బాబీ డియోల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాబీ డియోల్
2017లో బాబీ డియోల్
జననం
విజయ్ సింగ్ డియోల్

(1969-01-27) 1969 జనవరి 27 (వయసు 55)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1995–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
తాన్యా అహుజా డియోల్
(m. 1996)
పిల్లలు2
తల్లిదండ్రులు
బంధువులుసన్నీ డియోల్ (సోదరుడు), వైజైత (సోదరి), అజీతా (సోదరి)

విజయ్ సింగ్ డియోల్ (జననం 1969 జనవరి 27), బాలీవుడ్‌లో బాబీ డియోల్ అని పిలిచే ఆయన భారతీయ నటుడు. ఆయన నటుడు ధర్మేంద్ర చిన్న కుమారుడు.[1][2]

ధరమ్ వీర్ (1977)లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన తర్వాత, డియోల్ బర్సాత్ (1995)లో తన మొదటి ప్రధాన పాత్రను పోషించాడు. ఇది అతనికి ఉత్తమ పురుష తొలి అరంగేట్రం కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. గుప్త్ (1997), సోల్జర్ (1998), బాదల్ (2000), బిచ్చూ (2000), అజ్ఞాతవాసి (2001), హుమ్‌రాజ్ (2002)లతో సహా వాణిజ్యపరంగా విజయవంతమైన యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలతో ఆయన ప్రసిద్ధి చెందాడు. హుమ్‌రాజ్ సినిమాకుగాను ఆయన ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్‌కు నామినేట్ చేయబడ్డాడు.

అప్నే (2007), యమ్లా పగ్లా దీవానా (2011), రేస్ 3 (2018), హౌస్‌ఫుల్ 4 (2019) వింటి విజయవంతమైన చిత్రాలలోనూ ఆయన నటించాడు. అలాగే, ఆయన స్ట్రీమింగ్ వెంచర్స్ క్లాస్ ఆఫ్ '83 (2020), లవ్ హాస్టల్ (2022), వెబ్ సీరీస్ ఆశ్రమ్ (2020–ప్రస్తుతం)లలో నటించాడు.

2023లో అత్యధిక వసూళ్లు రాబట్టిన యాక్షన్ చిత్రం యానిమల్ (2023)లో ఆయన సహాయక పాత్రను పోషించాడు.[3]

ప్రారంభ జీవితం[మార్చు]

ఆయన 1969 జనవరి 27న బొంబాయిలోని పంజాబీ కుటుంబంలో విజయ్ సింగ్ డియోల్ గా జన్మించాడు.[4] ఆయన బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్‌ల రెండవ కుమారుడు. ఆయనకు బాలీవుడ్ కే చెందిన అన్న సన్నీ డియోల్, కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఇద్దరు సోదరీమణులు విజయతా, అజీత ఉన్నారు.

అతని సవతి తల్లి హేమ మాలిని,[5] ఆమె ద్వారా అతనికి ఇద్దరు తండ్రి తరపు సోదరీమణులు, నటి ఈషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు.[6] అతని బంధువు అభయ్ డియోల్ కూడా నటుడు.[7] అతను కరణ్ డియోల్, రాజ్‌వీర్ డియోల్‌లకు అంకుల్.[8]

కెరీర్[మార్చు]

ధరమ్ వీర్ (1977)లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆయన కెరీర్ మొదలుపెట్టాడు. బ్లాక్‌బస్టర్ రొమాన్స్ మూవీ బర్సాత్ (1995)లో తన మొదటి ప్రధాన పాత్రను పోషించాడు. దీనికి ఆయనకు ఉత్తమ పురుష అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. అతను గుప్త్ (1997), సోల్జర్ (1998), బాదల్ (2000), బిచ్చూ (2000), అజ్ఞాతవాసి (2001), హుమ్రాజ్ (2002) చిత్రాలతో అగ్రగామిగా నిలిచాడు. దాని తర్వాత కొంచం కెరీర్ తిరోగమనంలో పడింది. ఆయినా, అప్నే (2007), యమ్లా పగ్లా దీవానా (2011), రేస్ 3 (2018), హౌస్‌ఫుల్ 4 (2019) వంటి మల్టీ స్టారర్లలో చేసాడు. డిజిటల్ వెంచర్స్ క్లాస్ ఆఫ్ '83 (2020), లవ్ హాస్టల్ (2022), ఆశ్రమ్ (2020–ప్రస్తుతం)లలో ప్రశంసలు పొందిన పాత్రలతో ఆయన కొరీర్ కొనసాగుతోంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

బాబీ డియోల్ 1996లో తాన్యా అహుజాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.[9]

మూలాలు[మార్చు]

  1. "I wish I get very busy with work this year: Bobby Deol". Daily News and Analysis. Archived from the original on 30 January 2017. Retrieved 28 January 2017.
  2. "Dharmendra to have fun with his sons again". Entertainment One India. 10 February 2010. Archived from the original on 12 December 2013. Retrieved 11 March 2010.
  3. "Jamal Kudu: Bobby Deol's entry in Animal is a new rage, know about its origin and more | Bollywood News – India TV". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 2023-12-10. Retrieved 2023-12-11.
  4. "Bobby Deol (Talent), Mumbai, India". Modelspoint.com. 11 January 2016. Archived from the original on 11 January 2016. Retrieved 2 August 2023.
  5. "He's like my teddy bear". Hindustan Times. Archived from the original on 25 January 2013. Retrieved 13 July 2011.
  6. "Sunny Deol pawan". starboxoffice. Archived from the original on 23 April 2011. Retrieved 13 July 2011.
  7. "Abhay Deol". Entertainment One India. Archived from the original on 8 July 2012. Retrieved 11 March 2010.
  8. "Rajveer Deol says Karan Deol's wife Drisha Acharya brought good fortune to the family: 'All of us at home believe that'". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-10-01. Retrieved 2023-12-04.
  9. "Meet Bobby Deol's lesser-known wife Tanya Deol, who is as beautiful as a Bollywood star, her millionaire father was..." DNA India. Retrieved 6 July 2023.