డింపుల్ కపాడియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డింపుల్ కపాడియా
జననం
డింపుల్ చున్నీబాయ్ కపాడియా

(1957-06-08) 1957 జూన్ 8 (వయసు 67)
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1973; 1984–ప్రస్తుతం
జీవిత భాగస్వామిరాజేష్ ఖన్నా (1973–1982; విడిపోయారు)
పిల్లలుట్వింకిల్ ఖన్నా
రింకే ఖన్నా
బంధువులుసింపుల్ కపాడియా (సోదరి)
అక్షయ్ కుమార్ (అల్లుడు)

డింపుల్ కపాడియా (జననం 8 జూన్ 1957)[1] ఒక భారతీయ సినిమా నటి. ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ 1973లో తానే నిర్మించి, దర్శకత్వం వహించిన "బాబీ" చిత్రంలో ఈమెను పరిచయం చేశాడు. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. అదే సంవత్సరం ఈమె హిందీ సినిమా నటుడు రాజేష్ ఖన్నాను వివాహం చేసుకుని సినిమాల నుండి విరమించింది. 1984లో రాజేష్ ఖన్నాతో విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి సినిమా రంగప్రవేశం చేసింది. తొలి చిత్రం బాబీ, 1985లో విడుదలైన "సాగర్" చిత్రాలలో ఈమె నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం లభించింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]
డింపుల్ కపాడియా (కుడి) తన కుమార్తె ట్వింకిల్ ఖన్నా, అల్లుడు అక్షయ్ కుమార్‌లతో.

డింపుల్ కపాడియా గుజరాతీ పారిశ్రామికవేత్త చున్నీభాయ్ కపాడియా, బెట్టీ దంపతుల నలుగురు సంతానంలో పెద్ద కుమర్తె. ఈమెకు సింపుల్ కపాడియా, రీమ్‌ కపాడియా అనే చెల్లెళ్ళు, మున్నా అనే తమ్ముడు ఉన్నారు.[3][4] వీరి కుటుంబం ముంబయి లోని శాంతాక్రజ్ అనే ప్రాంతంలో నివసించేది. ఈమె సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ హైస్కూలులో చదువుకుంది.[5][6]. ఈమె తన తొలి సినిమా బాబీ విడుదల కావడానికి ఆరు నెలల క్రితమే 1973లో సినీ నటుడు రాజేష్ ఖన్నా ను వివాహం చేసుకుంది.[7] ఆ తర్వాత ఈమె 12 సంవత్సరాల కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఈమెకు ట్వింకిల్ (జ.1973), రింకీ (జ.1977) లు జన్మించారు.[7]

ఈమె రాజేష్ ఖన్నాతో 1982 ఏప్రిల్‌లో విడాకులు పుచ్చుకుంది. తన కుమార్తెలను తన తల్లిదండ్రుల వద్ద వదిలివేసింది.[8] రెండేళ్ల తరువాత సినిమా రంగంలో పునఃప్రవేశం చేసింది.[7]

ఈమె కుమార్తెలు ఇద్దరూ సినిమా నటులుగా రాణించి జీవితంలో స్థిరపడ్డారు. పెద్ద కుమార్తె ట్వింకిల్ ఖన్నా సినిమా నటుడు అక్షయ్ కుమార్ ను వివాహం చేసుకుంది.[9]

వృత్తి

[మార్చు]

ఈమెకు చిన్నతనం నుండే సినిమాలలో నటించాలన్న కోరిక ఉండేది. [10] 1973లో రాజ్ కపూర్ ఈమెను తన చిత్రం "బాబీ"లో పరిచయం చేశాడు. ఆ చిత్రం రాజ్ కపూర్ కుమారుడు రిషీ కపూర్‌కు కూడా తొలి చిత్రం. ఈ చిత్రంలో డింపుల్ గోవాకు చెందిన మధ్యతరగతి క్రిస్టియన్ అమ్మాయి 'బాబీ బ్రగాంజా' పాత్రను పోషించింది.[7] ఈ కథలో బాబీ, ధనవంతుల బిడ్డయైన రాజ్ (రిషీ కపూర్) ను ప్రేమిస్తుంది. ఇరువైపుల తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించరు. ఈ సినిమా, ముఖ్యంగా డింపుల్ నటన సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలోని నటనకు గాను ఈమె ఉత్తమనటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని "అభిమాన్" చిత్రంలో నటించిన జయబాధురితో కలిసి పంచుకుంది.[11] 2008లో రీడిఫ్.కామ్‌ ఈమె నటనకు స్త్రీలలో ఆల్ టైమ్‌ హిందీ సినిమా నాలుగవ అత్యుత్తమ తొలి నటనగా ఎంపిక చేసింది.[12] ఈమె సినిమాలలో 1982లో రి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతి తక్కువ వ్యవధిలోనే శ్రీదేవి, మాధురీ దీక్షిత్, మీనాక్షి శేషాద్రి, జయప్రదల తర్వాత బాలీవుడ్‌లో టాప్ కమర్షియల్ నటిగాఅ ఐదవ స్థానాన్ని ఆక్రమించింది.[13] ఈమె రమేష్ సిప్పి, నజీర్ హుసేన్, ముకుల్ ఆనంద్, ఫిరోజ్ ఖాన్, మహేష్ భట్, రాజ్ కుమార్ కొహ్లీ, సుభాష్ ఘాయ్, గోవింద్ నిహ్లానీ, గుల్జార్ వంటి దర్శకుల చిత్రాలలో కమల్ హసన్, సన్నీ డియోల్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి, ధర్మేంద్ర, వినోద్ ఖన్నా,శేఖర్ కపూర్, నానా పటేకర్, అమితాబ్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, నసీరుద్దీన్ షా మొదలైన నటుల సరసన నటించింది. కొన్ని తమిళ, మలయాళ చిత్రాలలో కూడా నటించింది.

