విశాల్ భరద్వాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Vishal Bhardwaj
Vishal Bhardwaj 2010 - still 110691 crop.jpg
జననం (1960-08-04) 1960 ఆగస్టు 4 (వయస్సు: 57  సంవత్సరాలు)
భార్య/భర్త Rekha Bhardwaj

విశాల్ భరద్వాజ్ (జననం 1960 ఆగస్టు 4) ఒక భారతీయ చిత్ర దర్శకుడు, రచయిత, స్క్రీన్ రచయిత, సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు.

ప్రారంభ జీవితం[మార్చు]

విశాల్ భరద్వాజ్ ఉత్తర ప్రదేశ్[1] లోని బిజ్నోర్ లో పుట్టి పెరిగాడు. ఇతని తండ్రి రామ్ భరద్వాజ్ [2]. ఈయన ఒక ప్రముఖ కవి మరియు గీత రచయిత. యుక్తవయస్సులో, విశాల్ ఢిల్లీ చేరుకున్నాడు. అతను ఢిల్లీ విశ్వవిద్యాలయమునకు చెందిన ప్రసిద్ధ హిందూ కాలేజీ[3] నుండి పట్టా పుచ్చుకున్నాడు. ఇక్కడే అతను తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు మరియు తన భార్య, రేఖ భరద్వాజ్ ను కలుసుకున్నాడు.[4] [5]

వృత్తి జీవితం[మార్చు]

విశాల్ భరద్వాజ్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో వివిధ ఆహార ఉత్సవములలో కొద్దిగా పేరొందిన గజల్ గాయకుల కొరకు హార్మోనియం వాయించటం ప్రారంభించాడు. తరువాత అతనికి R.V. పండిట్ తో పరిచయం అయింది. ఈయనే అతనికి ఢిల్లీలోని తన CBS మ్యూజిక్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు.[2]

సంగీత దర్శకుడు[మార్చు]

విశాల్ భరద్వాజ్ తన స్నేహితుని సిఫారసుతో సినీ నిర్మాత గుల్జార్ కు పరిచయం చేయబడ్డాడు. అతను జంగిల్ బుక్, ఆలిస్ ఇన్ వండర్ ల్యాండ్ మరియు గుబ్బారే లాంటి TV ధారావాహికలకు అతనితో కలసి పనిచేశాడు. గుల్జార్ చే దర్శకత్వం వహించబడిన మాచిస్ చిత్రానికి విశాల్ సంగీతం సమకూర్చాడు.[6] విశాల్ మాచిస్కి అందించిన సంగీతము విమర్శకుల నుండి మరియు వ్యాపారపరంగా ప్రశంసలు పొందింది మరియు 1996లో R D బర్మన్ ఫిలింఫేర్ అవార్డును సాధించి పెట్టింది. అప్పటి నుండి విశాల్ సత్య, చాచి 420, ఓంకారా, కామినీ, ఇష్కియ వంటి హిందీ చిత్రాలకు మరియు అనేక ఇతర ప్రముఖ ప్రాజెక్టులకు సంగీతం అందించాడు.

దర్శకుడు[మార్చు]

విశాల్ భరద్వాజ్ సినిమాలకు సంగీతం సమకూర్చటం కోసం ముంబై వచ్చాడు. సంగీతం సమకూర్చే అవకాశాలు కల్పించుకోవటం కోసం మాత్రమే సినిమాలకు దర్శకత్వం వహించాడు[7]. కేరళలో[8] జరిగిన చిత్రోత్సవ సమయంలో పోలాండ్ దర్శకుడు Krzysztof Kieslowski యొక్క గతావలోకాన్ని చూచిన తరువాత అతనిలోని చిత్ర దర్శకత్వ అభిరుచి కాంక్ష రగులుకుంది. అతని దర్శకత్వంలో మొదటి చిత్రం అయిన మక్డీ బాలల చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. తరువాత మాక్బెత్ పై ఆధారపడిన మక్బూల్ అనే తన మొదటి షేక్ స్పియర్ అనువాదాన్ని చిత్రీకరించాడు. దీని తరువాత రస్కిన్ బాండ్ కథపై ఆదారపడి అదే పేరుతో ది బ్లూ అమ్బ్రెల్లా అనే బాలల చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రం కూడా చివరి వరకు విమర్శకుల ప్రశంసలు పొందుతూనే ఉంది. విశాల్ యొక్క షేక్ స్పియర్ పై రెండవ ప్రయత్నముగా గుర్తించబడిన ఓంకారా ఒథెల్లో యొక్క అనువాదము. ఓంకారా అంతర్జాతీయముగా ఒక గొప్ప విజయాన్ని మరియు సంగీత పరంగా విజయాన్ని సాధించి, సంగీత దర్శకునిగా అతని స్థాయిని సుస్థిరం చేసింది.

