Jump to content

మౌసమీ ఛటర్జీ

వికీపీడియా నుండి
మౌసమీ ఛటర్జీ
2017లో మౌసమీ ఛటర్జీ
జననం
ఇందిరా చటోపాధ్యాయ

ఏప్రిల్ 26
ఇతర పేర్లుమౌషుమీ ఛటర్జీ
వృత్తి
  • నటి
  • రాజకీయవేత్త
క్రియాశీల సంవత్సరాలు1967–ప్రస్తుతం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ (2019-ప్రస్తుతం)
భారత జాతీయ కాంగ్రెస్ (2019కి ముందు)
జీవిత భాగస్వామిజయంత్ ముఖర్జీ
పిల్లలు2
బంధువులుప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు హేమంత్ కుమార్ (మామగారు)

మౌసమీ ఛటర్జీ (ఆంగ్లం: Moushumi Chatterjee; జననం ఇందిరా చటోపాధ్యాయ) హిందీ, బెంగాలీ భాషా సినిమాలతో ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. 1970లలో హిందీ చిత్రాలలో అత్యధిక పారితోషికం పొందిన నటీమణులలో ఆమె ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంది. తన ఐదు దశాబ్దాలకు పైన కెరీర్​లో పలు పురస్కారాలతో పాటు 2024లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకుంది.[1]

రాజకీయ ప్రవేశం

[మార్చు]

ఆమె 2004 లోక్‌సభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది.[2] ఆమె 2019లో భారతీయ జనతా పార్టీలో చేరింది.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మౌసమీ ఛటర్జీ అవిభక్త బెంగాల్‌లోని బిక్రంపూర్‌కు చెందిన బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో కలకత్తాలో జన్మించింది. ఆమె తండ్రి, ప్రంతోష్ ఛటోపాధ్యాయ, భారత సైన్యంలో, ఆమె తాత న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. ఆమె అసలు పేరు ఇందిర, కాగా మౌసమీ ఆమె స్క్రీన్ పేరు.[4]

ఇందిరా చటోపాధ్యాయకు చిన్నతనంలోనే జయంత్ ముఖర్జీతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జయంత్ ముఖర్జీ సంగీత స్వరకర్త, గాయకుడు హేమంత్ కుమార్ కుమారుడు. జయంత్ కూడా రవీంద్ర సంగీత విద్వాంసుడు. తన భర్త, మామగారి ప్రోత్సాహంతో, ఆమె సినిమాల్లో నటించే అవకాశాలను అంగీకరించింది. హీరోయిన్ గా ఆమె సినీ కెరీర్ మొదలుపెట్టింది. కానీ, ఆమె ఎప్పుడూ తన కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చేది.[5]

