సన్నీ డియోల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సన్నీ డియోల్
సన్నీ డియోల్

2019 లో డియోల్


పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
18 జూన్ 2019
ముందు సునీల్ కుమార్ జక్కర్
నియోజకవర్గం గురుదాస్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-10-19) 1956 అక్టోబరు 19 (వయసు 67) [1]
సహ్నేవాల్, తూర్పు పంజాబ్, భారతదేశం (ప్రస్తుతం పంజాబ్ )[2]
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు ధర్మేంద్ర (తండ్రి)
ప్రకాష్ కౌర్ (తల్లి)
హేమా మాలిని (సవతి తల్లి)
జీవిత భాగస్వామి
లిండా డియోల్ (ఆకా పూజా డియోల్)
(m. 1984)
సంతానం 2
నివాసం ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి నటుడు, సినిమా దర్శకుడు, సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు

అజయ్‌ సింగ్ డియోల్ (జననం 1956 అక్టోబరు 19[1]) సన్నీ డియోల్ గా సుపరిచితుడు. అతను భారతీయ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. ప్రస్తుతం అతను పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ (లోక్‌సభ నియోజకవర్గం) నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా గెలుపొందాడు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. అతను హిందీ సినిమా ధర్మేంద్ర కుమారుడు. అతను హీరో బాబీ డియోల్, నటి ఇషా డియోల్ ల సోదరుడు. 25 ఏళ్ళ కెరీర్ లో రెండు జాతీయ పురస్కారాలు, రెండు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నాడు.

డియోల్ తొలిసారిగా తనతో పాటు అరంగేట్రం చేసిన అమృత సింగ్ సరసన బేతాబ్ (1982) చిత్రంలో నటించడం ద్వారా తెరంతేట్రం చేసాడు. ఆ సినిమాలోని నటనకుగానూ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ లభించింది[3]. తదనంతరం, అతను 1980, 1990 లలో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించాడు. ఆ సమయంలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకనిగా గుర్తించబడ్డాడు. 1990 లో రాజ్‌కుమార్ సంతోషి నిర్మించిన గయాల్‌ చిత్రంలో తన సోదరుడి హత్యపై తప్పుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఔత్సాహిక బాక్సర్ పాత్రతో డియోల్ విస్తృత గుర్తింపు, ప్రశంసలను పొందాడు. ఆ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును, జాతీయ చలనచిత్ర పురస్కారం - స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు[4].[5] డామిని - లైట్‌నింగ్ (1993) చిత్రంలో ఆయన న్యాయవాది పాత్ర పోషించడం వల్ల అతనికి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం, ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. అనిల్ శర్మ నిర్మించిన గదర్: ఏక్ ప్రేమ్ కథ (2001) లో అతను ముస్లిం అమ్మాయిని ప్రేమలో పడేసే లారీ డ్రైవర్‌గా నటించాడు, ఇది విడుదలైన సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రం. ఈ చిత్రంలో నటనకి అతనికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు ప్రతిపాదనను వచ్చింది.[6][7][8]

ప్రారంభ జీవితం

[మార్చు]

అతను జాత్ కుటుంబానికి చెందిన బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్ దంపతులకు పంబాబ్ లోని సహ్నెవాల్ గ్రామంలో 1956 అక్టోబరు 19న జన్మించాడు.[9] అతనికి తమ్ముడు బాబీ డియోల్, ఇద్దరు సోదరీమణులు వైజైత, అజీతా ఉన్నారు.[10] అతని సవతి తల్లి బాలీవుడ్ నటి హేమా మాలిని.[11] అతనికి తండ్రి తరపున సోదరీమణులు ఈషా డియోల్, అహాన డియోల్ ఉన్నారు. అతని కజిన్ అభయ్ డియోల్ కూడా సినిమా నటుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

