కపూర్ కుటుంబం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కపూర్ కుటుంబం  బాలీవుడ్ లో ప్రముఖ కుటుంబం. ఈ వంశానికి చెందిన చాలా మంది ప్రస్తుతం హిందీ సినీ రంగంలో ప్రఖ్యాత నటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. పాకిస్థానీ పంజాబ్ లోని సంముంద్రి పట్టణానికి చెందినది ఈ కుటుంబం. పాకిస్థాన్ లోని ఖ్యాబెర్ పఖ్తున్ఖ్వా, పేష్వార్ ప్రాంతాల్లో ఈ కుటుంబానికి "కపూర్ హవేలీ" అనే వంశపారంపర్య భవనం ఉంది. ముంబైలో కపూర్ కుటుంబానికి పార్వతి థియేటర్, ఆర్.కె.స్టుడియోలు కూడా ఉన్నాయి.

నేపథ్యం

[మార్చు]

కపూర్ కుటుంబం పంజాబీ హిందూ మూలానికి చెందిన కుటుంబం.[1][2][3] పృథ్వీరాజ్ కపూర్ ఈ కుటుంబం నుంచి మొట్టమొదటి సినిమా నటుడు. పాకిస్థానీ పంజాబ్ లోని సముంద్రి పట్టణంలో 1906లో జన్మించారు పృథ్వీరాజ్.[4][5] ఈయన తండ్రి బసవేశ్వరనాథ్ కపూర్ పేష్వార్ లో భారత ఇంపీరియల్ పోలీస్ శాఖలో పోలీసు అధికారిగా పనిచేశారు.[6] పృథ్వీరాజ్ తాత సముంద్రి పట్టణానికి తహశీల్దారుగా వ్యవహరించేవారు.[7] 1929లో సినిమా గర్ల్ అనే సినిమాలో హీరోగా మొట్టమొదటిసారి కనిపించారు.

పృథ్వీరాజ్ ముగ్గురు కుమారులు రాజ్ కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్ లు నటులే. భారతీయ సినిమా చరిత్రలో రాజ్ కపూర్ ను "ది గ్రేటెస్ట్ షోమాన్"గా అభివర్ణిస్తారు.[8][9] రాజ్ కపూర్ బాలీవుడ్ లో ప్రసిద్ధ నటుడే గాక, నిర్మాత, దర్శకునిగా కూడా మంచి కృషి చేశారు.[10] 

రాజ్ కపూర్ కుమారులు రణధీర్ కపూర్, రిషి కపూర్ లు బాలీవుడ్ లో మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకోగా, చిన్న కుమారుడు రాజీవ్ కపూర్ మాత్రం అంతగా రాణించలేదు. శశి కపూర్ కుమార్తె సంజన కపూర్ కూడా నటిగా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. కానీ ఆమె చాలా తక్కువ సినిమాల్లో నటించారు.

రణధీర్ కపూర్ నటి బబితాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కరిష్మా కపూర్, కరీనా కపూర్. ఇద్దరు బాలీవుడ్ లో బాగా  రాణించినవారే. అయితే కరీనా మాత్రం ఇప్పటికి టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రిషి కపూర్ నటి నీతూ సింగ్ ను వివాహం చేసుకున్నారు. రణబీర్ కపూర్ వీరి కుమారుడే. బాలీవుడ్ లో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా రాణిస్తున్నారు రణబీర్.

రాజకపూర్ కూతురు రితుకపూర్, రంజన్ నందల కుమారుడు నిఖిల్ నంద- అమితాబ్ బచ్చన్జయ బచ్చన్ ల కుమార్తె శ్వేత బచ్చన్ ను  వివాహం చేసుకున్నారు.[11][12]

కపూర్ కుటుంబంలోని ప్రముఖులు

[మార్చు]

మొదటి తరం

[మార్చు]
 • పృథ్వీరాజ్ కపూర్- బాలీవుడ్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి  కపూర్ వంశస్థుడు. 
 • త్రిలోక్ కపూర్[13]– బసవేశ్వరనాథ్ కపూర్ రెండో కుమారుడు

రెండో తరం

[మార్చు]
 • రాజ్ కపూర్–పృథ్వీరాజ్ పెద్ద కొడుకు, బాలీవుడ్ లో పెద్ద నటుడు. నటుడు ప్రేం నాథ్ చెల్లెలు కృష్ణ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు.
 • షమ్మీ కపూర్– పృథ్వీరాజ్ రెండో కొడుకు, గీతా బాలీ, నీలా దేవిలు ఈయన ఇద్దరు భార్యలు
 • శశి కపూర్ – పృథ్వీరాజ్ ఆఖరి కొడుకు, జెన్నిఫర్ కెండల్ ను పెళ్ళి చేసుకున్నారు.
 • జగ్గల్ కిషోర్ మెహ్రా- రాజ్, షమ్మీ, శశిలు, కిశోర్ అన్నదమ్ముల బిడ్డలు[14]