2018 నుండి అనారోగ్య కారణాలతో కోమాలో ఉన్న ఆమె కుమార్తె పాయల్ 2019 డిసెంబరు 13న మరణించింది.[6]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా సంవత్సరం సినిమా సంవత్సరం సినిమా
1967 బాలికా బధు 1979 లవ్ ఇన్ కెనడా 1989 ఆఖ్రీ గులాం
1969 పరిణీత 1979 ఘర్ కీ లాజ్ 1989 ఆఖ్రీ బాజీ
1972 అనురాగ్ 1980 స్వయంవర్ 1989 జంగ్ బాజ్
1973 నైనా 1980 మాంగ్ భరో సజన 1989 సిక్కా
1973 కుచ్చే ధాగే 1980 జ్యోతి బానే జ్వాలా 1989 షెహజాదే
1973 గులాం బేగం బాద్షా 1980 చంబల్ కి కసమ్ 1990 ఘయల్
1974 జెహ్రీలా ఇన్సాన్ 1980 బద్లా ఔర్ బలిదాన్ 1991 ఘర్ పరివార్
1974 మాకు పార్ 1980 డూ ప్రీమి 1991 ప్యార్ కా దేవతా
1974 రోటీ కపడ ఔర్ మకాన్ 1980 బీ-రెహమ్ 1992 జుల్మ్ కి హుకుమత్
1974 హమ్షకల్ 1981 ప్యాసా సావన్ 1992 ఖులే-ఆమ్
1974 బీనామ్ 1981 క్రోధి 1992 నిశ్చయై
1974 బద్లా 1981 ఇత్నీ సి బాత్ 1993 ప్రతీక్ష
1975 ఉమర్ ఖైద్ 1981 ఓగో బోదు శుందరి 1993 సంతాన్
1975 రాఫ్తార్ 1981 దాసి 1994 ఉధార్ కి జిందగీ
1975 నాటక్ 1982 రక్ష 1994 ఇక్కే పె ఇక్క
1975 మజాక్ 1982 అంగూర్ 1995 కర్తవ్య
1975 డూ జూట్ 1983 జస్టిస్ చౌదరి 1995 జల్లాద్
1975 అనారీ 1984 పెట్ ప్యార్ ఔర్ పాప్ 1996 ముకద్దర్
1976 సబ్సే బడా రూపయ్య 1984 జవానీ 1998 కరీబ్
1976 జై బజరంగ్ బలి 1984 ఘర్ ఏక్ మందిర్ 1998 డోలి సజా కే రఖనా
1976 జిందగీ 1984 ఆన్ ఔర్ షాన్ 1998 కీమత్ - దే ఆర్ బ్యాక్
1977 ఆనంద్ ఆశ్రమ్ 1985 రుస్వాయై 1999 ఆ అబ్ లౌట్ చలేన్
1977 అబ్ క్యా హోగా 1985 దేఖా ప్యార్ తుమ్హారా 2002 న తుమ్ జానో న హమ్
1977 హత్యారా 1986 ఉర్బాషి 2002 బాలీవుడ్/హాలీవుడ్
1978 తుమ్హారీ కసమ్ 1987 సిందూర్ 2004 హమ్ కౌన్ హై?
1978 స్వర్గ్ నరక్ 1987 ఆగ్ హాయ్ ఆగ్ 2006 జిందగీ రాక్స్
1978 ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్ 1987 మహానంద 2015 పికు
1978 ఫండేబాజ్ 1987 మేరా కరమ్ మేరా ధరమ్ 2006 భలోబసర్ ఒనేక్ నామ్
1978 దిల్ ఔర్ దీవార్ 1987 వతన్ కే రఖ్వాలే 2016 శేష్ సంగ్బాద్
1978 భోళా భళా 1987 పరమ ధరమ్ 2010 జపనీస్ భార్య
1979 దో లడ్కే దోనో కడ్కే 1988 తక్దీర్ కా తమాషా 2013 గోయ్నార్ బక్షో
1979 ప్రేమ్ బంధన్ 1988 వక్త్ కి ఆవాజ్
1979 గౌతమ్ గోవిందా 1988 విజయ్
1979 మంజిల్ 1988 అగ్ని

మూలాలు

[మార్చు]
  1. "Dadasaheb Phalke IFF Awards 2024: దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్..విన్నర్స్ లిస్ట్ చూసేయండి". web.archive.org. 2024-04-13. Archived from the original on 2024-04-13. Retrieved 2024-04-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Actress Moushumi Chatterjee Joins BJP Just Months Ahead of Lok Sabha Polls". News18 (in ఇంగ్లీష్). 2 January 2019. Retrieved 2 November 2020.
  3. "Veteran Indian actor joins BJP, praises Modi". Khaleej Times. Indo-Asian News Service. 19 February 2019. Retrieved 5 May 2019.
  4. Gupta, Priya (13 May 2015). "Moushumi Chatterjee: God is not kind to me, he is partial to me - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2 September 2020.
  5. "Veteran actress Moushumi Chatterjee moves Bombay HC, wants to meet comatose daughter". The Economic Times. 23 November 2018.
  6. "Moushumi Chatterjee's daughter Payal dies at 45". India Today. 13 December 2019. Retrieved 5 March 2019.