Jump to content

చర్చ:ఇస్లామీయ ప్రవక్తలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

రహమతుల్లా గారూ, సలామ్, ఇస్లామీయ ప్రవక్తలు వ్యాసంలో వున్న 25 ప్రవక్తలకు అదనంగా మరో 5 పేర్లు వ్రాశారు. అవి. (1)షీత్ (2)యోషే బిన్ నూన్ (3) సమూయీల్ (4) ఉజైర్ (5) మరియమ్.

ఈ విషయపు మూలాలు తెలుసుకోగోరుతున్నాను. నాకు ఈ విషయం తెలియదు. తెలుసుకోవాలంటున్నాను. దయవుంచి కాస్త తెలుపగలరు. ఈ లింకులనూ కాస్త చూడగలరు. [1] [2] [3] [4]

షుక్రియా. నిసార్ అహ్మద్ 16:01, 14 నవంబర్ 2008 (UTC)

  • నిసార్ గారూ చాలా సంతోషం. ఇలా మూలాలను తెలిసికొన్నమీదటే విషయాలను నమ్మాలి. విశ్వ ప్రవక్తల జీవితచరిత్ర అనే పుస్తకంలో డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ ఈ అయిదుగురిని కూడా ఇస్లామీయ ప్రవక్తలుగా పేర్కొన్నారు.అలాగే కొందరు ఆలిమ్ లూ ఈ అయిదుగురినీ ప్రవక్తలుగా ఒప్పుకున్నారు.--Nrahamthulla 06:23, 16 నవంబర్ 2008 (UTC)

రహమతుల్లా గారూ సలామ్, సార్వజనీయ విశ్వాసాల ప్రకారం పైనుదహరించిన ఐదుగురిని ప్రవక్తలుగా గుర్తించరు, ఉదాహరణకు, మరియమ్, ఈసా మసీహ్ తల్లి, ఈమెకు ప్రవక్తగా నుదహరించిన దాఖలాలు ఖురాన్ లో కనిపించవు. ఈమె పేరున సూరా వున్నది, గాని అందులో ఒక్క ఉటంకం గూడా ఈమెను ప్రవక్తగా ప్రకటించదు. అలాగే, దుల్ కర్నైన్ లేదా జుల్ కర్నైన్ గురించి పొగుడుతూ వర్ణింపబడినది, కాని ఇతను ప్రవక్త గాదు. వీరిని ప్రవక్తలుగా గుర్తించుటకు ఏలాంటి ఆధారాలూ గనబడవు. గమనించగలరు. ఇంకోవిషయం, ముస్లింల అపవిశ్వాసాలు పట్టికలో వుంచాను, గమనించగలరు. షేక్ అబ్దుల్ ఖాదిర్ గారి గురించి నుదహరించారు, ఫిర్ఖాలు లేదా సమూహాల గురించి, వీరూ అబ్దుల్ ఖాదిర్ జీలానీ ఒకరేనా? కొంచెం తెలుపగలరు. ఆ తరువాత 'ముస్లింల అపవిశ్వాలు' గూర్చి ఖండితాలు, విశదీకరణలు, మూలాలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను, కొంచెం సమయం పట్టగలదు, కానీ ఒక సందేహం, ఈ విషయాలు వికీ-పరిధిలోకి వస్తాయా? వస్తాయంటే ఇక్కడే వ్రాయడానికి ప్రయత్నిస్తాను, వస్సలామ్ నిసార్ అహ్మద్ 16:51, 22 నవంబర్ 2008 (UTC)

