తునీషా శర్మ
తునీషా శర్మ | |
---|---|
జననం | |
మరణం | 2022 డిసెంబరు 24 | (వయసు 20)
మరణ కారణం | ఆత్మహత్య |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2013–2022 |
తునీషా శర్మ (2002 జనవరి 4 - 2022 డిసెంబరు 24 ) భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి.[1] ఆమె 2015లో భారత్ కా వీర్ పుత్ర – మహారాణా ప్రతాప్‌లో చాంద్ కవార్‌గా నటించింది. చక్రవర్తి అశోక సామ్రాట్‌లో రాజ్‌కుమారి అహంకార, ఇష్క్ సుభాన్ అల్లాలో జరా/బబ్లీగా, ఇంటర్నెట్ వాలా లవ్‌లో ఆధ్యా వర్మ పాత్రలు పోషించినందుకు ఆమె బాగా పేరు తెచ్చుకుంది.
2016లో వచ్చిన హిందీ సినిమా ఫితూర్ లో కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్రను పోషించిన ఆమె బార్ బార్ దేఖో, కహానీ 2, దబాంగ్ 3 సినిమాల్లోనూ నటించింది.
బాల్యం
[మార్చు]2002 జనవరి 4న చండీగఢ్‌లో తునీషా శర్మ జన్మింది. ఆమె తల్లి వనితా శర్మ.
కెరీర్
[మార్చు]తునీషా శర్మ తన కెరీర్‌ను 13 ఏళ్లకే సోనీ టీవీలో ప్రసారమైన భారత్ కా వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్‌తో ప్రారంభించింది.[2] ఆమె కలర్స్ టీవీలో వచ్చిన చక్రవర్తి అశోక సామ్రాట్‌లో రాజకుమారి అహంకార పాత్ర పోషించింది. 2016లో ఫితూర్ చిత్రంలో యంగ్ ఫిర్దౌస్‌గా తన సినీ రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరంలో బార్ బార్ దేఖోలో యంగ్ దియాగా, కహానీ 2: దుర్గా రాణి సింగ్‌లో మినీగా నటించింది.[3]
2017లో షేర్-ఎ-పంజాబ్: మహారాజా రంజిత్ సింగ్‌లో ఆమె మెహతాబ్ కౌర్‌గా నటించిమెప్పించింది.[4] 2018 నుండి 2019 వరకు కలర్స్ టీవీ ఇంటర్నెట్ వాలా లవ్‌లో ఆధ్య వర్మ పాత్రను ఆమె పోషించింది.[5]
2019లో జీటీవీ ఇష్క్ సుభాన్ అల్లాలో జరా / బాబ్లీగా కనిపించింది. 2021లో సబ్ టీవీ హీరో – గయాబ్ మోడ్ ఆన్ సీజన్ 2లో ఆమె ఎ.ఎస్.పి అదితిగా కనిపించింది. 2022లో ఆమె సోనీ సబ్ షో అలీ బాబా: దస్తాన్-ఈ-కాబుల్ లో షీజాన్ మొహమ్మద్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది.[6]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]టెలివిజన్
[మార్చు]Year | Title | Role | Notes | Ref. |
---|---|---|---|---|
2015 | భారత్ కా వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్ | చంద్ కన్వర్ | [7] | |
చక్రవర్తి అశోక సామ్రాట్ | రాజకుమారి అహంకార | [8] | ||
భన్వర్ - కలియుగ్ కి హైరాతంగెజ్ కహానియా | - | |||
2016 | గబ్బర్ పూంచ్‌వాలా | సాన్యా | [9] | |
2017 | షేర్-ఎ-పంజాబ్: మహారాజా రంజిత్ సింగ్ | మెహతాబ్ కౌర్ | [10] | |
2018–2019 | ఇంటర్నెట్ వాలా లవ్ | ఆద్యా వర్మ | [11] | |
2019–2020 | ఇష్క్ సుభాన్ అల్లా | జరా/బబ్లీ | [12] | |
2021 | హీరో - గయాబ్ మోడ్ ఆన్ | ఏఎస్పీ అదితి జామ్వాల్ | సీజన్ 2 | [13] |
2022 | అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్ | షెహజాది మరియం | చాప్టర్ 1 | [14] |
స్పెషల్ అప్పియరెన్స్
[మార్చు]Year | Title | Role | Ref. |
---|---|---|---|
2018 | ఇష్క్ మే మార్జవాన్ | ఆద్యా వర్మ | |
సిల్సిలా బడాల్టే రిష్టన్ కా | |||
2021 | మేడం సార్ | ఏఎస్పీ అదితి జామ్వాల్ | |
వాగ్లే కి దునియా – నయీ పీధి నయే కిస్సే |
సినిమాలు
[మార్చు]Year | Title | Role | Notes | Ref. |
---|---|---|---|---|
2016 | ఫితూర్ | యువ ఫిర్దౌస్ | [15] | |
బార్ బార్ దేఖో | యంగ్ దియా | [16] | ||
కహానీ 2: దుర్గా రాణి సింగ్ | మిన్నీ సిన్హా | [17] | ||
2018 | కృష్ణ | రుహాని | [18] | |
2019 | దబాంగ్ 3 | హాస్టైల్ గర్ల్ | అతిధి పాత్ర | [19] |
మ్యూజిక్ వీడియోలు
[మార్చు]Year | Title | Singer | Ref. |
---|---|---|---|
2021 | సర్దారి(చాప్టర్ 1) | మానవగీత్ గిల్ | [20] |
ప్యార్ హో జాయేగా | విశాల్ మిశ్రా | [21] | |
నైనోన్ కా యే రోనా జాయే నా | రాజ్ బర్మన్ | [22] | |
2022 | తూ బైతీ మేరే సామ్నే | [23] | |
హీరియే | అభి దత్ | [24] | |
తూ బైతీ మేరే సామ్నే | రాజ్ బర్మన్ | [25] | |
పానీ నా సమాజ్ | [26] |
మరణం
[మార్చు]ఆమె 2022 డిసెంబరు 24న టెలివిజన్ సీరియల్ అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్ సెట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె వయసు 20 సంవత్సరాలు.[27]
ఈ కేసును హత్య, ఆత్మహత్య అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సహనటుడు షీజన్ మహమ్మద్ ఖాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆత్మహత్యకు ప్రేరిపించినట్లు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసారు.[28]
మూలాలు
[మార్చు]- ↑ "About Tunisha Sharma". ZEE5 (in ఇంగ్లీష్). 15 September 2020. Retrieved 11 April 2022.