పురస్కారాలు

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
 • 1973 – ఉత్తమ నటి బాబీ[15]
 • 1985 – ఉత్తమ నటి, సాగర్[16]
 • 1993 – క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్, రుడాలి.[17]
 • 1994 – ఉత్తమ సహాయనటి, క్రాంతివీర్[17]
బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డ్స్
 • 1991 – ఉత్తమ నటి (హిందీ), దృష్టి[18]
ఇతర పురస్కారాలు
 • 1993 – 8వ డమస్కస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఉత్తమ నటి, రుడాలి[19]
 • 1993 – 38వ ఆసియా పసిఫిక్ ఫిలిం ఫెస్టివల్, ఉత్తమ నటి, రుడాలి[19]

చిత్ర సమాహారం

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర వివరాలు
1973 బాబీ బాబీ జె. బ్రగాంజా ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం
1984 జక్మి షేర్ అను గుప్తా
1984 మంజిల్ మంజిల్ సీమా మల్హోత్రా
1985 ఐత్‌బార్ నేహా ఖన్నా
1985 లావా రింకూ దయాల్
1985 అర్జున్ గీతా సహాని
1985 పాతాళ్ భైరవి యక్షకన్య
1985 సాగర్ మోనా డిసిల్వా ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం
1986 విక్రమ్ రాకుమారి తమిళ సినిమా
1986 జాన్‌బాజ్ రేష్మా రాయ్
1986 అల్లారఖా జూలీ ఖేరా
1987 ఇన్సానియత్ కె దుష్మన్ శిల్ప
1987 ఇన్సాఫ్ సోనియా / డా.సరిత
1987 కాష్ పూజ
1988 సాజిష్ మీనా
1988 మేరా షికార్ బిజ్లి
1988 గునావోఁ కా ఫైస్లా షాను / దుర్గ
1988 బీస్ సాల్ బాద్ నిషా
1988 ఆఖ్రీ అదాలత్ రీమా కపూర్
1988 కబ్జా డా.స్మిత
1988 మహావీర డాలీ
1988 జక్మీ ఔరత్ కిరణ్ దత్
1988 గంగా తేరే దేశ్ మే రాకుమారి
1989 రామ్‌ లఖన్ గీతా కశ్యప్
1989 యాక్షన్
1989 తౌహీన్ దీపికా శ్రీవాత్సవ
1989 బట్వారా జిన్నా
1989 సిక్కా శోభా
1989 షహజాదే ఆర్తి క్రెడిట్ ఇవ్వలేదు
1989 లడాయి బిల్లూ
1990 పతి పరమేశ్వర్ దుర్గా
1990 కలి గంగా
1990 జై శివ్ శంకర్
1990 ఆగ్ కా గోలా ఆర్తి
1990 ప్యార్ కే నామ్‌ ఖుర్బాన్ రాజకుమారి దేవికా సింగ్
1990 దృష్టి సంధ్య
1991 లేకిన్... రేవ
1991 ప్రహార్ ద ఫైనల్ అటాక్ కిరణ్
1991 నరసింహ అనితా వి.రస్తోగి
1991 మస్త్ కలందర్ ప్రీత్ కౌర్
1991 హక్ వర్షా బి.సింగ్
1991 ఖూన్ కా కర్జ్ తారా కె. లెలె
1991 దుష్మన్ దేవతా గౌరి
1991 అజూబా రుక్సానా ఖాన్
1991 రణభూమి వేశ్య
1992 కర్మ యోధ నమిత
1992 అంగార్ మిలి
1992 దిల్ ఆసాన్ హై బర్ఖా
1993 రుడాలి Shanichari జాతీయ ఉత్తమ చలనచిత్ర నటి పురస్కారం
ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్
1993 గునాహ్ కవితాశర్మ
1993 ఆజ్ కీ ఔరత్ రోష్నీ వర్మా
1993 గర్దిష్ శాంతి Nominated—Filmfare Award for Best Supporting Actress
1994 పథ్రీలా రాస్తా గాయత్రి సన్యాల్
1994 క్రాంతివీర్ మేఘా దీక్షిత్ ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం
1994 అంతరీన్ బెంగాలీ సినిమా
1997 షేర్ బజార్ ప్రత్యేక పాత్రలో
1997 అగ్ని చక్ర రాణి
1997 మృత్యు దాత జానకీ గాయల్
1998 2001:దో హజార్ ఏక్ రోష్నీ శర్మ
1999 లావారిస్ కవితా సక్సేనా
1999 హమ్‌ తుమ్‌ పే మర్తే హై దేవయాని
2001 దిల్ చాహతా హై తారా జైస్వాల్
2002 లీలా లీలా
2004 హం కౌన్ హై? శాండ్రా విలియమ్స్
2005 ప్యార్ మే ట్విస్ట్ శీతల్ ఆర్య
2006 బీయింగ్ సైరస్ కేటి సేత్నా
2006 బనారస్ - ఎ మిస్టిక్ లవ్ స్టోరీ గాయత్రి
