Jump to content

ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
(Press Trust of India నుండి దారిమార్పు చెందింది)
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
తరహాలాభాపేక్ష లేని సహకార సంస్థ[1]
స్థాపన{{{foundation}}}
ప్రధానకేంద్రము
కార్య క్షేత్రంప్రపంచవ్యాప్తం
కీలక వ్యక్తులు
  • Aveek Sarkar
    (Chairman)
  • Vijay Joshi
    (Editor-in-Chief)
పరిశ్రమవార్తల మీడియా
రెవిన్యూIncrease 1.73 బిలియను (US$22 million)[2]
ఉద్యోగులు1,000+
విభాగాలుPTI Bhasha, PTI Photo, PTI Graphics

ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద వార్తా సంస్థ. [3] ఇది పిటిఐ గా ప్రసిద్ధి చెందింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది లాభాపేక్ష లేని, 500 పైచిలుకు భారతీయ వార్తాపత్రికల సహకార సంస్థ. 2022 జనవరి 1 నాటికి సంస్థలో 400 మంది జర్నలిస్టులతో సహా మొత్తం 500 మంది ఉద్యోగులున్నారు. దేశంలోని చాలా జిల్లా ప్రధాన కార్యాలయాల్లో దాదాపు 400 మంది పార్ట్‌టైమ్ కరస్పాండెంట్లున్నారు. [4] ప్రపంచవ్యాప్తంగా ప్రధాన రాజధానులు, ముఖ్యమైన వ్యాపార కేంద్రాలలో కూడా PTI కి కరస్పాండెంట్లున్నారు. 1948-49లో రాయిటర్స్ వారి అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలను PTI చేపట్టింది. [5] [6] ఇది ఇంగ్లీషు, హిందీ రెండింటిలోనూ వార్తలను, సమాచారాన్నీ అందిస్తుంది. [7] [8] [9] [10]

అవలోకనం

[మార్చు]
PTI 50వ వార్షికోత్సవ సందర్భంగా 1999 లో విడుదల చేసిన స్టాంపు, పైన దాని లోగోతో.

అసోసియేటెడ్ ప్రెస్, ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్సే, ది న్యూయార్క్ టైమ్స్, బ్లూమ్‌బెర్గ్ LP వంటి భారతదేశం వెలుపల ఉన్న 100 వార్తా ఏజెన్సీలతో సహా అనేక ఇతర వార్తాసంస్థలతో PTI, సమాచారాన్ని పరస్పరం పంచుకుంటుంది. హిందూస్తాన్ టైమ్స్, ది స్టేట్స్ మన్, ది ట్రిబ్యూన్, న్యూస్ 18, NDTV, ఇండియా టుడే , ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ది వైర్ లు పిటిఐ చందాదారుల్లో కొందరు. PTIకి బ్యాంకాక్, బీజింగ్, కొలంబో, దుబాయ్, ఇస్లామాబాద్, కౌలాలంపూర్, మాస్కో, న్యూయార్క్, వాషింగ్టన్ DC లలో కార్యాలయాలు ఉన్నాయి. [11]

దీని ప్రస్తుత చైర్మన్ అవీక్ సర్కార్. [12] అతను ABP గ్రూపుకు వైస్ చైర్మన్ కూడా. [13]