మాచిస్ చిత్రం నుండి తన అన్ని చిత్రాలకు విశాల్ నే సంగీతం సమకూర్చేటట్లు చేసిన గుల్జార్తో కలయిక ద్వారా అతను బాగా వెలుగులోకి వచ్చాడు. విశాల్ భరద్వాజ్ యొక్క అన్ని చిత్రాలకు గుల్జార్ పాటలను రచించేవాడు.

సినీదిగ్గజం ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల తరువాతి చిత్రం యూత్ వితౌట్ యూత్ చిత్రానికి రెండవ ప్రామాణిక పనిని కొంత వరకు నిర్వహించాడు.[9]

ఇటీవల అతని దర్శకత్వంలో విడుదలైన 11 నిముషాలు నిడివిగల బ్లడ్ బ్రదర్స్, HIV-AIDS పై అవగాహనకు, మీరా నాయర్ నిర్మిస్తున్న వరుస చిత్రాలలో ఒక భాగం.[10] గుల్లెర్మో నవర్రో ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు.ఇతను "నో స్మోకింగ్" చిత్రానికి సంగీత దర్శకత్వం కూడా వహించాడు.

షాహీద్ కపూర్ మరియు ప్రియాంకా చోప్రాలు నటించి 2009 ఆగస్టు 14న విడుదల అయిన కామినీ చిత్రం వ్యాపారపరంగా విజయాన్ని విమర్శలను ప్రశంసలను పొందింది.

నసీరుద్దిన్ షా, అర్షద్ వార్షి మరియు విద్యా బాలన్ నటించిన తరువాత విడుదలైన అతని చిత్రం ఇష్కియ (దర్శకునిగా కాకుండా నిర్మాత, రచయిత, మరియు కూర్పు సమకూర్చిన) మంచి ప్రశంసలు పొందింది మరియు విడుదలైన 2 వారాలలోనే 15 కోట్లు వసూలు చేసింది.

భవిష్యత్ ప్రాజెక్టులు[మార్చు]

ఐశ్వర్య రాయ్ ప్రధానపాత్రలో నటించే ఒక చిత్రం గురించి అతను ప్రకటించాడు.[11] హృతిక్ రోషన్ ముఖ్య పాత్రలో నటించే మరొక చిత్రాన్ని కుడా అతను ప్రకటించాడు.[12] అతను దక్షిణ భారత నటుడు మోహన్ లాల్ మరియు బాలివుడ్ నటుడు నసీరుద్దిన్ షాలతో సాత్ ఖూన్ మాఫ్ అనే సినిమాను నిర్మిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ చిత్రం ప్రియాంకా చోప్రా మరియు ఆమె ఏడుగురు భర్తల చుట్టూ తిరుగుతుంది. మోహన్ లాల్, నసీరుద్దిన్ షా, జాన్ అబ్రహం, చిన్న భర్తగా నీల్ నితిన్ ముకేష్ లతోపాటు ఇర్ఫాన్ ఖాన్, అను కపూర్ మరియు నసీరుద్దిన్ షా చిన్న కొడుకు వివాన్ షాలు ఏడుగురు భర్తలుగా ఎంపికవగా ఇంకా పేరు ప్రకటించని ఒక రష్యా నటుడిని 7వ భర్త పాత్ర కోసం ఎంపిక చేశారు.[13].