1983 లో రొమాంటిక్ చిత్రం బేతాబ్‌లో డియోల్ తొలిసారిగా తెరంగేట్రం చేసి నటనకు గాను ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రం ద్వారా ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. డియోల్ రాహుల్ రావైల్ నిర్మించిన అర్జున్ (1985) లో కనిపించాడు, దీనిలో అతను నిరుద్యోగ యువకుడి పాత్రను పోషించాడు. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. దీని ద్వారా అతనిని యాక్షన్ హీరో హోదా వచ్చింది. 1986 లో అతను తన తండ్రితో కలిసి సుల్తానత్ సినిమా‌లో నటిమాడు. దశాబ్దం చివరి సంవత్సరాల్లో అతను అనేక విజయవంతమైన సినిమాలైన డకైత్ (1987), యతీమ్ (1988), పాప్ కి దునియా (1988) లలో నటించాడు.[12] 1989 లో అతను హిట్ సినిమాలైన రాజీవ్ రాయ్ నిర్మించిన చిత్రాలు త్రిదేవ్, పంకజ్ పరాషర్ నిర్మించిన చాల్బాజ్ లలో నటించాడు. రాజ్‌కుమార్ సంతోషి నిర్మించిన 1990 చిత్రం ఘాయల్ లో ఉత్తమ నటుడిగా తన మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అతను విష్ణు-దేవా (1991) లో ఆదిత్య పంచోలితో కలసి నటించాడు. 1992-1997 వరకు అతను లూటెరే, డర్, జీత్, ఘటక్, బోర్డర్, జిడ్డీ వంటి చిత్రాలతో నటించాడు 1999 లో అతను, తన సోదరుడు, ఊర్మిలా మాటోండ్కర్ లు కలసి నటించిన దిల్లాగి సినిమాకు దర్శకత్వం వహించాడు.

మిలీనియంలో అతని మొదటి హిట్ సినిమా అనిల్ శర్మ 2001లో నిర్మించిన చిత్రం గదర్. 2003 లో దర్శకుడు అనిల్ శర్మతో కలిసి ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రీతి జింతా, ప్రియాంక చోప్రా కూడా నటించారు[13]. ఏప్రిల్ 11 న విడుదలైన చిత్రం ది హీరో ఆ సమయంలో బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన చిత్రంగా 600 మిలియన్ (యు .6) బడ్జెట్‌తో చేయబడింది.[14] ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ చిత్రంగా నిలిచింది. సన్నీ తన తండ్రి ధర్మేంద్ర, బాబీ డియోల్‌లతో కలిసి మొదటిసారి అప్నే (2007) సినిమాలో నటించాడు.[15]

డియోల్ 2010లో మొట్టమొదటి విడుదలైన చిత్రం నీరజ్ పాథక్ నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా రైట్ యా రాంగ్. ఈ చిత్రంలో అతను పోలీసు ఇనస్పెక్టర్ పాత్ర పోషించాడు.[16] యమలా పాగ్లా దీవానా చిత్రంలో అతని తండ్రి, సోదరుడితో కలిసి నటించాడు. ఇది 2011 లో సన్నీ విడుదల చేసిన ఏకైక చిత్రం. ఈ సంవత్సరంలో అతిపెద్ద విజయాలలో ఒకటి.[17][18][19] 2011 లో రాధిక రావు, వినయ్ సప్రూ నిర్మించిన ఐ లవ్ ఎన్ వై చిత్రంలో కంగనా రనౌత్ సరసన, చంద్రప్రకాష్ ద్వివేది నిర్మించిన మొహల్లా అస్సీ చిత్రంలో సాక్షి తన్వర్ సరసన నటించాడు. కాని కొన్ని కారణాల వల్ల రెండు సినిమాలు ఆలస్యం అయి చాలా సంవత్సరాల తరువాత విడుదలయ్యాయి.

తన కెరీర్‌లో తొలిసారిగా సన్నీ యానిమేటెడ్ చిత్రం మహాభారతంలో తన స్వరాన్ని (భీమ్ కోసం) ఇచ్చాడు; ఈ చిత్రాన్ని పెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన జయంతి లాల్ గడా నిర్మించాడు.[20] ఇది US $ 6.7 మిలియన్లు సంపాదించగా, యమలా పాగ్లా దీవానా US $ 14 మిలియన్లు సంపాదించింది. అతని 2011 లో అతని చిత్రం యమలా పాగ్లా దీవానా 2 2013 లో విడుదలైంది. అయితే ఈ చిత్రం ప్రతికూల విమర్శలతో, బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.

