కయీను
Appearance
జెనిసిస్ గ్రంథం ప్రకారం, కయీను లేదా కేన్ (Cain), హెబెల్ (Abel) లు ఆదాము, అవ్వ ల సంతానం.[1] మానవుని పతనం తరువాత [2] వీరు జన్మించారు. వీరి కథ బైబిల్ Genesis 4:1-16 లోను, ఖురాన్ 5:26-32లోను, మోసెస్ 5:16-41లోను చెప్పబడింది. అన్నింటిలోను కేన్ ఒక రైతు. హెబెల్ ఒక గొర్రెల కాపరి.[3] కేన్ తన తమ్ముడైన హెబెల్‌ను చంపేశాడు.[4] కనుక బైబిల్ ప్రకారం మానవ సృష్టిలో ఇది మొట్టమొదటి హత్య. ఈ హత్యకు కారణం దేవుడు[5] కేన్ ఇచ్చిన బలిని నిరాకరించి, హెబెల్ ఇచ్చిన బలిని స్వీకరించాడు. ఎందుకంటే హెబెల్ తన గొర్రెలలో అన్నింటికంటే మంచిదానిని బలి ఇచ్చాడు. కేన్ మాత్రం తన అదనపు పంటను సమర్పించాడు. ఈ విధంగా హెబెల్ ప్రపంచంలో మొదటి హతుడు. ఆదం రెండవ కొడుకు. తన అన్న కయీను చేతిలో హతుడయ్యాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "She conceived and gave birth to Cain. ... Then she also gave birth to his brother Abel." మూస:Bibleref2 (Holman Christian Standard Bible, HCSB).
- ↑ "God sent him away from the garden of Eden to work the ground." Gen 3:23 (HCSB).
- ↑ "Cain cultivated the land." Gen 4:2 (HCSB).
- ↑ "Abel became a shepherd." (మూస:Bibleref2).
- ↑ మూస:Bibleref2 and others (Biblia Hebraica Stuttgartensia, BHS).
బయటి లింకులు
[మార్చు]- Torah, Genesis, Chapters 1-6
- Catholic Encyclopedia articles on Cain and on Abel
- King James Version
- New Revised Standard Version
- New International Version