రిషి కపూర్
రిషి కపూర్ | |
---|---|
జననం | |
మరణం | 2020 ఏప్రిల్ 30 | (వయసు 67)
వృత్తి | నటుడు, నిర్మాత, దర్శకుడు, ఆర్.కె.ఫిలిమ్స్ యజమాని |
క్రియాశీల సంవత్సరాలు | 1970 - 2020 |
జీవిత భాగస్వామి | నీతూ సింగ్ (m. 1980-2020) |
పిల్లలు | రిధిమా కపూర్ రణబీర్ కపూర్ |
బంధువులు | చూడు కపూర్ కుటుంబం |
రిషి కపూర్ (4 సెప్టెంబర్ 1952 – 30 ఏప్రిల్ 2020) భారతీయ సినిమా నటుడు ముఖ్యంగా హిందీ సినిమా నటుడు, దర్శకుడు.[1] ఇతడు 1970లో తన తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వంలో తీసిన మేరా నామ్ జోకర్ చిత్రంతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రంలో ఇతడు నటించిన పాత్రకు ఉత్తమ కళాకారుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కింది.[2]
ప్రారంభ జీవితం, కుటుంబం
[మార్చు]రిషి కపూర్ ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించాడు.[3][4][5]ఇతడు నటుడు, దర్శకుడు అయిన రాజ్‌కపూర్, కృష్ణ మల్హోత్రా దంపతుల రెండవ కుమారుడిగా జన్మించాడు. పృథ్వీరాజ్ కపూర్ ఇతని తాత. ఇతని విద్యాభ్యాసం తన సోదరులతో కలిసి ముంబైలోని కాంపియాన్ స్కూల్, అజ్మీర్ లోని మేయో కాలేజీలో జరిగింది. ఇతని సోదరులు రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్, మేనమామలు ప్రేమ్‌నాథ్, రాజేంద్రనాథ్, బాబాయిలు శశి కపూర్, షమ్మీ కపూర్ అందరూ సినిమా నటులే. ఇతనికి రితూ నందా, రీమా జైన్ అనే ఇద్దరు చెల్లెళ్లున్నారు.
వృత్తి
[మార్చు]ఇతడు 1970లో తన తండ్రి రాజ్‌కపూర్ దర్శకత్వంలో తీసిన మేరా నామ్ జోకర్ చిత్రంలో చిన్ననాటి రాజ్‌కపూర్ పాత్రలో నటించాడు. 1973లో డింపుల్ కపాడియాతో కలిసి బాబీ చిత్రంలో యువ ప్రేమికుడిగా నటించాడు.ఈ చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా 1974లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ గెలుచుకున్నాడు. 1973 నుండి 2000 వరకు ఇతడు 92 సినిమాలలో ప్రధాన పాత్రలను పోషించాడు. వాటిలో 51 చిత్రాలలో సోలో హీరోగా, 41 చిత్రాలలో ఇతర హీరోలతో కలిసి జంటగా నటించాడు. వాటిలో మొత్తం 36 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి.[6][7]ఇతడు తన భార్య నీతూసింగ్‌తో కలిసి 11 చిత్రాలలో జంటగా నటించాడు. ఇంకా ఇతడు సులక్షణా పండిట్, పర్వీన్ బాబీ, రంజీతా కౌర్, రీనారాయ్, జీనత్ అమన్, షబానా అజ్మీ, మౌసమీ ఛటర్జీ, ఫరీదా జలాల్, జయప్రద, పద్మిని కొల్హాపురే, కిమ్ యశ్‌పాల్, టీనా మునిమ్, తనూజ, రతి అగ్నిహోత్రి, శ్రీదేవి, మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా వంటి తారలతో కలిసి నటించాడు. బాబీ, లైలా మజ్ను, సర్‌గం, కర్జ్, ప్రేమ్ రోగ్, నగీనా, కభీ కభీ, హమ్ కిసీసే కమ్ నహీ, సాగర్ మొదలైనవి ఇతడు నటించిన చిత్రాలలో విజయవంతమైన కొన్ని చిత్రాలు. ఇతడు 1999లో "ఆ అబ్ లౌట్ ఛలేఁ" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. 2001 నుండి మరణించేవరకు సహాయనటుడిగా పలు చిత్రాలలో నటించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]రిషి కపూర్ తన సహనటి నీతూసింగ్‌ను 1980, జనవరి 22న వివాహం చేసుకున్నాడు. వీరికి రణ్‌బీర్ కపూర్, రిధమా కపూర్ అనే సంతానం కలిగారు. రణ్‌బీర్ నటుడిగా, రిధమ డిజైనర్‌గా రాణించారు. ఇతడు నటీమణులు కరిష్మా కపూర్, కరీనా కపూర్‌లకు బాబాయి. గొడ్డు మాంసం తినే హిందువుగా ఇతడు సోషియల్ మీడియాలో వివాదాస్పదమయ్యాడు.[8][9][10]ఇతడు మీనా అయ్యర్‌తో కలిసి తన జీవితచరిత్ర ఖుల్లం ఖుల్లా : రిషి కపూర్ అన్‌సెన్సార్డ్ అనే పేరుతో రచించాడు.[11] ఈ పుస్తకం 2017 జనవరి 15న విడుదలయ్యింది.