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం చలనచిత్రం పాత్ర గమనికలు
2011 సాత్ ఖూన్ మాఫ్ దర్శకుడు, సంగీత దర్శకుడు,
రచయిత (స్క్రీన్ ప్లే)
నిర్మాణం-అనంతరం
2010 ఇష్కియ సంగీత దర్శకుడు, రచయిత, నిర్మాత
2009 కామినీ సంగీత దర్శకుడు, దర్శకుడు,
రచయిత (సంభాషణలు & స్క్రీన్ ప్లే)
ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుని అవార్డుకు నామినేట్ చేయబడ్డాడు
ఫిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుని అవార్డుకు నామినేట్ చేయబడ్డాడు
స్టార్ స్క్రీన్ అవార్డు ఉత్తమ దర్శకుని కొరకు నామినేట్ చేయబడ్డాడు
స్టార్ స్క్రీన్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకుని కొరకు నామినేట్ చేయబడ్డాడు
2008 హాల్-ఎ-దిల్ సంగీత దర్శకుడు
యూ, మీ ఔర్ హమ్ సంగీత దర్శకుడు
2007 నో స్మోకింగ్ సంగీత దర్శకుడు, నిర్మాత
నిశబ్ద్ద్ సంగీత దర్శకుడు
దస్ కహానియాన్ రచయిత (సంభాషణలు & స్క్రీన్ ప్లే)
బ్లడ్ బ్రదర్స్ దర్శకుడు, రచయిత (సంభాషణలు)
మైగ్రేషన్ రచయిత (సంభాషణలు)
2006 ఓంకారా సంగీత దర్శకుడు, దర్శకుడు, రచయిత (సంభాషణలు & స్క్రీన్ ప్లే) విజేత, నేషనల్ ఫిలిం అవార్డు - స్పెషల్ జూరీ అవార్డు
ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ దర్శకుని కొరకు నామినేట్ చేయబడ్డాడు
విజేత, కైరో ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్, బెస్ట్ ఆర్టిస్టిక్ కంట్రిబూషణ్ ఇన్ సినిమా ఆఫ్ ఎ డైరెక్టర్
విజేత, కారా ఫిలిం ఫెస్టివల్, ఉత్తమ సంగీత దర్శకుడు
ఇంటర్ నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమి వారి ప్రఖ్యాత అవార్డులు ఉత్తమ మాటలు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే (పంచుకోనిన) &ఉత్తమ కథలకు నామినేట్ చేయబడ్డాడు
స్టార్ స్క్రీన్ అవార్డు ఓంకారాకి ఉత్తమ దర్శకునిగా నామినేట్ చేయబడ్డాడు
2005 ది బ్లూ అమ్బ్రెల్ల a.k.a చ్చత్రి చోర్ సంగీత దర్శకుడు, దర్శకుడు, నిర్మాత విజేత, నేషనల్ ఫిలిం అవార్డు ఉత్తమ బాలల చిత్రానికి గాను, రోన్నీ స్క్రేవ్వలతో కలసి పంచుకున్నాడు
రామ్జీ లండన్ వాలె సంగీత దర్శకుడు
భాగమతి సంగీత దర్శకుడు
2003 మక్బూల్ సంగీత దర్శకుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత (సంభాషణలు & స్క్రీన్ ప్లే) విజేత, ఇంటర్ నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమి వారి టెక్నికల్ ఎక్సెలెన్స్ అవార్డుకు గాను ఉత్తమ సంభాషణలు & ఉత్తమ స్క్రీన్ ప్లే (అబ్బాస్ త్య్రేవాల) తో పంచుకున్నాడు) [14]
బ్యాంకాక్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ కిన్నరీ అవార్డుకు ప్రతిపాదించబడింది
ఉత్తమ సంభాషణలు మరియు ఉత్తమ స్క్రీన్ ప్లే కొరకు, జీ సినీ సాంకేతిక అవార్డు విజేత
ఉత్తమ దర్శకుడు & ఉత్తమ కథకు జీ సినీ అవార్డుకు ప్రతిపాదించబడింది
పాంచ్ సంగీత దర్శకుడు
చుప్కే సే సంగీత దర్శకుడు
దానవ్ సంగీత దర్శకుడు
కగార్: లైఫ్ ఆన్ ది ఎడ్జ్ సంగీత దర్శకుడు
2002 మక్డీ సంగీత దర్శకుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత (కథ & సంభాషణలు) చికాగో బాలల చలనచిత్రోత్సవంలో 'సజీవ-నటనా చలన చిత్రం లేదా వీడియో' విభాగంలో, రెండవ స్థానంలో అడల్ట్స్ జ్యూరీ అవార్డు విజేత
ములాకాత్ సంగీత దర్శకుడు
2001 లవ్ కే లియే కుచ్ భి కరేగా సంగీత దర్శకుడు
చూ లేంగే ఆకాష్ సంగీత దర్శకుడు
2000 దిల్ పే మత్ లే యార్ సంగీత దర్శకుడు
1999 హు తు తు సంగీత దర్శకుడు
గాడ్ మదర్ సంగీత దర్శకుడు విజేత, నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ మ్యూజిక్ డైరక్షన్
జహాన్ తుమ్ లే ఛలో సంగీత దర్శకుడు
1998 దయ సంగీత దర్శకుడు మలయాళం చలనచిత్రం
చాచి 420 సంగీత దర్శకుడు
సత్య, సంగీత దర్శకుడు
శ్యామ్ ఘనశ్యామ్ సంగీత దర్శకుడు
1997 బేతాబి సంగీత దర్శకుడు
టున్ను కి టినా సంగీత దర్శకుడు
1996 మాచిస్ సంగీత దర్శకుడు విజేత, R D బర్మన్ అవార్డు ఫర్ న్యూ మ్యూజిక్ టాలెంట్
సంశోధన్ సంగీత దర్శకుడు
1995 ఫుజి సంగీత దర్శకుడు

సినియేతర సంగీతానికి[మార్చు]

  • ఇష్క్ ఇష్క్
  • బూదే పహదూన్ పర్

నేపధ్య గాయకుడు[మార్చు]

  • కామినీ - కామినీ
  • యూ, మీ ఔర్ హమ్ - యూ, మీ ఔర్ హమ్
  • నో స్మోకింగ్ - కాష్ లగా
  • ఓంకారా - ఓ సాతి రే

సూచనలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]