ట్వింకిల్ ఖన్నా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్వింకిల్ ఖన్నా
జననం
ట్వింకిల్ ఖన్నా

విద్య
 • నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ముంబై
 • యూనివర్సిటీ ఆఫ్ లండన్, లండన్
వృత్తి
 • రచయిత
 • కాలమిస్ట్
 • ఇంటీరియర్ డిజైనర్
 • చిత్ర నిర్మాత
 • నటి
క్రియాశీల సంవత్సరాలు
 • 1995–2001 (నటి)
 • 2002–2018 (కాలమిస్ట్, ఇంటీరియర్ డిజైనర్, చిత్ర నిర్మాత)
జీవిత భాగస్వామి
పిల్లలుఆరవ్ కుమార్(జ.2002),
నితార కుమార్(జ.2012)
తల్లిదండ్రులు
బంధువులురింకే ఖన్నా (సోదరి),సింపుల్ కపాడియా

ట్వింకిల్ ఖన్నా (జననం 1974 డిసెంబరు 29) అసలు పేరు టీనా జతిన్ ఖన్నా. ఈమె ప్రముఖ భారతీయ ఇంటీరియర్ డిజైనర్, పత్రికా కాలమిస్టు, రచయిత్రి, మాజీ నటి కూడా. ఆమె మొదటి సినిమా బర్సాత్ (1995)కు ఫిలింఫేర్ ఉత్తమ తొలి చిత్ర నటి పురస్కారం (బెస్ట్ ఫీమేల్ డెబ్యూ) పొందారు. తెలుగు చిత్రం శీను (1999)లో  కథానాయికగా కనిపించారీమె. ప్రముఖ నటులు రాజేష్ ఖన్నా,  డింపుల్ కపాడియాల కుమార్తె ఈమె. నటిగా ఆమె చివరి చిత్రం లవ్ కే లియే కుచ్ భి కరేగా (2001). బాబీ డియోల్అజయ్ దేవగణ్సైఫ్ అలీ ఖాన్ఆమిర్ ఖాన్సల్మాన్ ఖాన్షారుఖ్ ఖాన్వెంకటేష్గోవిందాఅక్షయ్ కుమార్ వంటి నటులతో ఎన్నో సినిమాల్లో నటించారామె.

2001లో అక్షయ్ కుమార్ను వివాహం చేసుకున్నారు ట్వింకిల్. అదే సంవత్సరం నుండి సినిమాల్లో నటించడం కూడా మానేశారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రొఫెషనల్ డిగ్రీ పట్టా లేకపోయినా, ఒక ఆర్కిటెక్ట్ వద్ద 2 ఏళ్ళు పనిచేసి, ఆ రంగంలో నైపుణ్యం సంపాదించుకున్నారు ఆమె. ముంబై ప్రధాన కార్యాలయంగా గల ది వైట్ విండో అనే ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపార సంస్థకు  సహ యజమాని కూడా అయ్యారు. గ్రేజింగ్ గోట్ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థకు సహ వ్యవస్థాపకురాలుగా దాదాపు 6 చిత్రాలకు సహ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు ట్వింకిల్. మరాఠీ భాషలో 72 మైల్స్ అనే సినిమా కూడా తీశారు. తీస్ మార్ ఖాన్ (2010)లో అతిథి పాత్రలో కనిపించారామె.

కెరీర్

[మార్చు]

రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన బర్సాత్ (1995) సినిమాలో బాబీ డియోల్ తో కలసి నటించారు ట్వింకిల్. ఈ సినిమాకు ఆమెను ధర్మేంద్ర ఎంచుకున్నారు. ఈ సినిమా విడుదల కాకముందే 2 ఇతర సినిమాలకు ఒప్పుకున్నారు ఆమె.[1] ఆ సంవత్సరానికిగానూ 6వ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది ఆ సినిమా.[2] ఫిలింఫేర్ ఉత్తమ తొలిచిత్ర నటి అవార్డు కూడా ఈ చిత్రం ద్వారా అందుకున్నారామె.[3] ఆ తరువాతి సంవత్సరమే అజయ్ దేవగణ్ సరసన జాన్, సైఫ్ అలీ ఖాన్ పక్కన దిల్ తేరా దీవానా సినిమాల్లో నటించారు. న్యూ స్ట్రెయిట్స్ టైమ్స్ పత్రిక కు చెందిన కె.ఎన్.విజియన్ ఆమె గురించి రాస్తూ "ఖన్నా సాధారణ హిందీ సినీ నటిలా ఉండరు" అని రాశారు.[4] దిల్ తేరా దీవానా సినిమా విడుదలైనప్పుడు మాత్రం "ఇంతకుముందు సినిమాల్లా కాకుండా ఈ చిత్రంలో ఖన్నా చాలా అందంగా ఉన్నారు, బాగా నటించారు" అని కితాబిచ్చారు ఆయన.[5] 1997లో విడుదలైన ఉఫ్! యే మొహొబ్బత్, ఇతిహాస్ సినిమాలు రెండూ ఫ్లాప్ అయ్యాయి.[6][7] 1998లో సల్మాన్ ఖాన్ తో కలసి నటించిన జబ్ ప్యార్ కిసీసే హోతా హై సినిమా ఒక్కటే విడుదలైంది.[8]