అనారోగ్యం, మరణం
[మార్చు]ఇతనికి కాన్సర్ వ్యాధి సోకిందని 2018లో తెలిసింది. చికిత్స నిమిత్తం ఇతడు న్యూయార్క్ వెళ్లాడు. ఒక ఏడాదిపాటి చికిత్స పొందాక ఇతడు 2019 సెప్టెంబర్ 26న భారతదేశానికి తిరిగివచ్చాడు.[12]
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఇతడిని 2020 ఏప్రిల్ 29న ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇతడు 2020, ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 5:20 గంటలకు మరణించాడు.[13]
పురస్కారాలు
[మార్చు]- 1970 -మేరా నామ్ జోకర్ చిత్రానికి బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ స్పెషల్ అవార్డ్, ఉత్తమ బాలనటుడు - జాతీయ చలనచిత్ర పురస్కారం[14]
- 1974 - బాబీ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం
- 2008 - ఫిల్మ్‌ఫేర్ జీవనసాఫల్య పురస్కారం
- 2009 - సినిమారంగంలో చేసిన కృషికి రష్యా ప్రభుత్వంచే సత్కారం.[15]
- 2010 - లవ్ ఆజ్కల్ చిత్రానికి అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వారిచే ఉత్తమ సహాయనటుడు పురస్కారం.[16]
- 2011 - జీ సినీ అవార్డ్స్: ఉత్తమ లైఫ్‌టైమ్ జోడీ అవార్డ్ నీతూ సింగ్‌తో కలిసి[17]
- 2011 - దో దూని చార్ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్
- 2013 - అగ్నిపథ్ చిత్రానికి టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ వారిచే ఉత్తమ ప్రతినాయకుడు అవార్డ్[18][19]
- 2016 - స్క్రీన్ జీవన సాఫల్య పురస్కారం
- 2017 - కపూర్ & సన్స్ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా స్క్రీన్, ఫిల్మ్‌ఫేర్, జీ సినీ అవార్డులు
ఫిల్మోగ్రఫీ
[మార్చు]ఇతడు నటించిన సినిమాల జాబితా:
- శ్రీ 420 (1955)
- మేరా నామ్ జోకర్ (1970)
- బాబీ (1973)
- జహ్రీలా ఇన్సాన్ (1974)
- జిందా దిల్ (1975)
- రాజా (1975)
- రఫూ చక్కర్ (1975)
- ఖేల్ ఖేల్ మే (1975)
- రంగీలా రతన (1976)
- లైలా మజ్ను (1976)
- గిన్నీ ఔర్ జానీ (1976)
- బరూద్ (1976)
- కభీ కభీ (1976)
- హమ్ కిసీసే కమ్ నహీఁ (1977)
- దూస్రా ఆద్మీ (1977)
- చలా మురారి హీరో బనే (1977)
- అమర్ అక్బర్ ఆంథొని (1977)
- ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్ (1978)
- పతి పత్ని ఔర్ వో (1978)
- నయాదౌర్ (1978)
- బదల్తే రిష్తే (1978)
- అంజానే మే (1978)
- సర్‌గమ్ (1979)
- సలామ్ మేమ్‌సాబ్ (1979)
- జూఠా కహీఁ కా (1979)
- దునియా మేరీ జేబ్ మే (1979)
- ఆప్ కే దీవానే (1980)
- దో ప్రేమీ (1980)
- ధన్ దౌలత్ (1980)
- కర్జ్ (1980)
- కాతిలోకే కాతిల్ (1981)
- నసీబ్ (1981)
- బీవీ ఓ బీవీ (1981)
- జమానే కో దిఖానా హై (1981)
- యే వాదా రహా (1982)
- దీదర్ యే యార్ (1982)
- ప్రేమ్ రోగ్ (1982)
- బడే దిల్ వాలా (1983)
- కూలీ (1983)
- దునియా (1984)
- ఆన్ ఔర్ షాన్ (1984)
- యే ఇష్క్ నహీ ఆసాన్ (1984)
- తవాయిఫ్ (1985)
- సితంగర్ (1985)
- సాగర్ (1985)
- రాహీ బదల్ గయే (1985)
- నసీబ్ అప్నా అప్నా (1986)
- దోస్తీ దుష్మనీ (1986)
- నగీనా (1986)