2008 ఫిర్ కభీ గంగా
2008 జంబో దేవి (వాయిస్ ఓవర్)
2009 లక్ బై ఛాన్స్ నీనా వాలియా
2010 తుమ్‌ మిలో తో సహీ దిల్షాద్ నాన్జీ
2010 దబాంగ్ నైని పి. పాండే
2011 పాటియాలా హౌస్ మిసెస్ ఖలోన్
2012 బొంబాయి మిఠాయి మిసెస్ మన్సూర్ మలయాళ సినిమా
2012 కాక్‌టెయిల్ కవితా కపూర్
2013 వాట్ ది ఫిష్ సుధా మిశ్రా
2014 గొల్లు ఔర్ పప్పు అమ్మ
2014 ఫైండింగ్ ఫన్నీ రోసలీనా రోసీ యూచరిస్టికా
2015 వెల్‌కమ్‌ బ్యాక్ మహారాణి
2019 దబంగ్ 3
2023 తూ ఝూతీ మైన్ మక్కర్
2024 తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "'I want to laugh, really laugh!'". MiD DAY. 8 June 2007. Retrieved 19 September 2011.
 2. "The best of Dimple Kapadia". Rediff.com. 8 June 2010. Retrieved 3 January 2011.
 3. Film World. T.M. Ramachandran. 1973. p. 11. Retrieved 27 October 2010.
 4. Agrawal, Malti (1 January 2007). New Perspectives on Indian English Writings. Atlantic Publishers & Dist. p. 26. ISBN 978-81-269-0689-5. Retrieved 27 October 2012.
 5. Bamzai, Kaveree (18 November 2002). "Forever Diva". India Today. Retrieved 1 January 2012.
 6. Mirani, Indu (2006-08-22). "Once upon a time". Daily News and Analysis. Retrieved 2012-01-01.
 7. 7.0 7.1 7.2 7.3 Raheja, Dinesh (8 September 2004). "Dimple: A Most Unusual Woman". Rediff.com. Retrieved 19 September 2011.
 8. Mitra, Sumit (1985). "Dimple Kapadia: The second coming". India Today. 10 (17–24). Bangalore: Living Media India Ltd.: 74.
 9. Das Gupta, Ranjan (9 January 2009). "Lucky once again". The Hindu. Archived from the original on 2 జూన్ 2009. Retrieved 7 December 2011.
 10. "Film Crazy". The Illustrated Weekly of India. 108 (27–38). The Times Group: 8. 1987.
 11. Asiaweek. Asiaweek Limited. January 1987. p. 68. Retrieved 27 October 2012.
 12. Sen, Raja (24 November 2008). "Best Debutants Ever". Rediff.com. Retrieved 19 September 2011.
 13. Bumiller, Elisabeth (1 June 1991). May You Be the Mother of a Hundred Sons. Penguin Books India. p. 185. ISBN 978-0-14-015671-3. Retrieved 27 October 2012.
 14. Sabharwal, Gopa (2007). India Since 1947: The Independent Years. Penguin Books India. p. 250. ISBN 978-0-14-310274-8. Retrieved 28 November 2012.
 15. Reed, Sir Stanley (1974). The Times of India Directory and Year Book Including Who's who. Times of India Press. Retrieved 28 November 2012.
 16. "About Dimple Kapadia". MTV. Retrieved 28 November 2012.
 17. 17.0 17.1 "Dimple Kapadia Awards". Entertainment One India. Archived from the original on 22 ఫిబ్రవరి 2014. Retrieved 28 November 2012.
 18. "1992 – 55th Annual BFJA Awards – Awards for the Year 1991". BFJA. Archived from the original on 8 January 2010. Retrieved 9 January 2009.
 19. 19.0 19.1 "Rudaali = Rudālī = Rudaali (the mourner)". WorldCat. Retrieved 31 December 2011.

బయటి లింకులు

[మార్చు]