1999లో అక్షయ్ కుమార్ తో ఇంటర్నేషనల్ ఖిలాడీ, జుల్మీ అనే రెండు సినిమాల్లో నటించారు ట్వింకిల్. ఈ రెండు సినిమాలూ విజయం సాధించలేదు.[9] అదే సంవత్సరం తెలుగులో వెంకటేష్ తో కలసి  శీను సినిమాలో నటించారు ఆమె. షారుఖ్ ఖాన్ తో కలసి బాద్షా (1999)  సినిమాలో కనిపించారు ఖన్నా.[10] అదే సంవత్సరం సైఫ్ అలీ ఖాన్ తో కలసి యే హై ముంబై మేరీ జాన్ సినిమాలో చేశారు. 2000లో ఆమిర్ ఖాన్ తో కలసి మేళా సినిమాలో నటించారు ఖన్నా[11] ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.[12] మలేషియాలోని షా అలమ్  అవుట్ డోర్ స్టేడియంలో జుహీ చావ్లా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్  లతో  కలసి ఈమె చేసిన కచేరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.[13][14]  చల్ మేరే భాయ్ లో అతిథి పాత్రలోనూ, గోవిందా (నటుడు) తో కలసి జోరు కా గులాం, జోడి నెం.1 (2001) సినిమాల్లో నటించారు ఆమె.[15] ఈ సినిమాలో ఆమె నటనకు చాలా విమర్శలు వచ్చాయి.[16] ఒక ఇంటర్వ్యూలో కుచ్ కుచ్ హోతా హై సినిమాలో రాణీ ముఖర్జీ కన్నా ముందు ఆ పాత్రకు ట్వింకిల్ ను అనుకున్నటు కరణ్ జోహర్ తెలిపారు. 2001లో అక్షయ్ కుమార్తో వివాహం అయ్యాకా ఆమె సినిమాలకు దూరమయ్యారు.[17] తెలుగు సినిమా మనీకి రీమేక్ అయిన లవ్ కే లియే కుచ్ భీ కరేగా (2001) ఆమె ఆఖరి సినిమా. ఈ సినిమా ఏవరేజ్ హిట్ గా నిలిచింది.[18]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

డింపుల్ కపాడియా, రాజేష్ ఖన్నాల కూతురు ట్వింకిల్ ఖన్నా[19] ఈమె సోదరి రింకిల్ ఖన్నా కూడా నటే.[20] కాస్ట్యూం డిజైనర్ సింపుల్ కపాడియా ఈమెకు పిన్ని.[21] ఫిలింఫేర్ పత్రికకు జరిగే ఫోటోషూట్ లో మొదటిసారి అక్షయ్ ను కలిశారు ఆమె.[22] 17 జనవరి 2001న అక్షయ్ ను వివాహం చేసుకున్నారు ట్వింకిల్.[23] వీరికి ఒక కొడుకు ఆరవ్[24], ఒక కూతురు నితారా[25]. కుమార్ ఎక్కువగా తన విజయానికి కారణం ట్వింకిలే అని చెబుతూ ఉంటారు.[26][27] 2009లో పీపుల్ మేగజైన్ ట్వింకిల్ ను 4వ బెస్ట్ డ్రెస్డ్ సెలెబ్రటీ ఇన్ ఇండియాగా పేర్కొంది.[28] నవంబరు 2014 నుంచి ట్విట్టర్ ఎకౌంట్ వాడుతున్నారామె.[29]

