ఇబ్న్ మాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox Muslim scholars

ఇబ్న్ మాజా (ఆంగ్లం : Ibn Maja), పూర్తి పేరు అబూ అబ్దుల్లా ముహమ్మద్ ఇబ్న్ యజీద్ ఇబ్న్ మాజా అల్-రాబి అల్-ఖాజ్వినీ, మధ్యయుగం నాటి ముహద్దిస్ లేదా హదీసు పండితుడు. ఇతని ప్రఖ్యాత రచన సునన్ ఇబ్న్ మాజా.

ఇబ్న్ మాజా "ఖాజ్విన్", నేటి ఇరాన్ లోని ఖాజ్విన్ రాష్ట్రంలో 824లో జన్మించాడు. తన 22వ యేట, తన స్వగ్రామాన్ని వదిలి ఇస్లామీయ ప్రపంచంలో యాత్రకొరకు బయలుదేరాడు.; ఇతను కూఫా, బస్రా, ఈజిప్టు, "షామ్" (సిరియాకు ప్రాచీన నామం), బాగ్దాదు, "రాయ్య్" మక్కా, మదీనా, ఖోరాసాన్ లను సందర్శించాడు. 887లో మరణించాడు. ఇతని యాత్రల తరువాత, సునన్ ఇబ్న్ మాజాను రచించాడు, ఇందులో 4,341 హదీసులు గలవు, ఇందులో 3,002 హదీసులు ఇతర ఐదు మంది ముహద్దిస్లు రచించినవే; ఇందులోని 1,339 హదీసులు తాను క్రోడీకరించినవి, 428 హదీసులు సహీహ్ (అధికారికమైనవి), ఇతరముల ఆధారితాలు సంపూర్ణంగా అధికారికమైనవి గావని సూచింపబడినవి. ఇతను తఫ్సీర్ (ఖురాన్ పై వ్యాఖ్యానాలు) కూడా రచించాడు, కానీ అది లభ్యంలేదు.

రచనలు[మార్చు]

వనరులు[మార్చు]

  • సుహైబ్ హసన్ అబ్దుల్ గఫ్ఫార్, రచన సునన్ ఇబ్న్ మాజా హదీసుల పట్ల ముస్లింల సున్నిత విమర్శలు, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇస్లామిక్ రీసెర్చ్, IFTA, Propagation: రియాద్ 1984 (1404 హి.శ.).

బయటి లింకులు[మార్చు]