ధర్మేంద్ర
ధర్మేంద్ర | |
---|---|
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ | |
In office 13 మే 2005 – 16 మే 2009 | |
అంతకు ముందు వారు | రామేశ్వర్ లాల్ దూది |
తరువాత వారు | అర్జున్ రామ్ మేఘ్వాల్ |
నియోజకవర్గం | బికనీర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ధరమ్ సింగ్ డియోల్ 1935 డిసెంబరు 8 సహ్నేవాల్, పంజాబ్ ప్రావిన్స్ బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత పంజాబ్, ఇండియా) |
జాతీయత | బ్రిటీష్ ఇండియన్ (1935–1947) ఇండియన్ (1947–ప్రస్తుతం) |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి |
|
సంతానం | 6; (సన్నీ డియోల్, బాబీ డియోల్, ఇషా డియోల్ లతో సహా) |
కళాశాల | రామ్గర్హియా కళాశాల, ఫగ్వారా పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్ |
వృత్తి |
|
పురస్కారాలు | 2012లో పద్మ భూషణ్ |
సంతకం |
ధర్మేంద్ర (జననం 8 డిసెంబరు 1935)[1] ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. బాలీవుడ్ లో ఎక్కువ చిత్రాలు చేశారు ధర్మేంద్ర. హిందీ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.
ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటించిన ధర్మేంద్రను ఆయన అభిమానులు "యాక్షన్ కింగ్", "హీ-మ్యాన్" అని ముద్దుగా పిలుచుకుంటారు. షోలే (1975) చిత్రాన్ని ఆయన కెరీర్ లో పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు.
రాజస్థాన్ లోని బికనీర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు ఆయన. 2012లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.[2]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]పంజాబ్లోని లుధియానా జిల్లాలో ఉన్న నస్రలీ అనే గ్రామంలో కేవల్ కిషన్ సింగ్ డియోల్, సత్వంత్ కౌర్ దంపతులకు 8 డిసెంబరు 1935న జన్మించారు ధర్మేంద్ర. ఆయన పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్.[3][4][5] లుధియానాలోని పఖోవాల్ దగ్గర్లో గల డంగన్ అనే గ్రామంలో వారి పూర్వీకులుండేవారు.[6] ధర్మేంద్ర చిన్నతనంలో సహ్నేవాల్ అనే గ్రామంలో ఉండేవారు. లుధియానాలోని లాల్టన్ కలన్ గ్రామంలో ప్రభుత్వ సీనియర్ మాధ్యమిక పాఠశాలలో చదువుకున్నారు ఆయన. అక్కడే ఆయన తండ్రి కేవల్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు.[7] అతను 1952లో ఫగ్వారాలో రాంగర్హియా కళాశాలలో మెట్రిక్యులేట్ చేశాడు[8] .
ప్రస్థానం
[మార్చు]చలనచిత్ర ప్రస్థానం
[మార్చు]ఫిలింఫేర్ పత్రిక నిర్వహించిన న్యూ టాలెంట్ పురస్కారానికి ఎంపికైన ధర్మేంద్ర చిత్రాల్లో పని చేసేందుకు పంజాబ్ నుంచి ముంబై వచ్చేశారు. అర్జున్ హింగోరానీ దర్శకత్వం వహించిన దిల్ భీ తేరా హమ్ భీ తేరా అనే చిత్రంతో 1960లో తెరంగేట్రం చేశారు ధర్మేంద్ర.[9][10] 1961లో విడుదలైన బాయ్ ఫ్రెండ్ చిత్రంలో సహాయ నటునిగా నటించారు ఆయన. 1960-67 మధ్య ఆయన నటించిన చిత్రాలతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. నూతన్ తీసిన సూరత్ ఔర్ సీరత్(1962), బాందినీ(1963), దిల్ నే ఫిర్ యాద్ కియా(1966), దుల్హన్ ఏక్ రాత్ కీ(1967), అన్పధ్(1962), పూజా కే ఫూల్(1964), బెహ్రన్ ఫిర్ భీ ఆయేంగే, ఆయే మిలన్ కి బేలా(1964), మై భీ లడ్కీ హూ(1964), కాజల్(1965), పూర్ణిమా(1965), ఫూల్ ఔర్ పత్తర్(1966) వంటి చిత్రాల్లో సహాయ నటునిగా నటించారు ఆయన. ఫూల్ ఔర్ పత్తర్(1966) చిత్రంలో మొదటిసారిగా సోలో హీరోగా చేశారు ధర్మేంద్ర. 1971లో ఆయన నటించిన మేరా గోయన్ మేరా దేశ్ చిత్రంతో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. 