సినిమాలు

[మార్చు]
చిత్రం సంవత్సరం పాత్ర నోట్స్ మూలాలు
బర్సాత్ 1995 టీనా ఒబెరాయ్ [30]
జాన్ 1996 కాజల్ [31]
దిల్ తేరా దీవానా 1996 కోమల్ [32]
ఉఫ్! యే మొహొబ్బత్ 1997 సోనియా వర్మ [33]
ఇతిహాస్ 1997 నైనా [34]
జబ్ ప్యార్ కిస్ సే హోతా హై 1998 కోమల్ సిన్హా [35]
ఇంటర్నేషనల్ ఖిలాడీ 1999 పాయల్ [36]
జుల్మీ 1999 కోమల్ దత్ [37]
శీను 1999 శ్వేత తెలుగు సినిమా [38]
బాద్షా 1999 సీమా మల్హోత్రా [39]
యే హై ముంబై మేరీ జాన్ 1999 జాస్మిన్ అరోరా [40]
మేళా 2000 రూపా సింగ్ [41]
చల్ మేరే భాయ్ 2000 పూజా అతిథి పాత్ర [42]
జోరు కా గులామ్ 2000 దుర్గా [43]
జోడి నెం.1 2001 టీనా [44]
లవ్ కే లియే కుచ్ భీ కరేగా 2001 అంజలి [45]
తీస్ మార్ ఖాన్ 2010 స్వంత పాత్ర సహ నిర్మాత, అతిథి పాత్ర [46]
థాంక్ యూ 2011 Co-producer [47]
పటియాలా హౌజ్ 2011 సహ నిర్మాత [47]
ఖిలాడి 786 2012 సహ నిర్మాత [47]
72 మైల్స్ 2013 సహ నిర్మాత; మరాఠీ సినిమా [48]
హాలీడే:ఎ సోల్జర్ ఈస్ నెవర్ ఆఫ్ డ్యూటీ 2014 సహ నిర్మాత [47]

అవార్డులు

[మార్చు]
అవార్డు సంవత్సరం చిత్రం ఫలితం మూలాలు
ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం 1996 బర్సాత్ గెలిచారు [3]
బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పురస్కారం 2014 హాలీడే:ఎ సోల్జర్ ఈస్ నెవర్ ఆఫ్ డ్యూటీ గెలిచారు [49]