మూడో తరం

[మార్చు]
 • రణధీర్ కపూర్– రాజ్ కపూర్ పెద్ద కొడుకు, నటి బబితను పెళ్ళి చేసుకున్నారు.
 • రీతు నందా– రాజ్ కపూర్ పెద్ద కుమార్తె, రాజన్ నందను వివాహం చేసుకున్నారు ఈమె.
 • రీమా కపూర్ జైన్– రాజ్ కపూర్ రెండో కూతురు. మనోజ్ జైన్ ను పెళ్ళి చేసుకున్నారు.
 • రిషి కపూర్ – రాజ్ కపూర్ రెండో కొడుకు, నీతూ సింగ్ కపూర్ ను వివాహం చేసుకున్నారు రిషి.
 • రాజీవ్ కపూర్ –రాజ్ కపూర్ చిన్న కొడుకు.
 • ఆదిత్య రాజ్ కపూర్–షమ్మి కపూర్, గీతా బాలీల ఏకైక కుమారుడు.
 • కరణ్ కపూర్ – శశి కపూర్ జెన్నిఫర్ కెండల్ ల పెద్ద కుమారుడు.
 • కునాల్ కపూర్– శశి కపూర్ చిన్న కుమారుడు.
 • సంజన కపూర్ – శశి కుమార్తె. బాలీవుడ్ లో ప్రముఖ నటి. ఈమె వల్మీక్ థాపర్ ను వివాహం చేసుకున్నారు.

నాలుగో తరం

[మార్చు]
 • కరిష్మా కపూర్ — రణధీర్ కపూర్, బబితల పెద్ద కుమార్తె. వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ను పెళ్ళి చేసుకున్నారు ఆమె.
 • కరీనా కపూర్ — రణధీర్ కపూర్ చిన్న కుమార్తె ఈమె. నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్నారు.
 • రిద్ధిమ కపూర్ సహానీ - రిషి కపూర్, నీతు సింగ్ కపూర్ ల కుమార్తె.
 • రణబీర్ కపూర్— రిషికపూర్ కుమారుడు.
 • నిఖిల్ నంద — రీతు నంద, రాజన్ నంద కుమారుడు. అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేత బచ్చన్ కుమార్తెను పెళ్ళి చేసుకున్నారు.
 • అర్మన్ జైన్ — రీమా జైన్, మనోజ్ జైన్ ల కొడుకు. లేకర్ హం దీవానా దిల్ అనే సినిమాతో తెరంగేట్రం చేశారు.[15]
 • శివాని కపూర్ - కరిష్మా, కరీనాల కజిన్[16]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; guardian అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. Bengali Cinema: 'An Other Nation' by Sharmistha Gooptu
 3. "Fashion Cultures: Theories, Explorations, and Analysis edited by Stella Bruzzi, Pamela Church". Archived from the original on 2014-10-21. Retrieved 2016-07-19.
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-05. Retrieved 2016-07-19.
 5. "Prithviraj Kapoor (Indian actor) - Encyclopedia Britannica". Britannica.com. 2013-02-04. Retrieved 2014-07-13.
 6. "Untitled Document". Archived from the original on 2009-05-05. Retrieved 2016-07-19.
 7. rediff.com: Bollywood's First Family
 8. "14th December 1924: Raj Kapoor, Indian actors and directors, was born". mapsofindia.com. 18 February 2016.
 9. "Raj Kapoor: The Greatest Showman". sulekha.com. 18 February 2016.
 10. "Raj Kapoor and the Golden Age of Indian Cinema". hcl.harvard.edu. 19 February 2015. Archived from the original on 18 జనవరి 2018.
 11. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; indiatimes1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 12. "Nikhil Nanda: The business of life - The Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 2014-07-13.
 13. http://www.imdb.com/name/nm0438510/bio?ref_=nm_ov_bio_sm
 14. "Kareena Kapoor, Ranbir Kapoor to root for cousin Sasha Agha's Aurangzeb". Daily Bhaskar.
 15. Ranbir Kapoor helps Armaan Jain to debut in Saif's Lekar Hum Deewana Dil
 16. Chatterjee, Ashok (17 May 2006). "'I want to be a master of talent'". The Times of India. Retrieved 25 August 2007.