ఇషా డియోల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇషా డియోల్

ఇషా డియోల్, (జననం 2 నవంబరు 1982) ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్. ప్రసిద్ధ నటులు ధర్మేంద్రహేమా మాలినిల కుమార్తె ఆమె. 2002లో కోయీ మేరే దిల్ సే పూచే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె, ఆ చిత్రంలోని నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ పాత్రకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారంతో పాటు, ఎన్నో  ప్రతిష్టాత్మక అవార్డులు కూడా పొందారు ఆమె.[1]

ఇషా నటించిన ఎల్.ఒ.సి కార్గిల్(2003), యువ(2004), ధూమ్(2004), ఇన్సాన్(2005), కాల్(2005), మై ఐసా హై హూ(2005), దస్(2005), నో ఎంట్రీ(2005), షాదీ నెం.1(2005), కాష్(2007) వంటి సినిమాలు మంచి విజయవంతం కావడమే కాక, ఆమె నటనకు కూడా విమర్శకుల నుంచీ ప్రశంసలు లభించాయి. ఆ తరువాత  టెల్ మీ ఓ ఖుదా(2011) సినిమాతో మళ్ళీ సినిమాల్లొకి వచ్చారు ఆమె. 

అజయ్ దేవగణ్అక్షయ్ కుమార్సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్  స్టార్లతో నటించారు ఇషా.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ప్రముఖ నటులు ధర్మేంద్ర, హేమమాలినీల చిన్న కుమార్తె ఇషా. ఆమె చెల్లెలు అహానా డియోల్, అన్నలు బాబీ డియోల్, సన్నీ డియోల్, అక్కలు విజయ్తా, అజీతాలు తన తండ్రి ముందు భార్య పిల్లలు. ముంబైలోని మితిబాయ్ కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశారు ఇషా. ముంబైలో రబీంద్ర అతిబుద్ధీ దగ్గర ఒడిస్సీ నేర్చుకున్నారు ఆమె. అలాగే తన తల్లి హేమాతో కలసి భారతనాట్యం ప్రదర్శనలు కూడా ఇస్తారు.

కెరీర్[మార్చు]

వినయ్ శుక్లా దర్శకత్వంలో వచ్చిన కోయీ మేరే దిల్ సే పూచే(2002) తో తెరంగేట్రం చేశారు ఇషా. ఈ సినిమాలో అఫ్తాబ్ శివ్దసని హీరోగా నటించగా, సంజయ్ కపూర్, జయా బచ్చన్, అనుపమ్ ఖేర్ లు సహాయ పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు. ఆమె నటనకు కూడా మిశ్రమ స్పందనలు లభించాయి.[2][3] ఈ సినిమాలోని నటనకు ఇషా ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకోవడం విశేషం.[4]

జస్ట్ మ్యారీడ్ సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇషా.

వివాహం[మార్చు]

ఈషా డియోల్ 2012 ఫిబ్రవరి 7న భరత్ తఖ్తానీ ని వివాహం చేసుకుంది. వారికీ 2017లో కూతురు రాధ్య, 20179లో రెండో కూతురు మీరయా జన్మించింది. ఈషా డియోల్, భరత్ 2024లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.[5]

మూలాలు[మార్చు]

  1. "Filmfare Awards: Winners of 2002" Archived 2012-07-08 at Archive.today.
  2. Savera R Someshwar (11 January 2002).
  3. Rakesh Budhu.
  4. "2003 Filmfare Awards".
  5. TV9 Telugu (7 February 2024). "12 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పిన హీరోయిన్.. భర్తతో విడిపోయిన ఈషా డియోల్ ?." Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)