  • ఈ అపవిశ్వాసులందరినీ పట్టికరూపంలోకి మార్చినందుకు సంతోషం.వికీ ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వం.సక్రమంగా వినియోగిస్తే మతవర్గాలప్రజలకూ ఎంతో సమాచారం అందుతుంది. మీరు మీ సొంత అభిప్రాయాలు చెప్పటం లేదు గదా? ఖండన స్థూలంగాఇది అని చెప్పి మూలలేఖనం రిఫరెన్స్ ఇవ్వండి.జుల్ కర్నైన్ ప్రవక్త కాదు. మరియమ్ గురించి మాత్రం డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ ప్రవక్త్రి గా పేర్కొన్నారు.అబ్దుల్ ఖాదిర్ జీలానీ గియాసుల్ లుగాత్ రాసిఉంటే ఆయనే ఈఅబ్దుల్ ఖాదిర్. --Nrahamthulla 17:17, 22 నవంబర్ 2008 (UTC)
  • రహమతుల్లా గారూ సలామ్, ఖురాన్ లో ప్రకటింపబడిన ప్రవక్తలు 25. వీరిని సహాబాలు, తాబయీ, తబె తాబయీ, ఔలియాలు మరియు ముస్లిం పండితులూ అంగీకరిస్తారు. కానీ మీరు మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ గారి రెఫరెన్స్ తో మరో ఐదుమంది ప్రవక్తల పేర్లు చేర్చారు. ఈ విషయంగా అనే రెఫరెన్సులు చూసాను. మరియమ్ ప్రవక్త కాదు. కానీ మీరు చేర్చారు. ఇలా చేర్చుతూ పోతే ఇంకో అపవిశ్వాసంగా తయారయే ప్రమాదం వున్నది. కావున మీరు ఇంకోసారి రెవ్యూ చేయండి. ఇక్కడ నేను ముహమ్మద్ అబ్దుల్ సత్తార్ గారి ఆథెంటిసిటీని ప్రశ్నించడంలేదు. కానీ ఇలా చేర్చుతూ పోతే మనం సహాబా, తాబయీ తబె తాబయీ, ఔలియా మరియు ఇమామ్ (అబూ హనీఫా, షాఫయీ, మాలికి మరియు హంబలి) ల ఆథెంటిసిటీలను ప్రశ్నించినవారల మౌతాము. ఈ జాబితా గూర్చి ఇవికీ [1] చూడండి. ఇవికీ లో వ్రాసేవారు ప్రపంచ నలుమూలనుండీ వున్నారు. అలాగే 1.[2] నీ చూడండి. ఈ చర్చను పొడిగించినందుకు మన్నించండి. కానీ వాస్తవాలు ముందుంచడం చాలాముఖ్యం. లేదా అపవిశ్వాసాల జాబితా పెరుగుతూ పోతుంది. అహ్మద్ నిసార్ 16:10, 5 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • రహమతుల్లా గారూ, అల్లాహ్ పంపిన ప్రవక్తలందరూ పురుషులు అన్న విషయానికి మూలం సూరా అన్-నహల్ లోని 43వ ఆయత్ ను చూడండి. ఈ ఆంగ్ల లింకు (16:43) " We did not send before you except men whom we inspired. Ask those who know the scripture, if you do not know ". [3] ఈ ఉర్దూ లింకు [4] చూడండి. అల్లాహ్ ఈవిధంగా సెలవిస్తాడు " ఓ (ముహమ్మద్) ప్రవక్తా! మీకన్నా ముందు మేము పంపిన ప్రవక్తలందరూ పురుషులే". ముహమ్మద్ ప్రవక్త ఆఖరు ప్రవక్త. వీరికన్నా ముందు పంపబడిన ప్రవక్తలందరూ పురుషులే అని స్వయంగా అల్లాహ్ యే ప్రకటిస్తున్నపుడు మనం మరియం ను ప్రవక్తగా ప్రకటించుకోవడం లేదా భావించడం ఎంత వరకు సబబు? కావున మీరు ఇంకో సారి రివ్యూ చేసుకొని, ప్రవక్తల పేర్లను సవరించవలసినదిగా కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 15:56, 11 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • నిసార్ భాయ్ ఖురాన్ లో మీరు చెప్పిన మాట ఉంది.కానీ అది ప్రవక్తలుగా పంపబడ్డవారు స్త్రీలా పురుషులా అనే వివక్ష గురించి కాదు .మనుషులా దేవదూతలా అనే సందేహం గురించి.అహ్ లుజ్జిక్ర్ అంటే లేఖన పరిజ్ఞానం గలవారు. పంపబడ్డ ప్రవక్తలు జ్ఞానులైన మానవమాత్రులే కానీ దైవదూతలుకాదు అని ."O muhammad whenever we raised any messengers before you ,they were no more than human beings" అనేది సరైన అనువాదం.The objection consisted of pleading that a prophet is no more than any other human being. తెలియకపోతే లేఖనాలు తెలిసిన జ్ఞానుల్ని అడిగి తెలుసుకోండి అంటాడు అల్లాహ్.--Nrahamthulla 16:44, 11 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]