1966 సంవత్సరానికి గానూ ఫూల్ ఔర్ పత్తర్ చిత్రం అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి అభ్యర్థిత్వాన్ని కూడా పొందారు ఆయన.[11] అనుపమ సినిమాలోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ధర్మేంద్ర.[12] ఒక పక్కన రొమాంటిక్ పాత్రల్లో చేస్తూనే యాక్షన్ సినిమాల్లో నటించడంతో 1975 నాటికి వైవిధ్యభరితమైన కథానాయకునిగా పేరు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. వాటితో పాటుతుమ్ హసీన్మే జవాన్, దో చోర్, చుప్కే చుప్కే, దిల్లగీ, నౌకర్ బీవీ కా వంటి హాస్యరసప్రదానమైన చిత్రాల్లో నటించిప్రేక్షకుల్నీ, విమర్శకుల్నీ మెప్పించారు ఆయన. నటి హేమా మాలిని, ధర్మేంద్ర అప్పట్లో విజయవంతమైన జంటగా ఉండేవారు. వారు కలసి చేసిన చిత్రాలు చాలావరకు విజయం సాధించేవి. ఆ తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు కూడా.[9] రాజా జానీ, సీతా ఔర్ గీతా, షరఫత్, నయా జమానా, పత్తర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, జగ్ను, దొస్త్, చరస్, మా, చాచా భటిజా, ఆజాద్, షోలే వంటి చిత్రాల్లో జంటగా నటించారు వీరిద్దరూ. హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మేంద్ర నటించిన సత్యకం చిత్రానికి కూడా ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.[13] తరువాత నటించిన షోలే సినిమా ఇండియా టైమ్స్ "25 తప్పక చూడాల్సిన బాలీవుడ్ చిత్రాల" జాబితాలో పేర్కొంది.[14] 2005లో 50వ ఫిలింఫేర్ పురస్కారాలలో షోలే చిత్రానికి మొత్తం 50 ఏళ్ళకూ ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం పురస్కారం వచ్చింది.
1976-84 మధ్య ధరమ్ వీర్, చరస్, ఆజాద్, కటిలన్ కే కాటిల్, గజబ్, రాజ్ పుత్, భగవత్, జానీ దోస్త్, ధరమ్ ఔర్ కానూన్, మై ఇంతెకం లూంగా, జానే నహీ దూంగా, హుకుమత్, రాజ్ తిలక్ వంటి యాక్షన్ సినిమాల్లో నటించిన ఆయన యాక్షన్ హీరోగా ప్రసిద్ధి చెందారు. 1986లోమొహొబ్బత్ కీ కసమ్ చిత్రంలో అతిథి పాత్రలో కూడా కనిపించారు ధర్మేంద్ర.[15]
ఆయన ఎంతమంది దర్శకులతో చేసినా, అన్నీ వేటికవే వైవిధ్యభరితంగా ఉండటం విశేషం.[16] 1960-91 వరకు దర్శకుడు అర్జున్ హింగోరానీ దర్శకత్వంలో ఎన్నో చిత్రాల్లో నటించారు ఆయన. కబ్? క్యూ? ఔర్ కహా?, కహానీ కిస్మత్ కీ, ఖేల్ ఖిలారీ కా, కటిలన్ కే కాటిల్, కౌన్ కరే కుర్బానే, సుల్తనట్, కరిష్మా కుద్రత్ కా వంటి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చినవే. కౌన్ కరే కుర్బానే, సుల్తనట్ సినిమాలకు అర్జున్ నిర్మాత కూడా. దర్శకుడు ప్రమోద్ చక్రవర్తీ దర్శకత్వంలో నయా జమానా, డ్రీం గర్ల్, అజాద్, జగ్ను వంటి చిత్రాల్లో నటించారు ధర్మేంద్ర. యాకీన్(1969) చిత్రంలో హీరో, విలన్ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు ఆయన. దీనితో పాటు సమాధీ(1972), గజబ్(1982), చిత్రాల్లో కూడా ద్విపాత్రాభినయం చేశారు ధర్మేంద్ర. జీరో షాన్ సే(1997) చిత్రంలో త్రిపాత్రాభినయం కూడా చేశారాయన.
