దబంగ్ 3
దబంగ్ 3 | |
---|---|
దర్శకత్వం | ప్రభు దేవా |
రచన | డైలాగ్స్: దిలీప్ శుక్లా అలోక్ ఉపాధ్యాయ |
స్క్రీన్ ప్లే | సల్మాన్ ఖాన్ ప్రభు దేవా అలోక్ ఉపాధ్యాయ |
కథ | సల్మాన్ ఖాన్ |
నిర్మాత | సల్మాన్ ఖాన్ అర్బాజ్ ఖాన్ నిఖిల్ ద్వివేది |
తారాగణం | సల్మాన్ ఖాన్ సుదీప్ సోనాక్షి సిన్హా సాయి మంజ్రేకర్ అర్బాజ్ ఖాన్ |
ఛాయాగ్రహణం | మహేష్ లిమాయె |
కూర్పు | రితేష్ సోని |
సంగీతం | పాటలు: సాజిద్ – వాజిద్ నేపధ్య సంగీతం: సందీప్ శిరోద్కర్ |
నిర్మాణ సంస్థలు | సల్మాన్ ఖాన్ ఫిలింస్ అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ సాఫ్ర్న్ బ్రాడ్కాస్ట్ & మీడియా లిమిటెడ్ (నిఖిల్ ద్వివేది) |
విడుదల తేదీ | 20 డిసెంబరు 2019 |
సినిమా నిడివి | 141 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
దబంగ్ 3 2019లో విడుదలైన హిందీ సినిమా. సల్మాన్ ఖాన్ ఫిలింస్, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సాఫ్ర్న్ బ్రాడ్ కాస్ట్ & మీడియా లిమిటెడ్ బ్యానర్ల పై సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది నిర్మించారు. సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా, సుదీప్, సాయీ మంజ్రేకర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించగా 20 డిసెంబర్ 2019న విడుదలైంది.
కథ
[మార్చు]చుల్‌బుల్ పాండే (సల్మాన్‌ఖాన్) ఓ పవర్‌ఫుల్ పోలీస్. తన భార్య రాజో (సోనాక్షి సిన్హా), సోదరుడు మక్కీ (అర్బాజ్‌ఖాన్)తో ఎంతో సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సల్మాన్ తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసి ఎందరో అమ్మాయిలను రక్షిస్తాడు. ఈ విషయం ధనవంతుడైన బల్లి సింగ్ (సుదీప్)కు కోపం తెప్పిస్తుంది. అయితే ఇద్దరూ ఎదురుపడినప్పుడు ఇద్దరి మధ్యా గతంలో ఏదో జరిగిందని తెలుస్తోంది. పాండే గతానికి బల్లి సింగ్ కు సంబంధం ఏంటి ? పాండే జీవితాన్ని ఈ బల్లి సింగ్ ఎలా ఎఫెక్ట్ చేసాడు ? అసలు ఏమైంది ? తర్వాత ఏమవుతుంది? అనేదే మిగతా సినిమా కథ.[1][2]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సల్మాన్ ఖాన్ ఫిలింస్
అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్
సాఫ్ర్న్ బ్రాడ్ కాస్ట్ & మీడియా లిమిటెడ్ - నిర్మాత: సల్మాన్‌ఖాన్, అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది
- దర్శకత్వం: ప్రభుదేవా
- సంగీతం: సాజిద్ – వాజిద్ , సుదీప్ శిరోద్కర్ (నేపధ్య సంగీతం)
- సినిమాటోగ్రఫీ: మహేష్ లిమాయె
మూలాలు
[మార్చు]- ↑ HMTV (20 December 2019). "దబంగ్ 3 సినిమా రివ్యూ". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
- ↑ India Today (20 December 2019). "Dabangg 3 Movie Review: Salman Khan film is dabanggai ki height" (in ఇంగ్లీష్). Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.