స్కిజోఫ్రీనియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెల్లని వస్త్రంపై స్కిజోఫ్రీనియా వ్యక్తి రాసిన అక్షరాలు

స్కిజోఫ్రీనియా అనేది ఒక మానసిక వ్యాధి. దీన్నే వాడుక భాషలో పిచ్చి లేదా మెంటల్ లేదా మతిభ్రమణం అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు వీళ్ళ వింతగా ప్రవర్తిస్తూ భ్రమల్లో జీవిస్తుంటారు. దీని నిర్ధారణకు ప్రత్యేకమైన వైద్య పరీక్షలేమీ లేవు. వ్యక్తి ప్రవర్తనలో మార్పులు ఎలా సంభవించాయి, దైనందిన జీవితంపై వీటి ప్రభావం ఎలా ఉంది అనే విషయాలను కుటుంబ సభ్యులనుంచి సేకరిస్తారు.[1]

కారణాలు[మార్చు]

మెదడులో ఉండే డోపమిన్, సెరటోనిన్ వంటి నాడీ రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం దీనికి మూల కారణం. కానీ అవి ఎందుకు పెరుగుతున్నాయి లేదా ఎందుకు తగ్గుతున్నాయన్నది ఇప్పటిదాకా తెలియదు. కాబట్టి స్కిజోఫ్రీనియాకు కచ్చితమైన కారణాలు చెప్పలేము. కానీ మెదడులో సంభవించే ఈ మార్పులు శాశ్వతం కాదు. కొన్నిసార్లు మందులతో నియంత్రణలో ఉంటాయి కాబట్టి కొన్ని సార్లు దీనికి చికిత్స సాధ్యమే. కుటుంబ సభ్యుల్లో, రక్త సంబంధీకుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే దగ్గరి వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు, ముప్పు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సాధారణంగా ఈ సమస్య యుక్తవయస్సు ప్రారంభంలో కనిపిస్తుంది కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉంటే యుక్తవయస్సు పిల్లలపై దృష్టి పెట్టడం అవసరం.

మూలాలు[మార్చు]

  1. Baucum, Don (2006). Psychology (2nd ed.). Hauppauge, N.Y.: Barron's. p. 182. ISBN 9780764134210.