Jump to content

యోనా

వికీపీడియా నుండి
యోనా

యోనా ఇతడు పరిశుద్ధ గ్రంథము లేదా బైబిలు గ్రంథము ప్రకారము ఒక హెబ్రీయుడు. ఇతని తండ్రి పేరు అమిత్తయి.

నీనెవే పట్టణంనకు యోనా ప్రయాణము

ఇతనికి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఈ విధముగా సెలవిచ్చెను - నీనెవె పట్టణస్తుల దోషము ఎక్కువైనది కనుక నీవు వెళ్ళి వారికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.అయితే యోనా తర్షీషు పట్టణంనకు పారిపోవాలని యొప్పేకు వెళ్ళి తర్షీసునకు వెళ్ళే ఓడను చూసి దేవుని మాటలకు లోబడకుండా దానిలోనికి ఎక్కాడు.

సముద్రము ఉప్పొంగుట

కానీ దేవుడు సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమునందు గొప్ప తుఫాను మొదలైనది ఎంతగా అంటే ఒడబద్దలైపోతుందేమోననే భయము కలిగెలాగ ఉన్నది వాతావరణము. ఓడలోని నావికులు భయపడి, ప్రతివారు తమ తమ దేవతను ప్రార్థించి, ఓడ తేలిక కావాలని దానిలోని సరకులను సముద్రములోనికి వెశారు. అప్పట్టికి యోనా ఓడ దిగువభాగమునకు పోయి పడుకొని గాడనిద్రలో ఉన్నాడు. అప్పుడు ఓడనాయకుడు యోనా దగ్గరకు వచ్చి - ఓయీ నిద్రబోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ (నీ) దేవుడు మనలను రక్షిస్తాడేమో అన్నాడు. ఇంతలో ఓడలోని అందరూ ఎవరి వల్ల ఇంత కీడు వచ్చిందో తెలుసుకోవడాని చీట్లు వేద్దాము అనుకొని చీట్లు వేసి చూస్తే అది యోనా పేరు మీదే వచ్చింది. వారు అతనితో నీవు ఎవరు? ఎక్కడ నుండి వచ్చావు? నీ దేశమేది? నీ ప్రజలెవరు? ఎవరిని బట్టి ఈ కీడు సంభవించెనో మాకు చేప్పమని ప్రశ్నించారు. అప్పుడు యోనా నేను హెబ్రీయుడను నేను సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన యెహోవాయందు భయభక్తులు గల వాడనై ఉన్నాను. ఆయన చెప్పిన మాట వినకుండా పారిపోతున్నాను అని చేప్పాడు. వెంటనే వారు భయపడ్డారు. అప్పుడు వారు - సముద్రము పొంగుతుంది, తుఫాను ఎక్కువవుతున్నది సముద్రము మమ్మల్ని ముంచకుండా ఉండడానికి మేము నిన్ను ఏమి చేయాలని యోనాను అడి గారు.

యోనాను సముద్రములో పడవేయుట

అతడు - కేవలము నా వల్లే ఈ గొప్ప తుఫాను వచ్చింది .కాబట్టి నన్ను ఎత్తి సముద్రములో వేయండి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండా తగ్గుతుందని చెప్పాడు. వారు ఓడను తీరానికి చేర్చాలని తెడ్లను చాలా బలముగా వేసారు గాని ఎదురు గాలికి తుఫాను వేగానికి వారి ప్రయత్నము విఫలమైంది. అందువలన వారు - యెహోవా, నీ ఆజ్ఞ ప్రకారముగా నీవే దీనిని చెసితివి; ఇతనికి మేము చేసిన దాన్ని బట్టి మమ్మల్ని చంపకుందువు గాక, నిర్దోషిని చంపామన్న నేరము మామీద మోపకు అని దేవునికి మనవి చేసి యోనాను ఎత్తి సముద్రములో వేసారు. వెంటనే సముద్రము పొంగకుండా ఆగింది. ఇది చూసినవారు భయపడి బలులు అర్పించి దేవునికి ప్రార్థించారు. గొప్పా మత్స్యము (సొరచేప) ఒకటి యోనాను మింగాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఆవిధముగానే యోనా మూడు దినములు ఆ మత్స్యము కడుపులోనే సజీవముగా ఉన్నాడు. మూడు రోజులు కూడా యోనా మత్స్యము కడుపులో నుండి దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మూడవ రోజు మత్స్యము అతడిని నేల మీద కక్కేసింది.