References

[మార్చు]
 1. "More On Amitabh". Stabroek News. Guyana. 23 October 1994. p. 28. Retrieved 10 March 2015 – via Google News Archive.
 2. "Box Office 1995". Box Office India. Archived from the original on 30 January 2009. Retrieved 25 February 2015.
 3. 3.0 3.1 Pacheco, Sunitra (18 February 2015). Sharma, Sarika (ed.). "Twinkle Khanna: From Bollywood stardom to becoming Mrs Funny Bones". The Indian Express. Mumbai: Indian Express Limited. Retrieved 25 February 2015.
 4. Vijiyan, K.N. (2 June 1996). "When The Stars Didn't Twinkle". New Straits Times. p. 61. Retrieved 10 March 2015 – via Google News Archive.
 5. Vijiyan, K.N. (21 October 1996). "Lots of love scenes and bloodshed in 'Dil'". New Straits Times. p. 27. Retrieved 13 March 2015 – via Google News Archive.
 6. Pradhan, Bharathi S. (5 July 2009). "If men are from Mars, women are from heaven". The Telegraph. Kolkata: ABP Group. Retrieved 25 February 2015.
 7. Srinivasan, V S (2 February 1998). "Bollywood '97". Rediff.com. Retrieved 8 March 2015.
 8. Vijiyan, K.N. (20 June 1998). "Salman the sole reason to see predictable flick". New Straits Times. p. 21. Retrieved 13 March 2015 – via Google News Archive.
 9. Verma, Sukanya (9 December 2004). "Hot jodis that fizzle!". Rediff.com. Retrieved 3 March 2015.
 10. Sen, Sonali Ghosh (16 October 2012). K-K-Krazy About Khan. Rupa Publications India Pvt. Ltd. p. 84. ISBN 978-81-291-2837-9.
 11. Taliculam, Sharmila (8 January 2000). "Aamir is the star attraction". Rediff.com. Retrieved 3 March 2015.
 12. Nahta, Komal (11 January 2000). "Mela opens to decent audience". Rediff.com. Retrieved 3 March 2015.
 13. Waheed, Sajahan (27 October 1999). "Twinkle Twinkle Bollywood Stars". New Straits Times. p. 22. Retrieved 10 March 2015 – via Google News Archive.
 14. "Bollywood Fever peaks". Malaysian Business (1–4). Malaysia: New Straits Times Press: 117. 2000.
 15. Zaidi, S Hussain (21 November 2014). My Name is Abu Salem. Penguin Books Limited. p. 108. ISBN 978-93-5118-866-7.
 16. Taparia, Nidhi (14 April 2001). "As humorous as canned laughter". Rediff.com. Retrieved 3 March 2015.
 17. Jawed, Zeeshan (19 June 2005). "Twinkling at home". The Telegraph. Kolkata: ABP Group. Retrieved 25 February 2015.
 18. "Saif Ali Khan". Box Office India. 28 August 2006. Archived from the original on 6 February 2007. Retrieved 14 April 2007.
 19. Bajaj, J.K. (26 March 2014). On & Behind the Indian Cinema. Diamond Pocket Books Pvt Ltd. p. 1971. ISBN 978-93-5083-621-7.
 20. Sharma, Garima (9 October 2013). "Rinke Khanna becomes a mummy again". The Times of India. The Times Group. Retrieved 17 April 2015.
 21. "Akki, Twinkle to support Simple's son". Hindustan Times. HT Media. 25 November 2009. Retrieved 17 April 2015.
 22. Singh, Raghuvendra (28 May 2013). ""I never had to do anything to impress Twinkle" – Akshay Kumar". Filmfare. The Times Group. Retrieved 3 March 2015.
 23. Sarkar, Suparno (17 January 2016). "Akshay Kumar, Twinkle Khanna celebrate wedding anniversary with PDA on Twitter". International Business Times, India Edition. Retrieved 28 May 2016.
 24. Saran, Renu (25 February 2014). Encyclopedia of Bollywood–Film Actors. Diamond Pocket Books Pvt Ltd. p. 15. ISBN 978-93-5083-690-3.
 25. "CONGRATS! Akshay Kumar-Twinkle Khanna blessed with a baby girl on 25th september named Nitara Khanna Bhatia". Hindustan Times. HT Media. Retrieved 25 September 2012.
 26. Indo-Asian News Service (12 May 2013). "On Mother's Day Akshay thanks Twinkle for his success". Daily Pioneer. New Delhi. Retrieved 3 March 2015.
 27. Press Trust of India (28 April 2010). "Twinkle is my lucky charm: Akshay Kumar". Deccan Herald. New Delhi. Retrieved 3 March 2015.
 28. Indo-Asian News Service (25 September 2009). "Sonam Kapoor is Bollywood's best dressed celebrity". Deccan Herald. New Delhi. Retrieved 3 March 2015.
 29. Press Trust of India (10 November 2014). "Twinkle Khanna joins Twitter". Mid Day. Retrieved 3 March 2015.
 30. "Barsaat (1995)". The New York Times. Arthur Ochs Sulzberger, Jr. Retrieved 8 March 2015.
 31. Salam, Ziya Us (12 February 2012). "Man of two worlds and few words". The Hindu. The Hindu Group. Retrieved 23 February 2015.
 32. "Dil Tera Diwana (1996)". Bollywood Hungama. Retrieved 23 February 2015.
 33. "Uff Yeh Mohabbat (1996)". Bollywood Hungama. Retrieved 23 February 2015.
 34. "Itihaas Movie On Star Gold". The Times of India. The Times Group. 14 December 2014. Retrieved 23 February 2015.
 35. "Jab Pyar Kisi Se Hota Hai (1998)". Bollywood Hungama. Retrieved 23 February 2015.
 36. "International Khiladi (1999)". The New York Times. Arthur Ochs Sulzberger, Jr. Retrieved 8 March 2015.
 37. "Zulmi (1999)". Bollywood Hungama. Retrieved 23 February 2015.
 38. "Seenu". Oneindia.com. Retrieved 17 April 2015.
 39. "Baadshah (1999)". Bollywood Hungama. Retrieved 23 February 2015.
 40. Vijayakar, Rajiv (26 June 2002). "The star lineage". Rediff.com. Retrieved 23 February 2015.
 41. "Mela (2000)". Bollywood Hungama. Retrieved 23 February 2015.
 42. "Chal Mere Bhai (2000)". Bollywood Hungama. Retrieved 23 February 2015.
 43. Ashraf, Syed Firdaus (16 June 2000). "A sad, sad film". Rediff.com. Retrieved 23 February 2015.
 44. Adarsh, Taran (13 April 2001). "Jodi No.1 : Movie review". Bollywood Hungama. Retrieved 23 February 2015.
 45. Verma, Sukanya (29 June 2001). "A fun rollercoaster ride : Love Ke Liye Kuch Bhi Karega rolls". Rediff.com. Retrieved 23 February 2015.
 46. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; TMK అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 47. 47.0 47.1 47.2 47.3 Sen, Sushmita (18 January 2015). "Akshay Kumar, Twinkle Khanna Celebrate 14th Marriage Anniversary, Snapped at PVR". International Business Times. IBT Media. Retrieved 25 February 2015.
 48. "Take a look at the poster of 72 Miles – Ek Pravas". The Times of India. The Times Group. Retrieved 17 April 2015.
 49. "Big Star Entertainment Award's Nomination". BIG FM 92.7. Archived from the original on 21 డిసెంబరు 2014. Retrieved 17 April 2015.