కపూర్ కుటుంబంలో పృథ్విరాజ్, కరీనా కపూర్ తప్ప మిగతా అందరు నటులతో ధర్మేంద్ర నటించారు. ఆయన మాతృభాష పంజాబీలోనూ నటించారు ఆయన. కంకణ్ దే ఒలే (అతిథి పాత్ర) (1970), దో షేర్(1974), దుఖ్ బంజన్ తేరా నామ్(1974), కుర్బానీ జట్ దీ(1990) వంటి పంజాబి చిత్రాల్లో నటించారు ధర్మేంద్ర. 1980 నుండి 1990 వరకు కథానాయక, సహానటుడు పాత్రల్లోనూ నటించారు ఆయన. 1997లో ఆయనకు ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చి గౌరవించింది. దిలీప్ కుమార్, ఆమె భార్య సైరా భాను నుంచీ ఈ పురస్కారం అందుకుంటూ ధర్మేంద్ర ఉద్వేగానికి లోనయ్యారు. "దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించాను. అందులో దాదాపు అన్నీ విజయవంతమయ్యాయి. అయినా ఒక్కసారీ ఫిలింఫేర్ పురస్కారం రాలేదు. కానీ ఈ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది" అని స్పందించారాయన.[17] అదే సందర్భంలో దిలీప్ కుమార్ మాట్లాడుతూ "నన్ను ధర్మేంద్ర అంత అందంగా ఎందుకు పుట్టించలేదు అని నేను దేవుణ్ణి ఎప్పుడూ అడుగుతూంటా"నని అన్నారు.[18]
ధర్మేంద్ర తనయులిద్దరు - సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తె ఇషా డియోల్ కూడా హిందీ చలనచిత్ర నటులే.
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "14th Lok Sabha Members Bioprofile" Archived 2013-12-13 at the Wayback Machine.
- ↑ "Padma Awards". pib. 27 January 2013.
- ↑ "Watch In Conversation with The Deols". 13 November 2012.
- ↑ "thedeols" Archived 2011-06-06 at the Wayback Machine.
- ↑ Sumbly, Vimal (4 January 2002).
- ↑ "Dharmendra nostalgic on visiting Dangon".
- ↑ Sumbly, Vimal (2 May 2004).
- ↑ https://ceorajasthan.nic.in/Affidavits_pc/2/DEOL%20DHARMENDRA%20KEWAL%20KRISHAN/DEOL%20DHARMENDRA%20KEWAL%20KRISHAN_SC5.html
- ↑ 9.0 9.1 "Dharmendra - Action King: Romantic hero".
- ↑ Ranjana Das Gupta (4 November 2010).
- ↑ "Dharmendra charms the Big Apple".
- ↑ "Hema Malini 35th marriage anniversary" (Post.jagran.com).
- ↑ Dinesh Raheja.
- ↑ Kanwar, Rachna (3 October 2005). "25 Must See Bollywood Movies" Archived 2007-10-15 at the Wayback Machine.
- ↑ "That's Entertainment".
- ↑ "Dharmendra - Action King: Comic leanings".
- ↑ "The real stars of Bollywood".
- ↑ "I was the Salman Khan of my days: Dharmendra".
- All articles with unsourced statements
- Articles with unsourced statements from August 2016
- Articles with unsourced statements from August 2015
- All articles with specifically marked weasel-worded phrases
- Articles with specifically marked weasel-worded phrases from September 2014
- 14వ లోక్సభ సభ్యులు
- 1935 జననాలు
- భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు
- జీవిస్తున్న ప్రజలు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు