పర్వీన్ బాబీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్వీన్ బాబీ
జననం
పర్వీన్ మహమ్మద్ అలీ[1]

(1954-04-04)1954 ఏప్రిల్ 4 [2][3][4]
జునాగఢ్, సౌరాష్ట్ర, భారతదేశం
మరణం2005 జనవరి 20(2005-01-20) (వయసు 50)
సమాధి స్థలంశాంతాక్రజ్ ముస్లిం స్మశానవాటిక, ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి
 • నటి
 • మోడల్
క్రియాశీల సంవత్సరాలు1972–1991

పర్వీన్ బాబీ (1954 ఏప్రిల్ 4 - 2005 జనవరి 20) ఒక భారతీయ నటి, మోడల్. 1970లు, 1980ల ప్రారంభంలో హిందీ చిత్రాలలో ఆమె నటనకు మంచి గుర్తింపు పొందింది.[5] పర్వీన్ బాబీ తన "గ్లామరస్" నటనా శైలికి ప్రసిద్ధి చెందింది. ఆ సమయంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు.[6] ఆమెకున్న మోడలింగ్, ఫ్యాషన్ సెన్స్ ఆమెను ఐకాన్‌గా నిలబెట్టాయి.[7]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

పర్వీన్ బాబీ 1954 ఏప్రిల్ 4న సౌరాష్ట్రలోని జునాగఢ్‌లో (ప్రస్తుతం గుజరాత్‌లో ఉంది) జన్మించింది. గుజరాత్‌లోని పఠాన్‌లుగా పిలువబడే పష్టూన్‌ల ఖిల్జీ బాబీ తెగకు చెందిన జునాగఢ్‌కు చెందిన గొప్ప కుటుంబంలో ఆమె ఏకైక సంతానం.[8] ఆమె తన తల్లిదండ్రుల వివాహమైన పద్నాలుగు సంవత్సరాలకు జన్మించింది. ఆమె తండ్రి వాలి మహమ్మద్ ఖాన్ బాబీ, జునాగఢ్ నవాబు వద్ద నిర్వాహకుడు. ఆమె తల్లి జమాల్ బఖ్తే బాబీ (మరణం 2001).[9][10] 1959లో పర్వీన్ బాబీ ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఆమె అహ్మదాబాద్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ నుండి ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించింది. ఆ తర్వాత సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ను పర్వీన్ బాబీ సంపాదించింది.[11]

జీవిత చరిత్ర[మార్చు]

చరిత్ర (1973) చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. మజ్బూర్ (1974)లో నీల పాత్రకు ఆమె గుర్తింపు పొందింది. ఆమె యాక్షన్ క్రైమ్-డ్రామా చిత్రం దీవార్ (1975)లో అనితగా నటించి కెరీర్ లో పురోగతి సాధించింది. దీంతో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది. ముఖ్యంగా అమర్ అక్బర్ ఆంథోనీ (1977)లో జెన్నీగా, సుహాగ్ (1979), కాలా పత్తర్ (1979), ది బర్నింగ్ ట్రైన్ (1980)లో శీతల్, షాన్ (1980)లో సునీత, కాలియా (1981)లో షల్లిని / రాణి, నమక్ హలాల్ (1982)లో నిషా పాత్రలు ఆ తరం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 1976లో టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంపై కనిపించిన మొదటి బాలీవుడ్ తారగా గుర్తింపు తెచ్చుకుంది. 1980ల మధ్య కెరీర్లో ఒడిదుడుకులకు లోనైన పర్వీన్ బాబీ చివరికి 1991లో చిత్ర పరిశ్రమ నుండి రిటైర్ అయింది.

కబీర్ బేడీ, డానీ డెంజోంగ్పా, మహేష్ భట్‌లతో వరుస సంబంధాల తర్వాత కూడా ఆమె అవివాహితగానే మిగిలిపోయింది. ఆమెకు ఆ తరవాత రోజుల్లో స్కిజోఫ్రెనియా(మతిస్థిమితం లేకపోవడం) ఉన్నట్లు నిర్ధారణ అయింది. అలాగే మధుమేహం, ఆస్టియో ఆర్థరైటిస్.. ఇలా అన్ని చుట్టుముట్టి 2005 జనవరి 20న పర్వీన్ బాబీ మరణించింది.[12][13][14]

మూలాలు[మార్చు]

 1. "Parveen Babi". The Independent. 25 January 2005. Retrieved 19 October 2021.
 2. Elizabeth Sleeman (2001). The International Who's Who of Women 2002. Psychology Press. pp. 35–. ISBN 978-1-85743-122-3.
 3. Mishra, Nivedita (12 September 2020). "'Parveen Babi survived on a diet of milk, eggs towards the end of her life': Karishma Upadhyay". Hindustan Times (in ఇంగ్లీష్).
 4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; bhaskar అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 5. "Parveen wanted to be left alone", The Times of India, 30 January 2005 Archived 5 డిసెంబరు 2008 at the Wayback Machine
 6. "Manish Malhotra picks his five favourite super stylish heroines of the seventies". Calcutta, India: Telegraph India. 23 November 2010. Retrieved 19 July 2012.
 7. "Parveen Babi Death Anniversary: 5 best movies of the glamourous [sic] actress". Free Press Journal India. January 19, 2022.
 8. "Obituaries - Parveen Babi". The Independent (in ఇంగ్లీష్). 25 January 2005.
 9. "The Illustrious Babi Daynasty :: JunaGadh State". junagadhstate.org.
 10. "'Adopted son' claims Parveen Babi's crores". Sify.com. 31 January 2005. Archived from the original on 18 February 2013. Retrieved 6 October 2012.
 11. "St. Xavier's College – Ahmedabad – INDIA". stxavierscollege.net.
 12. "Parveen Babi dies, alone in death as in life", The Times of India, 22 January 2005.
 13. "Parveen wanted to be left alone", The Times of India, 30 January 2005 Archived 5 డిసెంబరు 2008 at the Wayback Machine
 14. "Parveen Babi found dead in Mumbai" Archived 24 అక్టోబరు 2008 at the Wayback Machine, The Indian Express, 22 January 2005.