2016 లో ఘాయల్ వన్స్ ఎగైన్ విడుదలైంది, ఇది అతని 1990 చిత్రం అతను దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఘయల్ కు కొనసాగింపు. 2017 లో అతను, అతని సోదరుడు శ్రేయాస్ తల్పాడే నిర్మించిన కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్లో కనిపించారు. ఇది బాక్సాఫీస్ వద్ద సెమీ హిట్ అయింది.[21]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సన్నీ డియోల్ లిండా డియోల్ (అకా పూజా డియోల్) ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కరణ్, రాజ్‌వీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కరణ్ యమలా పాగ్లా దీవానా 2లో అసిస్టెంట్ డైరెక్టర్.[22] కరణ్ డియోల్ హిందీ భాషా చలన చిత్రం పాల్ పాల్ దిల్ కే పాస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.[23]

రాజకీయ జీవితం

[మార్చు]

2019 ఏప్రిల్ 23 న డియోల్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్టీలో చేరాడు.[24] గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన సునీల్ జఖర్‌పై 82,459 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.[25][26]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "I have never bothered about my age: Sunny Deol". 14 January 2016. Retrieved 14 January 2016. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "telegraph" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "In my 30-year career, I have spent five years in bed due to my backache: SDeol". The Times Of India. Retrieved 11 February 2013.
  3. "The Nominations – 1982". filmfareawards.indiatimes.com. Archived from the original on 8 July 2012. Retrieved 15 December 2011.
  4. "The Winners – 1990". filmfareawards.indiatimes.com. Archived from the original on 10 July 2012. Retrieved 15 December 2011.
  5. "Ghayal". Retrieved 28 June 2011.
  6. "Box Office India". Retrieved 28 June 2011.
  7. "Box Officex". Archived from the original on 14 October 2013. Retrieved 28 June 2011.
  8. "The Nominations – 2001". www.filmfareawards.indiatimes.com. Archived from the original on 8 July 2012. Retrieved 15 December 2011.
  9. "The Deols". vijaytafilms. Archived from the original on 6 జూన్ 2011. Retrieved 6 జూన్ 2020.
  10. "Sunny Deol pawan". starboxoffice. Archived from the original on 23 ఏప్రిల్ 2011. Retrieved 6 జూన్ 2020.
  11. "He's like my teddy bear". hindustantimes. Archived from the original on 25 January 2013. Retrieved 13 July 2011.
  12. "Box Office 1988". Box Office India. Archived from the original on 31 జనవరి 2009. Retrieved 6 జూన్ 2020.
  13. "third highest grosser". Box Office India. Archived from the original on 25 మే 2012. Retrieved 6 జూన్ 2020.
  14. "The Hero stunt most exacting, says Sunny Deol". Times of India. 17 March 2003. Archived from the original on 1 జూలై 2012. Retrieved 14 December 2011.
  15. "Apne". Times of India. 1 January 2011. Archived from the original on 8 July 2012. Retrieved 29 June 2011.
  16. "Right Ya Wrong is the surprise of the year". The Times of India. Archived from the original on 2013-12-25. Retrieved 22 March 2012.
  17. "Hits 2011". Box Office India. Archived from the original on 27 డిసెంబరు 2012. Retrieved 26 July 2011.
  18. "Top Grossers 2010–2011 OVERSEAS". Boxofficeindia.Com. Retrieved 30 June 2011.
  19. "Top Hits". Archived from the original on 4 జూన్ 2013. Retrieved 6 జూన్ 2020.
  20. "Yamla Pagla Deewana 2 Review". The Times Of India.
  21. "Poster Boys Is Struggling To Survive At The Box Office". Koimoi (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-09-14. Retrieved 2018-01-14.
  22. "Sunny Deol's son turns assistant director, wife writer for Yamla Pagla Deewana 2 - Indian Express". archive.indianexpress.com. Retrieved 2020-05-11.
  23. Pal Pal Dil Ke Paas Movie Review: Highs and lows of love, retrieved 2020-05-11
  24. PTI (23 April 2019). "Bollywood actor Sunny Deol joins BJP". Times of India. Retrieved 27 March 2019.[permanent dead link]
  25. "From Sunny Deol to Urmila Matondkar, here's how star candidates fared in Lok Sabha Polls". News Nation (in ఇంగ్లీష్). 2019-05-24. Archived from the original on 2019-05-24. Retrieved 2019-05-24.
  26. "Actor Sunny Deol wins the Lok Sabha Elections 2019 by 82,459 votes - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-05-24.

బాహ్య లంకెలు

[మార్చు]