Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

సున్నీ ఇస్లాం

వికీపీడియా నుండి
(సున్నీ ముస్లిం నుండి దారిమార్పు చెందింది)
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

సున్నీ ముస్లింలు ఇస్లాం మతమును అవలంబించు ఒక పెద్ద వర్గం. ప్రపంచపు ముస్లిం జనాభాలో దాదాపు 90% సున్నీముస్లిములే. వీరు అవలంబించు ధర్మాన్ని సున్నీ ఇస్లాం అని, లేదా అహలే సున్నత్ వల్-జమాఅత్ (అరబ్బీ : أهل السنة والجماعة) (మహమ్మదు ప్రవక్త సున్నహ్ను అవలంబించు ముస్లింల సమూహము). వీరు అధికసంఖ్యలో ఉన్నారు. క్లుప్తంగా అహలె సున్నత్ (అరబ్బీ: أهل السنة ) అని కూడా అంటారు. 'సున్నీ' అనే పదం సున్నహ్ (అరబ్బీ : سنة ), నుండి ఉధ్బవించింది, అర్థం 'పదాలు, క్రియలు'[1] లేదా మహమ్మదు ప్రవక్త ఉదాహరణలు. ఈ వర్గం ఖలీఫాలను అబూబక్ర్, వారి వారసులను ఆమోదిస్తుంది, వీరు షూరా అనగా ప్రజామోదంచే ఎన్నుకోబడ్డారు.

జనగణన

[మార్చు]
దస్త్రం:MuslimDistribution2.jpg
సున్నీ షియాల జనగణనా విభజన

ప్రపంచంలోని ముస్లింల జనగణనావిషయంలో తలో అభిప్రాయంవున్నది. ముస్లింల జనాభా ఎంత? అందులో సున్నీలు షియాల గణన ఎంత? ఈవిషయంపై సరైన అవగాహనే కలగదు. ఒకవిషయంమాత్రం విదితం, అదేమనగా దాదాపు 60ముస్లిం దేశాలున్నాయి అందులో మెజారిటీ షియాలున్న దేశం ఒక్క ఇరాన్ మాత్రమే. ఇరాక్, ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో చెప్పుకోదగ్గ షియా సముదాయమున్నది. భారతదేశంలోనూ షియాలు నివసిస్తున్నారు. అదే సున్నీల విషయానికి వస్తే అన్ని ఇస్లామీయ దేశాలలో సున్నీలు మెజారిటీగా కనిపిస్తారు. క్లుప్తంగా ప్రపంచ ముస్లిం జనాభాలో 90% నుండి 92.5% సున్నీ ముస్లింలుంటే, 7.5% నుండి 10% వరకు షియాలున్నారు.[2]

సున్నీ న్యాయపాఠశాల (మజ హబ్)

[మార్చు]

ఇస్లామీయ న్యాయశాస్త్రాన్ని షరియా అంటారు. షరియా యొక్క మూలాధారం ఖురాన్, సున్నహ్ లు. "వివిధ న్యాయశాస్త్రాల అవలంబీకులైననూ, పరస్పరవైరుధ్యంలేకుండా ఒకే మస్జిద్ లో ప్రార్థనలు చేసెదరు. సున్నీ ముస్లింల న్యాయపాఠశాలలు నాలుగు, వారి స్థాపకులు:

ఈ పాఠశాల అవలంబీకులకు "హనఫీ"లు అంటారు. ఈ పాఠశాలను స్థాపించినవారు "అబూ హనీఫా" (తారీఖు. 767). ఇతను ఇరాక్లో జన్మించాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, మధ్యాసియా ఇరాక్, టర్కీ, జోర్డాన్, లెబనాన్, సిరియా, పాలస్తీనా లోని ముస్లింలు ఈ పాఠశాలను అవలంబిస్తారు.