- పహుంచే హువే లోగ్ (1986)
- ఏక్ ఛాదర్ మైలీ సి (1986)
- ప్యార్ కె కాబిల్ (1987)
- హవాలాత్ (1987)
- ఖుద్‌గర్జ్ (1987)
- ఖజానా (1987)
- సిందూర్ (1987)
- విజయ్ (1988)
- జనమ్ జనమ్ (1988)
- హమారా ఖాన్‌దాన్ (1988)
- ఘర్ ఘర్ కీ కహానీ (1988)
- నఖబ్ (1989)
- హత్యార్ (1989)
- ఘరానా (1989)
- చాంద్‌నీ (1989)
- నిగాహేఁ (1989)
- బడే ఘర్ కీ బేటీ (1989)
- పరయా ఘర్ (1989)
- ఖోజ్ (1989)
- శేష్‌నాగ్ (1990)
- షేర్ దిల్ (1990)
- ఆజాద్ దేశ్ కె గులామ్ (1990)
- అమీరీ గరీబీ (1990)
- ఘర్ పరివార్ (1991)
- అజూబా (1991)
- గరజ్‌నా (1991)
- హెన్నా (1991)
- రణ్‌భూమి (1991)
- బంజారన్ (1991)
- బోల్ రాధా బోల్ (1992)
- కసక్ (1992)
- ఇంతెహా ప్యార్ కీ (1992)
- హనీమూన్ (1992)
- రిష్తా తో హో ఐసా (1992)
- దీవానా (1992)
- శ్రీమాన్ ఆషిక్ (1993)
- సాహిబా (1993)
- సాధనా (1993)
- గురుదేవ్ (1993)
- అన్‌మోల్ (1993)
- దామిని (1993)
- ధర్తీపుత్ర (1993)
- ఇజ్జత్ కి రోటీ (1993)
- మొహబ్బత్ కీ అర్జూ (1994)
- ఈనా మీనా డీకా (1994)
- సాజన్ కా ఘర్ (1994)
- ఘర్ కి ఇజ్జత్ (1994)
- పెహ్లా పెహ్లా ప్యార్ (1994)
- ప్రేమ్ యోగ్ (1994)
- సాహన్ కి బాతోఁ మే (1995)
- హమ్ దోనో (1995)
- యారానా (1995)
- ప్రేమ్ గ్రంథ్ (1996)
- దరార్ (1996)
- కౌన్ సచ్చా కౌన్ జూఠా (1997)
- జై హింద్ (1999)
- కారోబార్: ది బిజినెస్ ఆఫ్ లవ్ (2000)
- రాజు చాచా (2000)
- కుచ్ ఖట్టీ కుచ్ మీఠీ (2001)
- యే హై జల్వా (2002)
- కుచ్ తో హై (2002)
- లవ్ ఎట్ టైమ్స్ స్క్వేర్ (2003)
- తెహజీబ్ (2003)
- హమ్ తుమ్ (2004)
- ప్యార్ మే ట్విస్ట్ (2005)
- ఫనా (2006)
- లవ్ కె చక్కర్ మే (2006)
- డోంట్ స్టాప్ డ్రీమింగ్ (2007)
- నమస్తే లండన్ (2007)
- ఓమ్ శాంతి ఓమ్ (2007)
- సాంబార్ సల్సా (2007)
- తోడా ప్యార్ తోడా మ్యాజిక్ (2008)
- హల్లా బోల్ (2008)
- లక్ బై ఛాన్స్ (2009)
- చింటూ జి (2009)
- ఢిల్లీ -6 (2009)
- లవ్ ఆజ్ కల్ (2009)
- కల్ కిస్నే దేఖా (2009)
- సడియాఁ (2010)
- దో దూని చార్ (2010)
- పటియాలా హౌస్ (2011)
- టెల్ మీ ఓ ఖుదా (2011)
- అగ్నిపథ్ (2012)
- స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (2012)
- హౌస్‌ఫుల్ 2 (2012)
- జబ్ తక్ హై జాన్ (2012)
- చష్మే బుద్దూర్ (2013)
- ఔరంగజేబ్ (2013)
- డి-డే (2013)
- బే షరమ్ (2013)
- శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013)
- బేవకూఫియాఁ (2014)
- ఆల్ ఈజ్ వెల్ (2015)
- వెడ్డింగ్ పులావ్ (2015)
- సనమ్ రె (2016)
- కపూర్ & సన్స్ (2016)
- పటేల్ కి పంజాబీ షాదీ (2017)
- 102 నాట్ ఔట్ (2018)
- ముల్క్ (2018)
- రజ్మా చావల్ (2018)
- జూఠా కహీ కా (2019)
- ది బాడీ (2019)
- శర్మాజీ నమ్‌కీన్ (2020)
ఇవి కూడా చూడండి
[మార్చు]లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')
మూలాలు
[మార్చు]- ↑ "Rishi Kapoor slams godmen and Radhe Maa". Archived from the original on 29 August 2017. Retrieved 27 August 2017.
