ కప్పుపైని చిత్రం. ఈ బొమ్మలో ఎడమ ప్రక్కనున్న వ్యక్తి ఆదాము.

ఆదాము ఇతివృత్తాంతం బైబిల్ లోని మొదటి పుస్తకమైన ఆదికాండంలో చెప్పబడింది. ఆదికాండం మొదటి అధ్యాయం లో, రెండో అధ్యాయంలో ఇది వేరు వెరుగా చెప్పబడింది. ఈ కథనాల ప్రకారం ఆదాము దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున దేవునిచే సృజింప బడ్డాడు. దేవుడైన యెహోవా, నేల మంటినుండి నరుని నిర్మించి అతని నాసికా రంధ్రాలలో జీవ వాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుడైన యెహోవా తూర్పున ఒక తోట వేసి దానిలో ఇతన్ని ఉంచాడు. అతడు ఆ తోటలో ఉంటూ దేవునితో నడిచాడు. సృష్టిలో జీవం కలిగిన ప్రతిదానికి ఆదాము ఏం పేరు పెట్టాడో ఆ పేరే దానికి కలిగింది. సృష్టిలోని సమస్తానికి ఏలికగా దేవుడతన్ని నియమించాడు.

ఆదాముకు సాటి అయిన సహాయం చెయ్యాలని అనుకున్నప్పుడు దేవుడతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసిస్త్రీగా నిర్మించి అతనికిచ్చాడు. ఆదాముకు సాటి అయిన సహాయంగా ఇవ్వబడ్డ స్త్రీసైతాను చేత శోధింపబడి దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన మంచి చెడుల వివేచనను తెలిపే జ్ఞాన వృక్ష ఫలాన్ని తాను తిని అతనిచేతా తినిపించినందున వారు ఏదేను వనం నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఆతర్వాత కష్టపడి, చెమటోడ్చి, శపించబడిన భూమిని సేద్యం చెయ్యటానికి నియుక్తుడయ్యాడు.

ఆదాము పెద్ద కొడుకు కయీను తన తమ్ముడైన హేబేలును చంపి మానవ చరిత్రలో తొలి హంతకుడుగా ముద్ర పడ్డాడు. ఆదాముకు మూడో కుమారుడైన షేతుకు ఎనోషు అనే కొడుకు పుట్టాక యెహోవా నామంలో ప్రార్థన చెయ్యటం మొదలైంది. ఆదాము తొమ్మిది వందల ముఫై ఏళ్ళు బ్రతికాడని బైబిల్ చెపుతుంది.

ఆదాము అనే పేరు కలిగిన ఒక పట్టణం యోర్దాను నదీ పరీవాహక ప్రదేశంలో ఉన్నట్టు యెహోషువా గ్రంథంలో పేర్కొన బడింది. బైబిల్ వెలుపలి చారిత్రకాధారాల ప్రకారం ఆదాము అనే ఈ పట్టణం దగ్గరి కొండ రాళ్ళు దొర్లిపడి యోర్దాను నదీ ప్రవాహం ఆగిందని సరిగ్గా అదే సమయంలో ఇశ్రాయేలీయులు యొహోషువా నాయకత్వంలో యొర్దాను నది దాటి కనాను లోకి వెళ్ళారని తెలుస్తుంది.

ఆదమ్ (آدم) : ఇస్లామీయ ధార్మిక గ్రంథాలు, సాహిత్యాల ప్రకారం, ఆదమ్, అల్లాహ్ యొక్క ప్రథమ మానవ సృష్టి[1]. ప్రథమ ప్రవక్త కూడానూ. ఇతడి ధర్మపత్ని హవ్వా. వీరిరువురూ ధరణి పై తొలి మానవులు, ఆది దంపతులు. ప్రథమంగా కాబా గృహాన్ని ఆదమ్ నిర్మించాడు. వీరి ప్రథమ, ద్వితీయ కుమారులు ప్రపంచంలో మొదటి అన్నదమ్ములు ఖాబీల్ (బైబిల్ లో పేరు - కయీను), హాబీల్ (బైబిల్ లో పేరు - హేబేలు), హాబీల్ ఖాబీల్ను చంపేస్తాడు. అంటే ఇది మొదటి హత్య. దీనితో ఆదమ్, హవ్వలు తమ సొంత కొడుకే ఇంకో కొడుకును హత్య చేస్తే పుత్రశోకాన్ని అనుభవిస్తారు. ఇస్లాం ధర్మం ప్రకారం ఆదమ్ మొదటి ప్రవక్త.