  • మాలికి పాఠశాల (స్థాపకులు: మాలిక్ ఇబ్న్ అనస్ మరణం 795) మహమ్మదు ప్రవక్త ఆఖరు సహాబాలను చూసిన ఇతను తన ఆలోచనలను మదీనాలో ప్రవేశపెట్టాడు. ఈ పాఠశాల సున్నీ ముస్లింలలో అధికారికమైన పాఠశాల. ఇతని నిర్వచనాన్ని 'మువత్తా' లో గ్రంథస్తమయింది. ఈ పాఠశాల అవలంబీకులు ఆఫ్రికా ఖండం అంతటా దాదాపు వ్యాపించియున్నారు.
  • షాఫయీ పాఠశాల (స్థాపకులు : ముహమ్మద్ ఇబ్న్ ఇద్రీస్ అష్-షాఫయీ మరణం 820). ఇతను ఇరాక్, ఈజిప్టులలో బోధించాడు. ప్రస్తుతం ఇండోనేషియా, దక్షిణ ఈజిప్టు, మలేషియా, యెమన్ ముస్లింలు ఈ పాఠశాలను అవలంబిస్తారు. ఇతను మహమ్మదు ప్రవక్త యొక్క సున్నహ్ ను అమితంగా ప్రాధాన్యతనిచ్చాడు, ఇవన్నియూ హదీసులనుండి గ్రహింపబడినవి. ఈ హదీసులే షరియాకు మూలం.
  • హంబలి పాఠశాల (స్థాపకులు: అహ్మద్ బిన్ హంబల్)

అహ్మద్ ఇబ్న్ హంబల్ (మరణం : 855) బాగ్దాదులో జన్మించాడు. ఇతను షాఫయీ నుండి ఎన్నో విషయాలను అభ్యసించాడు. ఈ పాఠశాలావంబీకులు అరేబియన్ ద్వీపకల్పంలో మెండు.

పై నాలుగు పాఠశాలలన్నియూ వైవిధ్యంగలవి, గాని సున్నీముస్లింలు వీటిన సాధారణంగా సమాన దృష్టితో చూస్తారు.


మజ్ హబ్ విషయంలో సందేహం తలెత్తుతుంది. మజ్ హబ్ అనగా పాఠశాల, మతము గాదు. ముస్లిం సముదాయాలలో ఈ నాలుగు పాఠశాలలు సాధారణంగా కానవస్తాయి. సున్నీ ముస్లింలు ఈ మజ్ హబ్ లను సమాన దృష్టితో చూసిననూ, ఏదో ఒక మజ్ హబ్ ను నిర్దిష్టంగా నిష్ఠగా పాటించవలెనని బోధిస్తారు. వీటన్నిటికీ మూలం ఖురాన్, హదీసులు మాత్రమేనని మరువగూడదు.

సున్నీ దృష్టికోణంలో హదీసులు

[మార్చు]

ఖురాన్ను సహాబాలు సా.శ. 650 లో క్రోడీకరించారు. మహమ్మదు ప్రవక్త గారి జీవితంలో ఆయన అనుసరించినవిధానాలు, ఆచరించిన సంప్రదాయాలను హదీసులుగా స్థిరీకరించారు. ఈ స్థిరీకరించిన సంప్రదాయాలను హదీసుల క్రోడీకరణలు గావించారు. ఈ హదీసులు ముఖ్యంగా ఆరు గలవు. సున్నీ ముస్లింల ప్రకారం అవి క్రింది విధంగా యున్నవి.

హదీసు క్రోడీకరణలు ఇంకనూ వున్నవి, వీరికి పేరు ప్రఖ్యాతులు లేనప్పటికీ ఇవి అధికారికమైన హదీసులుగా పరిగణిస్తారు. వీటిని ఈరంగంలో పరిణతి చెందినవారు ఉల్లేఖిస్తూవుంటారు. ఇవి:

మూలాలు

[మార్చు]
  1. http://dictionary.reference.com/search?q=Sunna
  2. ""How Many Shia Are in the World?"". IslamicWeb.com. Retrieved 2006-10-18.

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]