- ↑ "Tunisha Sharma: చిత్ర పరిశ్రమలో విషాదం.. యువ నటి ఆత్మహత్య". web.archive.org. 2022-12-25. Archived from the original on 2022-12-25. Retrieved 2022-12-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Tunisha Sharma Filmography". Box Office India. Retrieved 27 March 2017.
- ↑ "Tunisha Sharma joins 'Sher-E-Punjab'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 24 February 2017.
- ↑ "Child actress Tunisha Sharma of Maharana Pratap fame to romance Shivin Narang". The Times of India.
- ↑ Service, Tribune News. "Tunisha Sharma plays the lead in Alibaba— Dastaan-e- Kabul". Tribuneindia News Service. Archived from the original on 2022-08-12. Retrieved 2022-12-25.
- ↑ "Young brigade take over TV". The Times of India (in ఇంగ్లీష్). 15 November 2018. Retrieved 1 November 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Damanpreet and Tunisha's friendship since Ashoka - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 1 November 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Tunisha Sharma: Work & Personal Life - Zee5 News". ZEE5 (in ఇంగ్లీష్). 15 September 2020. Retrieved 1 November 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "When Maharaja Ranjit Singh lead actors Damanpreet and Tunisha discovered their old friendship - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 1 November 2021.
- ↑ "Shivin Narang is back to work and excited to be paired opposite Fitoor actor Tunisha Sharma". Hindustan Times (in ఇంగ్లీష్). 9 July 2018. Retrieved 1 November 2021.
- ↑ "Ishq Subhan Allah: Tunisha Sharma makes an entry into the show - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 1 November 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Tunisha Sharma to play the new heroine in Hero: Gayab Mode On - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 1 November 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Exclusive! I'm elated to be a part of Alibaba-Dastaan-e-Kaabul, says Tunisha Sharma - Times of India". The Times of India.
- ↑ "Movie review 'Fitoor': Falls short of all expectations". Deccan Chronicle (in ఇంగ్లీష్). 13 February 2016. Retrieved 1 November 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Tunisha Sharma: Biography - Zee5 News". ZEE5 (in ఇంగ్లీష్). 15 September 2020. Retrieved 1 November 2021.
- ↑ "विद्या बालन की यह 'बेटी' अब दिखती है ऐसी, देख लें आप भी". Amar Ujala (in హిందీ). Retrieved 1 November 2021.
- ↑ "Krina - Title Track | Hindi Video Songs - Times of India". The Times of India.
- ↑ "Tunisha Sharma: Biography". Zee5 (in ఇంగ్లీష్). 15 September 2020. Retrieved 1 November 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Watch New Punjabi Hit Song Music Video - 'Sardari' Sung By Manavgeet Gill | Punjabi Video Songs - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 16 September 2021.
- ↑ "Vishal Mishra comes out with new love song 'Pyaar Ho Jayega'". ANI News (in ఇంగ్లీష్). Retrieved 16 September 2021.
- ↑ "ये रिश्ता क्या कहलाता है फेम मोहसिन खान का टूटा दिल! Nainon Ka Ye Rona Jaaye Na सॉन्ग हो रहा वायरल". Prabhat Khabar - Hindi News (in హిందీ). Retrieved 8 December 2021.
- ↑ "Tu Baithe Mere Samne featuring Paras Arora and Tunisha Sharma out now". The Times of India.
- ↑ Heeriye - YouTube Music (in ఇంగ్లీష్), retrieved 11 April 2022
- ↑ "Tu Baithe Mere Samne sung by Raj Barman featuring Paras Arora and Tunisha Sharma". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 5 July 2022.
- ↑ Paani Na Samajh - Paras Arora, Tunisha Sharma | Raj Barman, Vipin Patwa, Kumaar| Zee Music Originals (in ఇంగ్లీష్), retrieved 5 July 2022
- ↑ "సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటి తునీషా శర్మ ఆత్మహత్య". web.archive.org. 2022-12-25. Archived from the original on 2022-12-25. Retrieved 2022-12-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Tunisha Sharma death: యువ నటి తునిషా ఆత్మహత్య కేసులో సహనటుడు షీజన్ అరెస్టు." web.archive.org. 2022-12-26. Archived from the original on 2022-12-26. Retrieved 2022-12-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)