- ↑ "18th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived (PDF) from the original on 26 February 2012. Retrieved 26 September 2011.
- ↑ Gooptu, Sharmistha (29 October 2010). "Bengali Cinema: 'An Other Nation'". Taylor & Francis – via Google Books.
- ↑ "Fashion Cultures: Theories, Explorations, and Analysis edited by Stella Bruzzi, Pamela Church".
- ↑ "South star Taapsee surprises Rishi Kapoor by turning out to be Punjabi - NDTV Movies". Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 3 March 2015.
- ↑ "Since then he played leading roles as the romantic lead in 92 films which includes 41 were multi-hero films and 51 solo hero film". Archived from the original on 17 September 2016. Retrieved 4 September 2016.
- ↑ "Rishi Kapoor vows to donate organs". Archived from the original on 11 September 2016. Retrieved 4 September 2016.
- ↑ "Tweets on beef land actor Rishi Kapoor in controversy". Archived from the original on 17 July 2018. Retrieved 23 June 2018.
- ↑ "Rishi Kapoor: I am a Beef eating Hindu, don't equate food with religion". Archived from the original on 23 June 2018. Retrieved 23 June 2018.
- ↑ "Rishi Kapoor faces cow vigilantes' ire for tweets on eating beef last March". Archived from the original on 23 June 2018. Retrieved 23 June 2018.
- ↑ "Khullam Khulla: Rishi Kapoor Uncensored" Archived 23 డిసెంబరు 2016 at the Wayback Machine by Rishi Kapoor, Meena Iyer
- ↑ "Archived copy". Archived from the original on 11 October 2019. Retrieved 26 September 2019.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑
- ↑ [1] Archived 21 ఏప్రిల్ 2008 at the Wayback Machine
- ↑ "Rishi Kapoor honored by Russian Government for contribution to cinema". Bollywoodhungama.com. 9 November 2009. Archived from the original on 12 November 2009. Retrieved 2011-09-19.
- ↑ "Winners of 5th Apsara Film & Television Producers Guild Awards". Bollywoodhungama.com. 8 January 2010. Archived from the original on 11 జనవరి 2010. Retrieved 30 ఏప్రిల్ 2020.
- ↑ "Winners of Zee Cine Awards 2011". Bollywoodhungama.com. 14 January 2011. Archived from the original on 22 అక్టోబరు 2011. Retrieved 30 ఏప్రిల్ 2020.
- ↑ "Priyanka, Ranbir win best actor awards at TOIFA". intoday.in. 8 April 2013. Archived from the original on 11 April 2013. Retrieved 11 April 2013.
- ↑ "Winners of Times Of India Film Awards 2013 (TOIFA)". bollywoodhungama.com. 8 April 2013. Archived from the original on 11 April 2013. Retrieved 11 April 2013.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రిషి కపూర్ పేజీ
- Commons category link is on Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1952 జననాలు
- Kapoor family
- Indian male film actors
- Indian male child actors
- హిందీ సినిమా నటులు
- Male actors from Mumbai
- Film directors from Mumbai
- Film producers from Mumbai
- Hindi-language film directors
- Punjabi people
- 20th-century Indian film directors
- 20th-century Indian male actors
- Best Child Artist National Film Award winners
- Filmfare Awards winners
- 2020 మరణాలు