క్రైస్తవ మతం ప్రకారం, ఆడమ్ ఈడెన్ గార్డెన్‌లో "ట్రీ ఆఫ్ నాలెడ్జ్"(జ్ఞాన వృక్షం) నుండి పండును తినడం ద్వారా పాపం చేశాడు. ఈ చర్య ప్రపంచంలోకి మరణం, పాపాన్ని పరిచయం చేసింది. ఈ పాపపు స్వభావం అతని వారసులందరికీ సోకింది. మానవాళిని తోట నుండి బహిష్కరించటానికి దారితీసింది. యేసు సిలువ వేయడం ద్వారా మాత్రమే మానవాళికి విముక్తి లభిస్తుంది.

ఇస్లాంలో, ఆడమ్‌ను భూమిపై ఖలీఫా (خليفة) (వారసుడు)గా పరిగణిస్తారు. అతను దేవుని వారసుడు అని, భూమిపై చైతన్యవంతమైన జీవితం యొక్క కొత్త చక్రాన్ని ప్రారంభించడం లేదా రెండూ అని దీని అర్థం.[2] బైబిల్‌లోని వృత్తాంతం లాగానే, ఖురాన్ ప్రకారం, ఆడమ్‌ను తోటలో ఉంచారు. అమరత్వం యొక్క చెట్టుచే శోదించబడి, అతను పాపం చేసి తోటలో తన నివాసాన్ని కోల్పోతాడు. ఆడమ్ తన పాపం నుండి పశ్చాత్తాపపడినప్పుడు, అతను దేవునిచే క్షమించబడ్డాడు. ఇది మానవ జీవితానికి మార్గదర్శకంగా పరిగణించబడుతుంది, వారు పాపం చేసి, తమ తప్పును తెలుసుకుని, పశ్చాత్తాపపడతారు.[3]

ఆదాము ఏ మానవజాతికి చెందినవాడు?

[మార్చు]

భూమిపై లక్షల సంవత్సరాల నుండి ఎన్నో మానవ జాతులు విరాజిల్లాయి. కాని పూర్తి పరిపక్వత చెందిన మానవ జాతి ఆధునిక మానవుడు (Homo Sapiens) మాత్రమే. బైబిలు వ్రాసింది ఆధునిక మానవులే కనుక ఆదాము అవ్వలు ఆధునిక మానవజాతికి చెందినవారవుతారు. అంతకు ముందున్న హోమో హేబిలిస్ (Homo Habilis), హోమో ఎర్గాస్టర్ (Homo Ergaster), హోమో ఎరక్టస్ (Homo Erectus), హోమో హైడల్బర్జెన్సిస్ (Homo Heidelbergensis), హోమో ఎంటిసిసర్ (Homo Antecessor), హోమో నియాండతాలెన్సిస్ (Homo Neanderthalensis) వంటి మానవ జాతులు అంతరించిపోయాయి. ఆ తర్వాత ఆధునిక మానవ జాతి ఆవిర్భవించింది. అంతరించిపోయిన మానవజాతులు బైబిలులో పేర్కొనబడలేదు. ఆధునిక మానవుల్లోని మొట్టమొదటి భార్యా భర్తలను బైబిలులో ఆదాము (Adam) ఆవ్వ (Eve) లుగా నామకరణం చేశారు. బైబిలు కొలమానం ప్రకారం ఆధునిక మానవుల ఆవిర్భావంతోనే సృష్టి ఆరంభం జరిగింది. అనగా ఏక కణజీవుల ఆవిర్భావ కాలం, రాక్షస బల్లులు జీవించినకాలం నుండి నియాండర్తల్ మానవుడు అంతరించిన కాలం వరకూ జరిగిన చరిత్ర బైబిల్లో ప్రస్తావించబడలేదు.

ఆదాము యొక్క వంశావళి

[మార్చు]

బైబిల్ ప్రకారం, దేవుడు సృష్టించిన మొదటి మనిషి ఆదాము,, ఆదాము యొక్క వంశావళిని ఆదికాండము పుస్తకం, అధ్యాయం 5 ద్వారా గుర్తించవచ్చు. వంశావళి క్రింది విధంగా ఉంది: దేవుడు సృష్టించిన మొదటి మనిషి ఆదాము.

  1. ఆదాము సేతును కనెను.
  2. సేతు ఎనోషును కనెను.
  3. ఎనోషు కేనానును కనెను.
  4. కేనాను మహాలలేలును కనెను.
  5. మహాలలేలు జారెదును కనెను.
  6. జారెదు హనోకును కనెను.
  7. హనోకు మెతూషెలాను కనెను.
  8. మెతూషెలా లెమెకును కనెను.
  9. లెమెకు నోవహును కనెను.

మూలాలు

[మార్చు]
  1. Hendel 2000, p. 18.
  2. Mahmoud Ayoub The Qur'an and Its Interpreters, Volume 1 SUNY Press, 1984 ISBN 978-0-87395-727-4 p. 73
  3. Stieglecker, H. (1962). Die Glaubenslehren des Islam. Deutschland: F. Schöningh

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆదాము&oldid=4237639" నుండి వెలికితీశారు