PTI చరిత్ర

[మార్చు]
సమయం ఈవెంట్
1905 అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా (API) ని KC రాయ్ ఆవిష్కరించారు. దీనిని మొట్టమొదటి భారతీయ వార్తా సంస్థ అని భావిస్తారు [14]
1919 API కార్యకలాపాలను రాయిటర్స్ స్వాధీనం చేసుకుంది. కానీ ఆ తరువాత కూడా API క్రెడిట్ లైన్‌నే ఉపయోగించింది
1945 API ని పూర్తిగా రాయిటర్స్ యాజమాన్యంలోని ప్రైవేట్ లిమిటెడ్ ఇండియన్ కంపెనీగా నమోదు చేసారు
1947, 27 ఆగస్టు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాను మద్రాసులో స్థాపించారు
1949, 1 ఫిబ్రవరి PTI వార్తా సేవలను ప్రారంభించింది, API నుండి కార్యకలాపాలను చేపట్టింది. కానీ రాయిటర్స్‌తో లింక్‌లను నిర్వహిస్తూనే ఉంది. [5] [15]
1953 PTI రాయిటర్స్ నుండి విడివడి, స్వతంత్రంగా ఒక స్వేచ్ఛా ఏజెంటు అయింది
1976 PTI ఎకనామిక్ సర్వీస్ ప్రారంభించబడింది
1976, ఫిబ్రవరి ఎమర్జెన్సీ సమయంలో వచ్చిన ఒత్తిడి వలన పిటిఐ, యుఎన్‌ఐ, సమాచార్ భారతి, హిందుస్థాన్ సమాచార్ లు కలిసి ' సమాచార్'గా ఆవిర్భవించాయి. [16]
1978, ఏప్రిల్ PTI, మిగిలిన మూడు వార్తా ఏజెన్సీలు స్వతంత్రంగా వార్తా కార్యకలాపాలను మళ్ళీ ప్రారంభించడానికి తమ అసలు యూనిట్‌లకు తిరిగి వెళ్ళాయి
1980, జూలై PTI ఫీచర్ సర్వీస్ ప్రారంభమైంది
1981, అక్టోబరు PTI సైన్స్ సర్వీస్ ప్రారంభమైంది
1982, నవంబరు PTI స్కాన్, ఆన్-స్క్రీన్ న్యూస్ డిస్‌ప్లే సేవను ప్రారంభించింది
1984 యునైటెడ్ స్టేట్స్‌లోని చందాదారుల కోసం PTI సేవ ప్రారంభమైంది
1985 వార్తల కార్యకలాపాల కంప్యూటరైజేషన్ UKలోని చందాదారుల కోసం ప్రారంభించబడిన PTI సేవను ప్రారంభించింది
1986, ఫిబ్రవరి PTI-TV ప్రారంభమైంది
1986, ఏప్రిల్ PTI-భాష ప్రారంభమైంది, దీనిని ద్విభాషగా మార్చారు. ఇది సమాచార్ భారతి ద్వారా ప్రారంభమైంది
1986, ఆగస్టు Insat-IB ద్వారా వార్తలు, చిత్రాల ప్రయోగాత్మక ప్రసారం ప్రారంభమైంది. కంప్యూటర్ సిస్టమ్ పూర్తిగా పనిచెయ్యడం మొదలైంది.
1987, ఆగస్టు స్టాక్‌స్కాన్ I మొదలైంది
1987, అక్టోబరు PTI ఫోటో సర్వీస్ మొదలైంది
1992, ఆగస్టు PTI మ్యాగ్‌ని ప్రారంభించింది
1993, ఆగస్టు PTI గ్రాఫిక్స్ సర్వీస్ మొదలైంది
1995, మార్చి PTI స్టాక్‌స్కాన్ IIని ప్రారంభించింది
1996, ఫిబ్రవరి ఆసియా దేశాలలో ఆర్థిక అవకాశాలపై ఆన్‌లైన్ డేటా బ్యాంక్‌ను అందించే విదేశీ రిజిస్టర్డ్ కంపెనీ, ఆసియా పల్స్‌లో మొదటిసారిగా PTI పెట్టుబడి పెట్టింది.
1997, డిసెంబరు PTI ఫోటో-డయల్ అప్ సౌకర్యాన్ని పరిచయం చేసింది
1999, మార్చి PTI గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది. ఇంటర్నెట్‌లోకి ప్రవేశించింది
2003, సెప్టెంబరు PTI తన వార్తలు, ఫోటో సేవల ఇంటర్నెట్ డెలివరీని ప్రారంభించింది
2007, జూలై వార్తలు, ఫోటో సేవలను అందించడానికి PTI KU-బ్యాండ్ VSAT వ్యవస్థ ప్రారంభించింది
2010, మార్చి వార్తలు (.txt .xml), ఫోటో సేవల డెలివరీ కోసం NewsViewని ప్రారంభించింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Press Trust of India sacks 297 staff in one day / IFJ". International Federation of Journalists (in ఇంగ్లీష్). 26 January 2019. Retrieved 28 January 2019.
  2. "Viveck Goenka of Indian Express elected new PTI Chairman". India Today (in ఇంగ్లీష్). Retrieved 28 January 2019.
  3. Embassy of India (Moscow) – NEWS AGENCIES Archived 5 జూన్ 2009 at the Wayback Machine
  4. "Overview of PTU". Press Trust of India. Retrieved 1 February 2014.
  5. 5.0 5.1 About PTI, Press Trust of India, retrieved 14 March 2017.
  6. News Agencies: Their Structure and Operation (PDF), UNESCO, 1953, pp. 16, 21
  7. Mehta, Archit (9 April 2020). "Communal attack in Bawana shared with false claim of Muslim man injecting fruits with spittle". Alt News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 24 ఏప్రిల్ 2020. Retrieved 9 May 2020.
  8. "2 Cases of Coronavirus Confirmed in Kolkata? No, Media Misreported". The Quint (in ఇంగ్లీష్). 14 February 2020. Retrieved 9 May 2020.
  9. Alphonso, Anmol (22 April 2020). "PTI Misreports Maharashtra Home Minister On Palghar Lynching". www.boomlive.in (in ఇంగ్లీష్). Retrieved 9 May 2020.
  10. "Has the UP Govt Slashed Funds for Education? Here's a Fact Check". The Quint (in ఇంగ్లీష్). 19 July 2017. Retrieved 9 May 2020.
  11. "AsiaNet – Agencies". www.asianetnews.net.
  12. "Aveek Sarkar is new PTI Chairman". The Tribune (Chandigarh). 31 August 2020. Retrieved 18 May 2021.
  13. "ABP's Aveek Sarkar new PTI chairman". The Times of India. 31 August 2020. Retrieved 18 May 2021.
  14. News Agencies: Their Structure and Operation (PDF), UNESCO, 1953, p. 10
  15. News Agencies: Their Structure and Operation (PDF), UNESCO, 1953, pp. 16, 21
  16. News Agencies from Pigeon to Internet. Sterling Publishers Pvt. Ltd. 2007. p. 51.