నీనెవే పట్టణపు ప్రజలు పశ్చాత్తాప పడుట

అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను - నీవు లేచి నీనెవె పట్టణంనకు వెళ్ళి నేను నీకు చెప్పినదంతా చెప్పమనెను. అతడు లేచి నీనెవె పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణం చాలా పెద్దది మూడు రోజు ప్రయాణము చేయగల్గినంత పెద్దది. యోనా ఒక రోజంతా ప్రయాణించి నలభై రోజులకు నీనెవె పట్టణం నాశనమవుతుందని ప్రకటించాడు. వెంటనే ఆ పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాసము చేసి గొప్పవారు, చిన్నలు, పెద్దలు అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. ఈ సంగతి ఆ రాజ్యపు రాజుకు తెలిసి అతడు తన రాజ్య సింహాసనమునుండి దిగి, తన రాజవస్త్రములు తీసివెసి గోనెపట్ట కట్టుకొని బుడిదెలో కూర్చునాడు. అతడు ఇలా ఆజ్ఞాపించాడు - ఒకవేళ్ళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము చావకుండా తన కోపాగ్ని చల్లార్చుకొంటాడేమో పశువులు గానీ, మనుషులు గానీ, యెద్దులుగానీ, గొత్జెలు గానీ మేతమేయకూడగు, నీళ్ళు తాగకూడదు. మనుష్యులందరూ వాళ్ళ పాపములను విడిచి వారు చేయు బలాత్కారమును మానివేయాలి, అందరూ గోనెపట్ట కట్టుకోవాలి, మనస్సుపూర్వకముగా దేవుని ప్రార్థించాలి అని ఆజ్ఞాపించాడు. ఈ నీనెవెవారు చెడుప్రవర్తనలను మానుకున్నారు వారిని దేవుడు చూసి వారిని లయము చేయకుండా ఆగాడు.

యోనా దేవునిమీద కోపగించుకొనుట

కానీ యోనా కొపగించుకొన్నాడు ఎందుకంటే అతడు అనుకున్నాదేమిటంటే నేను చెప్పిన తర్వాత వీరు మనసు మార్చుకొని దేవుని తట్టు తిరుగుతారు అప్పుడు దేవుడు వారిమీదకు రావాల్సిని ఉపద్రవమును రానివ్వడు అందువల్ల దేవునితో నిను ఈ దేశములో ఉండగా ఇలా జరుగుతుందనుకున్నాను నేను చెప్పినవెంటనే వీళ్ళు మారిపోతారు నీవు క్షమిస్తావు అందుకే నేను ఇక్కడకు రాకుండా తర్షీషునకు పారిపోదామనుకున్నాను కానీ వీళ్ళను నీ కోపాగ్నితో కాల్చుతావని నాతో చెప్పించి ఇప్పుడు వీరిని క్షమించావు నేనింక బ్రతకందం ఎందుకు? చావడం మేలు యెహోవా నన్ను చంపుము అన్నాడు అందుకు దేవుడు నువ్వు కోపపడడము న్యాయమా? అని అడిగాడు. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పుతట్టున నివసించి అక్కడ ఒక పందిరి వేసుకొని ఈ పట్తణము ఎమౌవుతుందో చూస్తాననుకున్నాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=యోనా&oldid=3322611" నుండి వెలికితీశారు